వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations
సభ్యులకు అందరకూ నమస్కారం. ఈ పేజీ తెలుగు వికీపీడియా 11 వసంతాలు పూర్తిచేసుకొన్న సందర్భంగా జరుపదలచిన కార్యక్రమ ప్రణాళికకు సంబందించినది.
తెలుగు వికీపీడియా
[మార్చు]విశ్వ విజ్ఞానాన్నంతటికీ ప్రతీకగా మారిన వికీమీడియా ఉద్యమం, జనవరి నాటికి పదమూడేళ్ళు పూర్తి చేసూకోనుంది. ఈ విజ్ఞాన సర్వస్వ మహాయజ్ఞంలో మనమూ వెనుకంజలో లేమని నిరూపిస్తూ, 2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పదకొండు సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో 60 వేలకు చేరువలో ఉన్నందుకు అత్యంత ఉత్సాహంతో 11 సంవత్సరాల సంబరాలు జరుపాలని నిర్ణయింపబడినది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. ఆ మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ తెవికీ 11వ వార్షికోత్సవాలను సంబరాలుగా జరుపుకోబోతున్నాం.
తెలుగు వికీపీడియా
[మార్చు]- వికీమీడియా ఉద్యమం 14 సంవత్సరాల క్రితం ప్రారంభమై మానవ విజ్ఞానం అంతా నిక్షిప్తం చేయాలనే నినాదం నెరవేర్చడంలో నిజానికి విజయవంతమైంది. వికీపీడియా, 287 భాషలలో, మూడున్నర కోట్ల వ్యాసాలతో, స్వేచ్ఛా సాఫ్టువేర్ ప్రతిపాదించే 4 స్వేచ్ఛలతో అందుబాటులో ఉన్న అతిపెద్ద అంతర్జాల విజ్ఞాన సర్వస్వం. అంతర్జాతీయ వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమ స్ఫూర్తితో తెలుగు వికీపీడియా డిసెంబర్ 10, 2003 న 11 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. ఈ పదకొండు సంవత్సరాల ప్రయాణంలో 60,000 వ్యాసాలు వరకు, అనేక వందల మంది స్వచ్ఛంద ఔత్సాహికుల ద్వారా అందించబడింది. నేడు తెలుగు వికీపీడియా భారతీయ భాషలలోని మొదటి మూడు (3) వికీపీడియాలలో ఒకటిగా నిలిచింది. ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకున్న వారిని గుర్తించి, అభిమానించి, సన్మానించేందుకు, తెవికీ11నిర్వాహక కమిటి వారికి ఇది ఒక మహా సదవకాశంగా ఒక గొప్ప అధికారంగా భావించి పాలుపంచు కున్నందుకు అందరినీ అభినందిస్తున్నాము. మేము ఈ ఉత్సవం సందర్భంగా మొత్తం సమాజానికి తైకీ గురించి చాటి చెబుతూ, మరింత మంది ఔత్సాహికులను ఈ సమిష్టి యజ్ఞంలో భాగస్వాములను చేద్దామనుకుంటున్నాము
11 సంవత్సరాల ఉత్సవాలు ఎందుకు
[మార్చు]- తెలుగు వికీ అభివృద్ది, కార్యక్రమాలు, ప్రాజెక్టులు మరింత ప్రచారం పొందుటకు
- తెవికీకి తోడ్పడుతున్న సభ్యులను ఒక వేదికపై చేర్చేందుకు
- బయటి ఆఖరు వాడుకరుల అభిప్రాయాలు నమోదు చేసుకునేందుకు
ఉత్సవాలు ఎందుకు ?
[మార్చు]- తెలుగు వికీపీడియా అభివృద్ధి మరియు సహకార ప్రాజెక్టులు వ్యాప్తిలోకి తెచ్చేందుకు కృషి.
- వికీపీడియా సహాయకులు (కంట్రీబ్యూటర్స్) అందర్నీకలిపి ఒక వేదిక పైకి తీసుకురావడం.
- తెవికీ వినియోగదారులు ఈ ఉచిత ఎన్సైక్లోపీడియా నుండి ఏమి పొందేందుకు ఆశిస్తున్నారో తెలుసుకోవడం.
కార్యక్రమ లక్ష్యాలు
[మార్చు]- తెలుగు వికీపీడియాలో వ్యాసాల నాణ్యతను, సంఖ్యను పెంచడం
- తెలుగు వికీపీడియా వాడుకరులను పెంచడం
- తెలుగు సమాచారాన్ని ఉచితంగా అందరికి అందుబాటులో ఉంచడం
- తెలుగు వికీపీడియా వాడుకరులు కొత్త వాడుకరులను తయారుచేసేలా ప్రోత్సహించడం
- తెలుగు వికీపీడియాకు గుర్తింపు వచ్చేలా, ప్రజలందరికి తెలిసేలా చేయడం
- గ్లోబల్ లెవల్ లో తెలుగు వికీపీడియాకు విజిబులిటి కల్పించడం
- ఆఫ్‌లైన్‌లో వికీని ఉపయొగించుకొనేలా అందుబాటులోకి తేవడం
మహిళలకు
[మార్చు]- ఈ కార్యక్రమానికి నా సంపూర్ణ సహకారం అందిస్తాను.
