వికీపీడియా చర్చ:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

11 వ వార్షికోత్సవ ఉత్సవాల గురించి ప్రతిపాదనపై ఇక్కడ పేజీ సృష్టించబడినది. సహ సభ్యులు మీ యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలు ఇక్కడ ఈ పేజీలో అందించగలరు

వ్యాసరచన పోటీ[మార్చు]

ముందుగా వికీమీడియన్లు అందరికీ తెవికీ పదకొండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమ ఏర్పాటు విషయంలో నాదొక సూచన. మనం ఓ వ్యాసరచన పోటీ కూడా నిర్వహించి వాటిలో గెలచినవారికి బహుమతులు అందజేస్తే బావుంటుంది. నా సూచనలు.

 1. పోటీ కోసం వారికి నచ్చిన పూర్తిస్థాయి వ్యాసాలు రచింపజేస్తే బావుంటుంది.
 2. ఎంపికయ్యే వ్యాసాలు అతిశయోక్తి రహితంగా, నోటబిలిటీ ప్రమాణాలకు చేరగలిగేదిగా ఉండాలి.
 3. వీలుంటే నాలుగైదు బహుమతుల్లో మూలాలు చేర్చడం, పూర్తిస్థాయిలో తయారుచేయడం, అవసరమైన ఫోటోలు చేర్చడం, మొదలుగా అనేక ప్రమాణాలతో ఉంటే బావుంటుంది.
 4. అన్ని విధాలుగానూ బావున్న వ్యాసానికి వాటన్నిటికన్నా వేరుగా బహుమతి ఇవ్వడమూ మంచి ఆలోచనే.
 5. ఈ పోటీ ద్వారా సీరియస్ గా ప్రయత్నించే రచయితలకు వికీ మీద, వికీలో తమ అభిరుచికి అనుగుణంగా చేయదగ్గ పనుల మీద మౌలికమైన అవగాహన వచ్చేలా తీర్చిదిద్దవచ్చు.
 6. ఆ క్రమంలో ముందుగా నిర్ణయించుకున్న పరిధుల్లో వికీపీడియన్లు ఆయా విభాగాలలో పనిచేస్తున్న పోటీదారులకు మెంటార్లలా కూడా చేయవచ్చు.

ఇవన్నీ ఆ పోటీ విషయంలో నేను ఊహచేస్తున్న విషయాలు. ఆచరణసాధ్యం కాని విషయాలు తొలగించి మరెవరైనా మరింత మంచి ప్రతిపాదనలు కూడా చేరిస్తే మరీ మంచిది.--పవన్ సంతోష్ (చర్చ) 07:59, 22 అక్టోబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

 1. ఈ ఆలోచన బాగానె వుంది. అయితే....... వ్యాస రచ పోటీని ముందుగానే నిర్వహించి ... ఫలితాలను ప్రకటించి... అందులో మొదటి/రెండవ బహుమతులను పొందిన వారిని 11వ వార్షికోత్సవాలకు వికీపీడియా ఖర్చులతో ఆహ్వానిస్తే బాగుండునేమో............ Bhaskaranaidu (చర్చ) 15:40, 5 నవంబర్ 2014 (UTC)
 2. వ్యాసరచన కు వాలంటీరుగా ప్రచార బాద్యతలు వహించటానికి నేను సిద్డ్డం - కశ్యప్

కొన్ని ఆలోచనలు[మార్చు]

 • వికీపీడీయన్లు తిరుపతి తదితర ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు అక్కడి పట్టణాలు, విశేషాలను ఫోటోలు తీసి వాటిని కామన్స్‌లో ఎక్కించాలి. అవి వ్యాసాల అభివృద్ధికి తోడ్పడతాయి. ఉదాహరణకు శంకరంబాడి సుందరాచారి గారి విగ్రహం తిరుపతిలో ఉందట కదా.
 • తి.తి.దే వారి సహకారం అందితే, వారి గ్రంథాలయంలోని డిజిటైజ్ చేసిన పుస్తకాలకు మన అందుబాటులో ఉండే విషయం మాట్లాడాలి. వారు కొన్నేళ్ళక్రితం గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ స్కాన్ చేసి పెట్టే కార్యక్రమం చేపట్టారని విన్నాను

--వైజాసత్య (చర్చ) 06:24, 31 అక్టోబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]


ఇక్కడ మీ సూచనలు, సలహాలు మరేవైనా మొటికాయలు, అక్షింతలు గట్రాలు[మార్చు]

