వాడుకరి చర్చ:Srinivasa/పాత చర్చ 1
ఒక సూచన
[మార్చు]శ్రీనివాస! వ్యాసం పేజీలో వ్యాసానికి సంబంధించిన విషయం ఉండాలి; సభ్యుల అభిప్రాయాలు, సందేశాలు, సంబోధనలు అక్కడ రాయరాదు. తెలుగు సినీ గీతరచయితలు పేజీలో మీరు రాసినది అక్కడ రాయదగింది కాదు. దాని మీ చర్చా పేజీలోకి మార్చవచ్చేమో చూడండి! అలాగే మీపేరు కొత్త సభ్యుల పట్టికలో కాక Wikipedia:Wikipediansలో చేర్చండి.థాంక్స్. __చదువరి(చర్చ, రచనలు) 14:13, 3 జనవరి 2006 (UTC)
గౌరవవాచకాలు
[మార్చు]వికీపీడియాలో గౌరవవాచకాలు వాడరాదని సూచనలున్నాయండీ. రచ్చబండలో ఒకసారి చూడండి. అందుకే చరిత్రలో ఈరోజు లో అలా రాసాను. మీ అభిప్రాయాన్ని అక్కడ రాయండి. __చదువరి(చర్చ, రచనలు) 13:26, 6 జనవరి 2006 (UTC)
మీ సందేశము
[మార్చు]మీరు అంత చిన్నదానికే క్షమాపణ చెప్పకర్లేదండి. వికిపీడియాకు స్వాగతము. మీ పేజీ చాలా బాగుంది --వైఙాసత్య 02:21, 8 మార్చి 2006 (UTC)
తెలుగు సినిమా పాటలు
[మార్చు]శ్రీనివాస గారు, తెలుగు వికిలో మీ కృషి అభినందనీయము. తెలుగు సినిమా పాటలు (పూర్తి పాటలు) ఇక్కడ ప్రచరించుట సబబు కాదు. అది కాపీ హక్కుల ఉల్లంఘణ కింద వస్తుంది. ఒకవేళ వీటి కాపీహక్కులు మీ పేర ఉన్నా వీటిని ప్రచురించుటకు వికిపుస్తకములు సరి అయిన స్థలము. తెలుగు వికిలో ఇదివరకట తెలిసో తెలియకో అన్నమయ్య కీర్తనలు, భగవద్గీత మొదలైనవి ప్రచురించడము జరిగింది. అవన్నీ రేపో మాపో వికిపుస్తములకు తరలించ వలసినవే. --వైఙాసత్య 01:14, 15 మార్చి 2006 (UTC)
బాట్లు
[మార్చు]వైఙాసత్యా, నేనూ సాఫ్టువేర్ ప్రోగ్రామర్ నే. నాకు బాట్ ల గురించి తగిన సమాచారము ఇస్తే నేనూ ప్రయత్నిస్తాను.
- చాలా థాంక్స్, తెలుగుకు కస్టమైజ్ చేసిన బాట్ ఉంటే చాలా పనులు సులువుగా అయిపోతాయి. వికిపీడియాలో యాంత్రికమైన పనులు చక్కబెట్టడానికి పైథాన్ భాషలో ఒక పనిముట్ల పాకేజీని తయారు చేశారు. దాని కోడ్ కూడా లభ్యమవుతుంది. కాకపోతే దానిని తెలుగుకు అనుగునంగా తీర్చిదిద్దాలి. ఇంకా వివరాలకు ఇక్కడ చూడండి .en:Wikipedia:Bots [1]--వైఙాసత్య 08:23, 16 మార్చి 2006 (UTC)
- వైఙాసత్యగారు చెప్పిన పేజీలను సందర్శిస్తే చాలు, బాట్‌లు తయారు చేయటానికి కావలిసిన సమాచారం మొత్తం దొరుకుతుంది. దీనికోసం మీరు మొదట పైథాన్ అనే సాఫ్టువేరు భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. తరువాత మీ కంప్యూటర్లో పైథాన్ భాషను download చేసుకుని install చేసుకోవాలి. తరువాత పైథాన్ భాషలోనే రాయబడిన en:pywikipedia లైబ్రరీని మీ కంప్యూటరులోకి download చేసుకోండి. అందులో కొన్ని ఉదాహరణ పేజీలు కూడా ఉన్నాయి, వాటితో ఆడుకుని pywikipedia గురించి మరింత తెలుసుకోండి. అక్కడ ఉన్న ఉదాహరణ ప్రోగ్రాములు ఏం చేస్తాయో తెలుసుకోవాలంటే గనక మెటా వికీలో ఉన్న ఈ పేజీని సందర్శించండి. వైఙాసత్యగారు అన్నట్లు తెలుగుకు స్తానీకరించిన బాట్‌ను మనము తయారు చేసుకోగలగాలి. ఇంకా ఏమయినా సందేహాలు ఉంటే అడగండి --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 04:35, 9 ఏప్రిల్ 2006 (UTC)
- శ్రీనివాస గారు, బాటుపై మీరు ఆసక్తిగా ఉన్నారనుకుంటున్నాను. అవకాశముంటే ఈ విక్షనరీ లింకు చూడండి. అక్కడ బాటు అవసరం చాలా ఉంది. __చదువరి (చర్చ, రచనలు) 06:54, 20 ఏప్రిల్ 2006 (UTC)థాంక్స్!
