వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • 1906 : భారతీయ నాటకరంగానికి ఆద్యుడు మరియు హిందీ సినీ పరిశ్రమలో పేరొందిన కళాకారుడు పృథ్వీరాజ్ కపూర్ జననం (మ.1972).
  • 1933 : భారతీయ తత్త్వ శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యా సేన్ జననం.
  • 1936 : ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రాయ్ ఎమర్సన్ జననం.
  • 1940 : ప్రముఖ రచయిత, సాహితీకారుడు పెండ్యాల వరవరరావు జననం.
  • 1968 : ప్రముఖ రంగస్థల కళాకారిణి మణిబాల. ఎస్ జననం.
  • 1984 : ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం ఢిల్లీలో జరిగిన హింసాకాండలో 3000 మంది మరణించారు.
  • 1998 : విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త పి.ఎల్. నారాయణ మరణం (జ.1935).