వాడుకరి చర్చ:THAMMUDU-THANDU

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

THAMMUDU-THANDU గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:15, 20 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 16


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల)

చొరవగా వికీలో వ్రాయ

[మార్చు]

నేను ఒక క్రొత్త వికీపీడియన్ ని. నా చేయి పట్టి దారి నాకు చూపగలరు. తప్పు చేస్తే మన్నించగలరు.--17:58, 20 మే 2008 (UTC)తమ్ముడు-తాండు

తమ్ముడూ! అస్సలు జంకు అక్కరలేదు. చొరవగా నీకు తోచింది వ్రాయడం మొదలుపెట్టు. ఏమైనా మార్చాలంటే అప్పుడు ఇతర సభ్యుల సహాయం తప్పక లభిస్తుంది. ఏమైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో అడుగు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:15, 20 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
THAMMUDU-THANDU గారు మీరు తెలియని విషయాల గురించి తెలుసుకోవడంలో ఉత్సుకత చూపుతున్నారు అది చాలా మంచి పద్దతి. మీ సందేహాలకై ఇకపై చర్చాపేజీలను మాత్రమే ఉపయోగించండి. మీ చర్చా పేజీలో కాని, ఎవరైనా సభ్యుల చర్చాపేజీలో కాని వ్రాసి సందేహం నివృత్తి చేసుకొనగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:15, 23 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
THAMMUDU-THANDU గారు, ఇక్కడ కేవలం వ్యాసాలు మాత్రమే వ్రాయాలండీ. స్తోత్రాలు, శ్లోకాలు, పద్యాలు వికీసోర్స్‌లో వ్రాయడం మంచిది అదీ కాపీఉల్లంఘన కిందికి రానట్లయితే. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:51, 23 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తమ్ముడూ! నువ్వు వ్రాయదలచుకొన్న వ్యాసాలేమిటో ఇక్కడే తెలియజేయి. వాటి లింకులు ఇక్కడ పెడతాను. ఆరంభంలో ఇలాంటి సందేహాలు సహజమే. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:06, 23 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మంచిమాట ద్వారా మంచి ప్రయత్నం మొదలుపెట్టినందుకు అభినందనలు. కాకుంటే వికీపీడియాలో "వ్యాసాలు" కావలెను. కధలు కాదు. దయ చేసి ఇతర వ్యాసాలు పరిశీలించితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. గమనించగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:45, 30 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
తమ్ముడూ! గ్రామాల పేజీలలో అక్షర దోషాలు సవరించి మంచి పని చేస్తున్నావు. అలాగే నీకు తెలిసిన గ్రామాల గురించి మరికొన్ని వివరాలు వ్రాయి.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:12, 2 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మండవల్లి మండల గ్రామ వ్యాసాలు

[మార్చు]

తాండవకృష్ణ గారు, మీరు మండవల్లి మండలానికి చెందిన గ్రామాల వ్యాసాలు చాలా సృష్టించారు. కాని ఆ మండలానికి చెందిన గ్రామవ్యాసాలు కొద్ది పేరు మార్పుతో (మందవల్లి అని)ఇదివరకే తెవికీలో ఉన్నాయి. గ్రామవ్యాసాల పేర్లు మార్చాలంటే పేజీలను తరలిస్తే సరిపోయేది. కొత్త పేజీలను సృష్టించడం వల్ల ఒక్కో గ్రామానికి రెండేసి పేజీలు తయారయ్యాయి కాబట్టి ఇవి తొలిగించబడతాయి. ఇక ముందు మీరు సృష్టించే వ్యాసాలు తెవికీలో ఉన్నాయో లేవో పరిశీలించండి. లేనిచో మీ శ్రమ వృధాకావచ్చు. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:18, 2 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పాత గ్రామవ్యాసాలకు చరితం బాగానే ఉంది కాబట్టి పాతవి తొలిగించడానికి వీలుండదు. కొత్త పేజీలనే తొలిగించి పాతపేజీలకు సరైన పేర్లు ఇవ్వవలసి ఉంటుంది.-- C.Chandra Kanth Rao(చర్చ) 17:24, 3 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రంగుల సంతకం

[మార్చు]