చిన్న సూచన
[మార్చు]మీరు మీ ఈ మెయిల్ ఐడిని నా చర్చా పేజీలో బహిరంగ పరిచినారు. స్పామింగు అనేది నిత్య కృత్యమైన ఈ రోహులలో ఇది ఎంతమాత్రం మంచిదికాదు, కావున దానిని నా చర్చాపేజి నుండి తొలగిస్తున్నాను. మీకు ఏమయినా సూచనలు సలహాలు కావాలంటే ఇక్కడే ఇలా చర్చా పేజీలలోనే మాట్లాడుకుందాము. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 04:35, 9 ఏప్రిల్ 2006 (UTC)
ఆంగ్ల వ్యాసములు
[మార్చు]శ్రీనివాస గారు, మీరు తెలుగు వికిపీడియాలో చేస్తున్న కృషి మరియు మీ ఉత్సుతక బాగుంది. ఒకేసారి అన్నిన్ని వ్యాసాలు ఆంగ్లములో ఇక్కడ అతికించితే వాటిని తెలుగులో అనువదించడానికి చాలా కష్టపడాలి. ఇప్పటికే 100+ పైగా వ్యాసములు అనువాదమును నోచుకోలేదు. నేను కొత్తగ వచ్చినప్పుడు ఇదే పద్ధతిన తయారు చేసిన పేజీలను ఇప్పటికీ అనువదిస్తూనే ఉన్నాను. మనల్ని చూసి కొత్త సభ్యులు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తే తెలుగు పేజీలకంటే ఆంగ్ల పేజీలు ఎక్కువ తగిలే అవకాశము లేకపోలేదు. అందరమూ కలసి వీటిని తర్జుమా చేద్దాము. ఏమంటారు?--వైఙాసత్య 04:37, 12 జూన్ 2006 (UTC)
మార్గదర్శకము గురించి
[మార్చు]వైజాసత్యా, మొదటి పేజీలోని మార్గదర్శకములో లింకులు ఆంగ్లములో ఉన్నాయేంటి??? - శ్రీనివాస 05:59, 12 జూన్ 2006 (UTC)
అవును అప్పడప్పుడు అలా విచిత్రముగా ఆంగ్లములోకి మారుతుంటాయి మళ్లి తిరిగీ వాటికవే తెలుగులోకి వస్తాయి. దీని వెనుక ఉన్న కధేంటో ఇప్పటికి మిస్టరీనే (బహుశా మీడియా వికి ప్రోగ్రామర్స్ పనేమో?) కానీ వీరు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్ధము కాదు. బగ్‌జిల్లా లో ఫిర్యాదు చేసి చూస్తాను.--వైఙాసత్య 13:34, 12 జూన్ 2006 (UTC)
పదాలు
[మార్చు]వైజాసత్యా, feature film, jury, lifetime achievement లను తెలుగులో ఏమని అంటారు? - శ్రీనివాస 20:53, 18 జూన్ 2006 (UTC)
- feature film - పూర్తి నిడివి చిత్రము (లఘు చిత్రానికి వ్యతిరేక పదము)
- jury - ప్రమాణ గణము అని నిఘంటువులో ఉంది దానికంటే జ్యూరీ అనే పదమే చాలామందికి పరిచయము.