- ఈ సమావేశంలో మహిళల కొరకు హ్యాండ్ బ్యాగులు, బొట్టు వంటివి తయారు చేస్తే బాగుంటుందని దశాబ్ధి ఉత్సవాల సమయంలో విష్ణువర్ధన్ గారు సూచించారు. హ్యాండు బాగులవంటివి ప్రచారానికి సహకరిస్తాయని నా అభిప్రాయం. ఏదశాబ్ధి ఉత్సవాల సమయానికి మహిళాసభ్యుల కొరకు అలాంటివి సిద్ధం చేయడానికి చేయడానికి ప్రయత్నిస్తాం.--t.sujatha (చర్చ) 16:48, 3 నవంబర్ 2014 (UTC)
- వికీపీడియా లోగోతో పొర్టుఫోలియే బ్యాగు ఇస్తే, మహిళలకు, పురుషులకు అనుకూలంగావుంటుంది. మహిళలకు ప్రత్యేకం అనేది సబబు కాదేమో ఆలోచించండి.--గుళ్ళపల్లి నాగేశ్వర రావు --వాడుకరి:Nrgullapalli 13.23, 20 నవంబర్ 2014
కార్యక్రమం యొక్క ఉద్దేశ్యాలు, లక్ష్యాలు
[మార్చు]- నాణ్యత మరియు పరిమాణం పరంగా తెవికీని అభివృద్ధి చేయడం.
- తెవికీ కంట్రిబ్యూటర్ వాడుకదారుల పెంచడం.
- తెవికీ ద్వారా తెలుగు భాషకు సంబంధించిన కీలక సమాచారం తీసుకురావడం.
- తెవికీ ద్వారా మరింత కొత్త రచనలు, కొత్త సహాయకులను (కంట్రిబ్యూటర్స్) తీసుకురావడానికి ప్రస్త్రుతమున్న వారిని ప్రోత్సహించడం.
- ప్రజల్లో తెవికీ గురించి అవగాహన తీసుకురావడం.
- తెవికీ ఒక ప్రపంచ ప్రత్యక్షత సృష్టించడం.
- తెవికీపీడియా ఆఫ్ లైన్ వాడుక ప్రారంభించడం.
కార్యక్రమ ముఖ్యాంశాలు
[మార్చు]11 వ వార్షికోత్సవ ఉత్సవాలు ఎలా వుండాలో నా వూహా జనిత కార్యక్రమము: (నిధుల లభ్యతకు లోబడి). ముందుగా తెవికీ 11వ వార్షికోత్సవాల తేదీలను నిర్ణయించాలి.
ప్రధాన సమావేశానికి ముందు :
[మార్చు]తిరుపతి లోను ఆ చుట్టు ప్రక్కల అనేక విద్యాసంస్థలు ఇతరమైన సంస్థలు అనేకం వున్నాయి. వాటిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వారిని ప్రథాన సమావేశానికి అహ్వానించాలి. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అవకాశాన్ని బట్టి ప్రధాన సమావేశం తర్వాత కూడ రెండు రోజులు నిర్వహించాలి.
ముఖ్య అతిధులు:
[మార్చు]తిరుపతిలో ప్రాంతీయంగా వున్న ప్రముఖులను (రాజకీయ ప్రముఖులు/విధ్యాప్రముఖులు మొ|| వారిని ప్రధాన సమావేశానికి ఆహ్వానించాలి. అహ్వానాన్ని మన్నించిన వారికి వికీపీడియా గురించి కొంత ఆవగాహన కలిగించాలి.
పురస్కారాలు:
[మార్చు]సమావేశంలో ముఖ్యులైన కొంత మందికి వికీపీడియా గురించి అవగాన, మరియు వారు అందించిన సేవలకు గాను పురస్కారాలు అందించాలి.
కార్యక్రమం యొక్క ముఖ్యాంశాలు
[మార్చు]ముఖ్య తేదీలు
[మార్చు]మరింత సమాచారం
[మార్చు]సమాచారం
[మార్చు]స్థలం: Tirupathi (తిరుపతి)
తేదీ: ఫిబ్రవరి 14, 15 2015
వేదిక : ఉదయీ ఇంటర్నేషనల్ హోటల్, తిరుపతి ఆర్.టి.సి. బస్టాండు ఎదురుగా.