వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 17
Jump to navigation
Jump to search
- 1706: గొప్ప రచయిత, చిత్రకారుడు, రాజకీయ నాయకుడు, శాస్త్రవేత్త, మేధావి బెంజమిన్ ఫ్రాంక్లిన్ జననం (మ.1790).
- 1905: ప్రసిద్ధ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్ జననం. (మ.1986).
- 1908: తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎల్.వి.ప్రసాద్ జననం (మ.1994).
- 1917: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినిమా నటుడు, ఎం.జి.రామచంద్రన్ జననం. (మ.1987) (చిత్రంలో)
- 1951: భారతీయ సినిమా నటి బిందు జననం.
- 1989: మొదటిసారి ఒక భారతీయుడు - కల్నల్ జె.కె.బజాజ్ - దక్షిణ ధృవాన్ని చేరుకున్నాడు.
- 1997: ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం ఇచ్చేది లేదని భారత ప్రభుత్వం ప్రకటించింది.
- 2010: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుధీర్ఘకాలం పాటు పనిచేసిన జ్యోతిబసు మరణం (జ.1914).