- lifetime achievement - జీవిత కాలపు కృషి
--వైఙాసత్య 01:37, 19 జూన్ 2006 (UTC)
శ్రీనివాస గారూ, నమస్కారం. సిరివెన్నెల గురించిన వ్యాసంలో - ఆంధ్రవిశ్వకళాపరిషత్తులో .... ఎం.ఏ. చేస్తుండగా, సిరివెన్నెల సినిమాకు అవకాశం వచ్చిందని రాసారు. కాని, ఆయన సహోద్యోగి గా పనిచేసిన అనుభవంతో, ఈ సమాచారం సరియైనది కాదని నా అభిప్రాయం. పూర్తి వివరాలు తదుపరి మెయిల్ లో ఇస్తాను. (27 సంవత్సరాల గతంలోకి వెళ్ళాలి, అందువలన కొంచెం ఆలస్యం కావచ్చు. ఈ లోగా మీరు కూడా ప్రయత్నించగలరు. కామేష్ 20:19, 4 సెప్టెంబర్ 2006 (UTC)
కృతజ్ఞతలు
[మార్చు]నన్ను అధికారిగా చేయాలన్న ప్రతిపాదనకు మద్దతిచ్చి, దాన్ని జయప్రదం చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు. __చదువరి (చర్చ, రచనలు) 16:26, 28 సెప్టెంబర్ 2006 (UTC)
మాయా వ్యాసానువాదం
[మార్చు]శ్రీనివాసగారు, మీరు మార్చి 8 2006న మాయా అనే వ్యాసాన్ని ఆంగ్ల వికీపీడియా నుండి సేకరించి అనువాదించటం మొదలు పెట్టారు. దయచేసి ఆ అనువాదాన్ని త్వరగా పూర్తి చేయండి. వికీపిడియాలో ప్రస్తుతం పేరుకు పోయిన అనువాదాలన్నిటి పూర్తిచేసేయాలని అనుకుంటున్నారు, తద్వారా ఇకపై తెలుగు వికీపీడియాలో వ్యాసాలన్నీ తెలుగులోనే ఉంటాయి. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 09:24, 13 డిసెంబర్ 2006 (UTC)
- మాయా వ్యాసాన్ని మరల మొదలు పెట్టినందుకు దన్యవాదాలు. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 12:31, 28 డిసెంబర్ 2006 (UTC)
కృతజ్ఙతలు
[మార్చు]శ్రీనివాసరాజూ, నన్ను నిర్వాహకునిగా చేయాలన్న ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఙతలు - కాసుబాబు 11:21, 5 జనవరి 2007 (UTC)
కృతజ్ఞతలు
[మార్చు]శ్రీనివాసరాజూ, నా నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సమయం లభించినప్పుడు సినిమా వ్యాసాల్ని ఒక చూపు చూడండి. --నవీన్ 08:58, 23 ఏప్రిల్ 2007 (UTC)
బొమ్మ
[మార్చు]ధన్యవాదాలు బొమ్మ అతికించినందుకు--172.143.28.88 19:59, 16 మే 2007 (UTC)
బొమ్మలు ఎక్కడ నుండి తెస్తున్నారు, బొమ్మలు బాగా ఉన్నాయు. మళ్ళి ధన్యవాదాలు--172.143.28.88 20:09, 16 మే 2007 (UTC)
బొమ్మలు బాగా అతికిస్తున్నారు,బాల మురళీ బొమ్మ బాగా అతికించారు.--S172142230149 23:24, 25 మే 2007 (UTC)
నువ్వు ఇప్పుడే నిద్ర లేచి నట్లు ఉన్నావు నువ్వు రాయవు రాసేవాడిని రాయనివ్వవు. నీ పేజిలో మాత్రం కవితలు రాసుకోవచ్చు మిగతా వారు రాసేవి తొలగించాలంటావు ఏమి న్యాయం రా ఇది --S172142230149 22:01, 30 మే 2007 (UTC)
S172142230149 గారూ, ఎవరి సభ్య పేజీలో వారి ఇష్టం అయినవి రాసుకోవచ్చు (కొన్ని పరిమితులకు లోబడి). అంతేగానీ ఇలా ప్రత్యేక వ్యాసంలా రాయకూడదు. -- శ్రీనివాస 22:11, 30 మే 2007 (UTC)
బొమ్మల బాబు
[మార్చు]నమస్కారం, మీ గురించి నిన్న రాశాను , మీరు నిన్న కనిపించలేదు. ప్రకాశం బ్యారేజి సంబంధించిన బొమ్మ కనిపిస్తే ఒకటి అక్కడ అంటించరు.--S172142230149 21:17, 1 జూన్ 2007 (UTC)
బొమ్మలబాబు గారు ఎక్కడకు వెళ్ళారు... బొమ్మలు అంటించండి మానేశారే--మాటలబాబు 22:51, 1 జూన్ 2007 (UTC)
