వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 24
స్వరూపం
- 2008: జాతీయ బాలికా దినోత్సవం
- 1924: స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ జననం (మ.2010).
- 1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.
- 1950: రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం జరిగింది.
- 1966: సుప్రసిద్ధ అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభా మరణం (జ,1909). (చిత్రంలో)
- 1980: పాత తరానికి చెందిన హాస్యం, క్రౌర్యం, శోకం లాంటి అన్ని పాత్రలలో రాణించిన నటుడు ముదిగొండ లింగమూర్తి మరణం (జ.1908).
- 1981: తొలితరం నటీమణులలో ప్రసిద్ధులైన చిత్తజల్లు కాంచనమాల మరణం (జ.1917).
- 2005: తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి మరణం (జ.1958).
- 2011: ప్రముఖ సంగీతకారుడు, భారత రత్న గ్రహీత భీమ్సేన్ జోషి మరణం (జ.1922).