Jump to content

వింజనంపాడు (వట్టిచెరుకూరు)

అక్షాంశ రేఖాంశాలు: 16°14′21″N 80°25′39″E / 16.239181°N 80.427523°E / 16.239181; 80.427523
వికీపీడియా నుండి
వింజనం పాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
వింజనం పాడు is located in Andhra Pradesh
వింజనం పాడు
వింజనం పాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°14′21″N 80°25′39″E / 16.239181°N 80.427523°E / 16.239181; 80.427523
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం వట్టిచెరుకూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ చిరుమామిళ్ళ వెంకట కృష్ణారావు
పిన్ కోడ్ 522017
ఎస్.టి.డి కోడ్ 0863

వింజనం పాడు, గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామములో మౌలిక వసతులు

[మార్చు]

రక్షిత త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

ఈ గ్రామములో 2014, నవంబరు-5న, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించెదరు. ఈ పథకం ద్వారా గ్రామస్థులకు, 20 లీటర్ల శుద్ధిచేసిన సురక్షితమైన త్రాగునీటిని, రెండు రూపాయలకే సరఫరా చేసెదరు.

సహకార సంఘం

[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

మంచినీటి చెరువు

[మార్చు]
  1. దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ఈ చెరువును, ఆ శాఖ అధికారులు పట్టించుకొనకపోవదంతో, గ్రామ సర్పంచి, చొరవతీసుకొని, 2015, ఆగస్టు-25వ తేదీనాడు, పంచాయతీ నిధులతో పొక్లెయిను ఏర్పాటుచేసి, కూలీలతో ఈ చెరువులో పేరుకుపోయిన తూటికాడ, తామర ఆకులు, నాచును తొలగించి శుభ్రం చేయించారు. [8]
  2. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ చెరువువులో కొంతమేర నీరు చేరినది. గ్రామములోని గుంటూరు వాహిని నీరు లేక వట్టిపోయింది. ఈ పరిస్థితులలో గ్రామస్థులు, ఈ చెరువు నీటిని గుంటూరు వాహినిలోనికి నింపి దానిని ఇంజన్లతో పొలాలకు తరలించుచూ పంటలు పండించుచున్నారు. ఎండిపోతున్న ఒక వంద ఎకరాలలోని పంటలకు జీవం పోసినారు. ఒక ఎకరానికి లక్ష రూపాయలకు పైగా పెట్టుబడిపెట్టిన మిర్చి రైతులు సంతోషం వ్యక్తం చెయుచున్నారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

నార్నే విజయలక్ష్మి సర్పంచ్ నార్ని సాంబశివరావు ఉపసర్పంచ్

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ కోదండరామస్వామి ఆలయం

[మార్చు]

ఆలయంలో, 49వ శ్రీరామనామ సప్తాహమహోత్సవములు, 4-12-2013 నుండి 8రోజులు జరుగును. 8-12-13న ప్రధానమైన శ్రీ సీతారాముల కళ్యాణం, 10-12-2013న తెప్పోత్సవం జరుగును.

ఈ ఆలయంలో 50వ శ్రీరామనామ సప్తాహ మహోత్సవాలు జరుగుచున్నవి. ఈ ఉత్సవాలలో భాగంగా, 2014, నవంబరు-28, శుక్రవారం నాడు, శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయం, బజారు ఆలయప్రాంగణాలను రంగురంగుల పుష్పాలు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. 29వ తేదీ శనివారం నాడు, స్వామివారి పట్టాభిషేక మహోత్సవం, వేదమంత్రాలనడుమ అంగరంగవైభవంగా నిర్వహించారు. వేదపండితులు సంప్రదాయ బద్ధంగా ఈ క్రతువును నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను మేళతాళాలనడుమ, ఆలయం నుండి గ్రామంలోని అన్ని వీధులలో ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమాన్ని తిలకించుటకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ ఉత్సవం సందర్భంగా భక్తులు స్వామివారికి రు. 3 లక్షల విలువైన స్వర్ణకిరీటాన్నీ, వెండి పాదుకలు, వెండి పళ్ళెం సమర్పించారు. ఈ ఆభరణాలతో భక్తులు గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. 30వ తేదీ ఆదివారం నాడు, స్వామివారిని రంరంగుల విద్యుద్దీపాలతో అలంకరించిన తెప్పలో ఉంచి, తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రధాన కూడలిలో, దావులూరు గ్రామస్థులు బృందావన చెక్కభజన నిర్వహించారు. ఈ కార్యక్రమం తిలకించడానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

ఈ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న కళ్యాణమండపానికి, 2017,ఆగస్టు-11వతేదీ శుక్రవారంనాడు శంకుస్థాపన నిర్వహించారు.

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో (మే నెల;లో) బహుళ చవితి నుండి మూడురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ అద్దంకమ్మ తల్లి ఆలయం

[మార్చు]

ఆలయంలో వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో (మే నెల;లో) బహుళ చవితి నుండి మూడురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు.

గ్రామ ప్రముఖులు

[మార్చు]

శ్రీ చిరుమామిళ్ళ సుబ్బారావు:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు.

గ్రామ విశేషాలు

[మార్చు]
  1. శ్రీ ఉప్పుటూరి సాంబశివరావు:- వీరు వింజనంపాడు, చమళ్ళమూడి, కాట్రపాడు గ్రామాల ఆదర్శరైతు.
  2. ఈ గ్రామానికి చెందిన శ్రీ చిరుమామిళ్ళ రాంబాబు, అమెరికాలో వ్యాపారరంగంలో స్థిరపడినారు. వీరు తన స్వగ్రామంపై మక్కువతో, గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధిచేయడానికై ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
  3. ఈ గ్రామానికి చెందిన శ్రీ రావిపాటి సత్యనారాయణ, 2017,జూన్-4న, అన్నవరంలోని శ్రీ వీరవెంకటసత్యనారాయణస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసారు.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.