తాండవకృష్ణ గారు, మీ సంతకం రంగులలో రావాలంటే పైన ఉన్న నా అభిరుచులుపై నొక్కి అందులో ముద్దుపేరు ఉన్న బాక్సులో [[సభ్యుడు:THAMMUDU-THANDU|<font style="background:#f545f1;color:8001;"><b> తమ్ముడు-తాండు</b></font>]][[సభ్యులపై చర్చ:THAMMUDU-THANDU|<font style="background:#80ff00;color:#6131bd;"><b>(చర్చ)</b></font>]] పేస్ట్ చేసి దాని కిందఉన్న చెక్ బాక్స్‌లో టిక్ పెట్టండి చాలు.(<nowiki> </nowiki> మద్యలోనిదే పేస్ట్ చేయండి) అప్పుడు మీ సంతకం తమ్ముడు-తాండు(చర్చ) ఈ విధంగా కనిపిస్తుంది. రంగులు మీకు నచ్చకుంటే ఏ రంగుకావాలో చెప్పండి. దాని కోడ్ ఇస్తాను.-- C.Chandra Kanth Rao(చర్చ) 17:28, 7 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు కోరిన విధంగా రంగులు మారుస్తున్నాను. [[సభ్యుడు:THAMMUDU-THANDU|<font style="background:#fe7533;color:#80ff00;"><b> తమ్ముడు-తాండు</b></font>]][[సభ్యులపై చర్చ:THAMMUDU-THANDU|<font style="background:#80ff00;color:#fe7533;"><b>(చర్చ)</b></font>]] ఇది కాపి చేయండి అప్పుడు మీ సంతకం తమ్ముడు-తాండు(చర్చ) ఈ విధంగా కనిపిస్తుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:55, 9 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ వ్యాఖ్య చూడుము

[మార్చు]

తమ్ముడూ. నీ "మంచిమాట"లను చూస్తే నాకు అనిపించింది. చాలా సుభాషితాలను సేకరించావు. ఒకమారు వికీ వ్యాఖ్యను చూడు. అది నీకు ఆసక్తి కరంగా ఉండవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 21:25, 15 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అన్నయ్యా..! నువ్వు సూచించినట్లే వికీ వ్యాఖ్యను చూశాను. సభ్యత్వం కూడా తీసుకున్నాను. ఏమైనా చేద్దామంటే తెలుగు టైపింగ్ చేయడానికి లేదు. అక్షరాలు ఇంగ్లీష్ లో పడుతున్నాయి. వికీకోట్ లో తెలుగులో వ్రాయడానికి ఏం చేయాలి? మంచిమాట పేజీ ఎలా ఉంది? బాగుందా..? 111 సూక్తులు వరకు మంచిమాటలో రచించి మరో 111 సూక్తులను మంచిమాటలో లింక్ ఇచ్చి మంచిమాట-2 పేజీని రచిద్దామనుకుంటున్నాను. మంచిమాట బాగా పెద్దదిగా అవుతోంది కదా..!-- తమ్ముడు-తాండు(చర్చ) 11:54, 16 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మొదటి పేజీలోని వెతుకు పెట్టెలో "మంచిమాట" అని టైపు చేసి {వెళ్ళు} మీట నొక్కితే మంచిమాట పేజీ లేనే లేదు. మీరు ఆ పేజీని సృష్టించవచ్చు అని వస్తోంది. అన్నయ్యా మరి నువ్వు ఎలా ఆ పేజీని చూశావు?-- తమ్ముడు-తాండు(చర్చ) 11:34, 17 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
వికీవ్యాఖ్యలో తెలుగు వ్రాయడానికి "లేఖిని" వాడడం అన్నింటికంటే సులభమైన విధానం. http://lekhini.org/ చూడుము. లేఖినిలో టైపు చేసుకొని ఆ విషయాన్ని వికీలో పేస్ట్ చేసుకోవచ్చును. ఇంకా కొన్ని విధానాలున్నాయి గాని అన్నీ వాడితే గందరగోళంగా ఉంటుంది కనుక లేఖినితో మొదలెట్టవచ్చును.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:01, 17 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మంచిమాట లింకు మంచిమాట కాదు. సభ్యులు:THAMMUDU-THANDU/మంచిమాట అంటే నీ సభ్య పేజీలో అది ఒక ఉప పేజీగా ఉంది. మంచిమాటలో చక్కని సుభాషితాలున్నాయి. కాని వాటిని వ్యాసాలు అనలేము. కనుక "మంచిమాట"ను వకీపీడియాలో వ్యాసంగా కాక నీ సభ్యుని పేజీలో ఒక అదనపు పేజీగా అనిపిస్తుంది. అందువల్ల చక్కని మాటలను ఇంకా వ్రాసినా ఇక్కడ తగినంత గుర్తింపు రాకపోవచ్చును. కనుక వికీవ్యాఖ్యలో వ్రాయమని నా సలహా. ఇంకో సంగతి. వికీ వ్యాఖ్యలో ఎక్కువగా వ్రాసేవారు లేక అది వెలవెల పోతుంది. నీలాంటివారు కొందరు వికీవ్యాఖ్యలో కూడా అప్పుడప్పుడూ పని చేస్తే ఈ లోటు తీరుతుంది కూడాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:01, 17 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అయితే వికీ వ్యాఖ్యలో సినిమా పాటలు పెట్టవచ్చా.-- తమ్ముడు-తాండు(చర్చ) 16:28, 19 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కూడదు. ఎందుకంటే కాపీ హక్కుల సమస్య రావచ్చును. కాని పాటలలో కొన్ని చరణాలు సందర్భానుసారంగా వాడవచ్చును. నాకు కూడా బాగా అక్కడి విధానాలు తెలియవు. ఇంగ్లీషు వికీకోట్ చూస్తే కొంత అవగాహన వస్తుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:32, 19 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]