వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 14

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
TANIKELLA BHARANI.jpg
  • 1893 : స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత మా కొద్దీ తెల్ల దొరతనం .... పాటతో సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించిన గరిమెళ్ల సత్యనారాయణ జననం (మ.1952).
  • 1907 : ఇంగ్లీషు రసాయన శాస్త్రవేత్త విలియం హెన్రీపెర్కిన్ మరణం (జ.1838).
  • 1904 : ప్రజావైద్యుడు, గాంధేయవాది, వినోబాభావే సర్వోదయ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకుని రెండు లక్షల కంటి శస్త్రచికిత్సలు, ఉచిత వైద్యసేవ చేసిన వెంపటి సూర్యనారాయణ జననం (మ.1993).
  • 1954 : భారతీయ పాత్రికేయుడు, చలనచిత్ర నటుడు, రాజకీయ నేత్త, బాడీ బిల్డర్ మరియు ప్రస్తుతం దక్షిణ భారతీయ చిత్ర కళాకారుల సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్ జననం.
  • 1956 : తెలుగు సినిమా నటుడు, రచయత, తెలుగు భాషాభిమాని తనికెళ్ళ భరణి జననం.(ప్రక్క చిత్రంలో)
  • 1967 : శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు హసన్ తిలకరత్నె జననం.
  • 2015 : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాధన్ మరణం (జ.1928).