- ఇన్ని రోజులు కనిపించలేదంటండి? బొమ్మలబాబు గారు మిమ్మలని ప్రదీప్ గారు ఊపిరి సలుపుకోనీయకుండా పశ్నలు వేస్తున్నారు --మాటలబాబు 18:44, 21 జూన్ 2007 (UTC)
బొమ్మ:PawanKalyan01.jpg లైసెన్సు వివరాలు
[మార్చు]వికీపీడియాలో బొమ్మలను GFDL, క్రియేటీవ్ కామన్సు లాంటి లైసెన్సులతో మాత్రమే చేర్చవచ్చు, మీరు చేర్చిన ఆ బొమ్మ యొక్క లైసెన్సు వివరాలను అక్కడ పేర్కొనగలరు. అంతేకాదు ఆ బొమ్మ ఒక జీవించి ఉన్న వ్యక్తి ఫొటో, ఈ ఫొటోను ఎక్కడి నుండి చేర్చారో ఆ వివరాలు కూడా వికీపీడియాలో చేర్చండి. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 18:38, 21 జూన్ 2007 (UTC)
బొమ్మ:Mohanbabu01.jpg లైసెన్సు వివరాలు
[మార్చు]వికీపీడియాలో బొమ్మలను GFDL, క్రియేటీవ్ కామన్సు లాంటి లైసెన్సులతో మాత్రమే చేర్చవచ్చు, మీరు చేర్చిన ఆ బొమ్మ యొక్క లైసెన్సు వివరాలను అక్కడ పేర్కొనగలరు. అంతేకాదు ఆ బొమ్మ ఒక జీవించి ఉన్న వ్యక్తి ఫొటో, ఈ ఫొటోను ఎక్కడి నుండి చేర్చారో ఆ వివరాలు కూడా వికీపీడియాలో చేర్చండి. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 18:41, 21 జూన్ 2007 (UTC)
బొమ్మ:Roja01.jpg లైసెన్సు వివరాలు
[మార్చు]వికీపీడియాలో బొమ్మలను GFDL, క్రియేటీవ్ కామన్సు లాంటి లైసెన్సులతో మాత్రమే చేర్చవచ్చు, మీరు చేర్చిన ఆ బొమ్మ యొక్క లైసెన్సు వివరాలను అక్కడ పేర్కొనగలరు. అంతేకాదు ఆ బొమ్మ ఒక జీవించి ఉన్న వ్యక్తి ఫొటో, ఈ ఫొటోను ఎక్కడి నుండి చేర్చారో ఆ వివరాలు కూడా వికీపీడియాలో చేర్చండి. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 18:42, 21 జూన్ 2007 (UTC)
బొమ్మ:VanajaTheFilm01.jpg లైసెన్సు వివరాలు
[మార్చు]వికీపీడియాలో బొమ్మలను GFDL, క్రియేటీవ్ కామన్సు లాంటి లైసెన్సులతో మాత్రమే చేర్చవచ్చు, మీరు చేర్చిన ఆ బొమ్మ యొక్క లైసెన్సు వివరాలను అక్కడ పేర్కొనగలరు. అంతేకాదు ఈ ఫొటోను ఎక్కడి నుండి చేర్చారో ఆ వివరాలు కూడా వికీపీడియాలో చేర్చండి. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 18:45, 21 జూన్ 2007 (UTC)
ఇంకొన్ని బొమ్మల లైసెన్సు వివరాలు
[మార్చు]వికీపీడియాలో బొమ్మలను GFDL, క్రియేటీవ్ కామన్సు లాంటి లైసెన్సులతో మాత్రమే చేర్చవచ్చు, మీరు చేర్చిన ఈ బొమ్మల యొక్క లైసెన్సు వివరాలను వాటి పేజీలలో పేర్కొనగలరు. అంతేకాదు ఆ బొమ్మలు జీవించి ఉన్న వ్యక్తుల ఫొటోలు, ఆ ఫొటోలను ఎక్కడి నుండి చేర్చారో ఆ వివరాలు కూడా వికీపీడియాలో చేర్చండి. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 19:25, 21 జూన్ 2007 (UTC)
- నాకు అర్థం అయ్యినంతవరకు బొమ్మలబాబు గారు గూగుల్ ఇమేజ్ అన్వేషణ చేసి దొరికిన బొమ్మలు ప్రతిష్ఠించారు, ఒకసారి నేను మంగళంపల్లి బాలమురళీకృష్ణ వ్యాసం వ్రాస్తుంటే బొమ్మ పత్యక్షం అయ్యింది, ఆప్పుడే నాకు తెలిసింది శ్రీనివాస్ గారి గురించి--మాటలబాబు 19:31, 21 జూన్ 2007 (UTC)
శ్రీనివాసు గారు
[మార్చు]నమస్కారం శ్రీనివాసు గారు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు, సరేెలాగైతేనే మిమ్మలిని చూసి చాలా సంతోషం కలిగింది, మిమ్మల్ని ఒకసారి నా వెబ్ పేజి చూడమని వేడుకొంటున్నాను.--మాటలబాబు 22:14, 6 జూలై 2007 (UTC)