మునుపు మాలాంటి యువకులు కొందరు ముందుకువచ్చి దశమ వార్షికోత్సవం నిర్వాహణలో పాలుపంచుకున్నాము. ఈసారి నిర్వాహణ బాధ్యతలను కొంతమంది సీనియర్ సభ్యులు తీసుకోవాలని మాలాంటి వారి కోరిక. --Pranayraj1985 (చర్చ) 09:05, 4 నవంబర్ 2014 (UTC)

ఇక కార్యక్రమాలలో విజయవాడ అనుభవం దృష్ట్యా నా కొన్ని సూచనలు[మార్చు]

 • కార్యక్రమం రెండురోజులు అనుకొంటే మొదటి రోజు ఉదయం నుండి భోజనాల వరకూ పరిచయాలు, నాలుగైదు ముక్కల చిన్న చిన్న ప్రసంగాలు.
 • మధ్యాన్నం తరువాత మూడు రకాలైన ఆటలు సాయంత్రం వరకూ.
 • ఆటలు సాయంత్రానికి అయిపోతే అపుడు చర్చలు రాత్రి వరకూ.
 • రెండో రోజు .....నాకు ప్రస్తుతం ఐడియా లేదు :)....విశ్వనాధ్ (చర్చ) 11:41, 31 అక్టోబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వ్యాసాల సంఖ్య పెంచే లక్ష్యం[మార్చు]

వ్యాసాల సంఖ్యను 66,666కు పెంచటాన్ని ఒక లక్ష్యంగా ప్రతిపాదించారు. దయచేసి అలాంటి లక్ష్యాలు పెట్టుకోవద్దు. ఇవి ఇబ్బడిముబ్బడిగా మొలకలను సృష్టిస్తాయి కానీ వికీ నాణ్యత ఏమాత్రం పెరగదు. కాబట్టి నాణ్యతా పరమైన లేదా ఒక సబ్జెక్టు పరిధిగా చేసుకొని వ్యాసాలు అభివృద్ధి చేసుకొనే లక్ష్యాలను ఎంచుకోవాలని నా మనవి --వైజాసత్య (చర్చ) 12:05, 27 జనవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సభలో తీర్మానాలు[మార్చు]

జరగబోయే సభలో వికీపీడియా అభివృద్ధికి ఏమైనా తీర్మాలు చేయాలి. అందులో ఒకటి: వికీపీడియా గురించి సమగ్ర నివేధిక తయారు చేసి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి ఆంధ్ర/ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపి ఈ విషయంలో ప్రభుత్వం తగు సహకారం ఇవ్వాలని కోరాలి. (ఎలాంటి సహకారము ఇవ్వాలో అందులో పొందు పరచాలి) Bhaskaranaidu (చర్చ) 15:28, 5 నవంబర్ 2014 (UTC)

కోశాధికారి[మార్చు]

కోశాధికారిగా ఇప్పటికే తెవికీ 10 ద్వారా మంచి అనుభవం ఉన్న కశ్యప్ ను అదే పనికి మెంబర్‌గా ప్రతిపాదిస్తున్నాను. ఎవరికైనా అభ్యంతర్ం ఉంటే తెలియచేయగలరు...విశ్వనాధ్ (చర్చ) 07:06, 4 నవంబర్ 2014 (UTC)

 1. కోశాధికారిగా కశ్యప్ ప్రతిపాదన నాకు అంగీకారమే Pranayraj1985 (చర్చ) 09:02, 4 నవంబర్ 2014 (UTC)
 2. నాకూ సమ్మతమే Bhaskaranaidu (చర్చ) 11:03, 4 నవంబర్ 2014 (UTC)
 3. కశ్యప్ వంటి అనుభవం గల వ్యక్తి కోశాధికారిగా సమర్ధుడు అని నా మద్దతు తెలియజేస్తున్నాను.--Rajasekhar1961 (చర్చ) 05:40, 5 నవంబర్ 2014 (UTC)
 4. కశ్యప్ కోశాధికారిగా ఉండడం నాకు అంగీకారమే. --t.sujatha (చర్చ) 12:39, 5 నవంబర్ 2014 (UTC)
 5. ఎవరైనా సమ్మతమే. JVRKPRASAD (చర్చ) 07:29, 11 నవంబర్ 2014 (UTC)
 6. సమ్మతమే:--గుళ్ళపల్లి 00:53, 31 డిసెంబరు 2014 (UTC)

అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు కార్యదర్శి[మార్చు]

ఎల్లంకి భాస్కరనాయుడు Bhaskaranaidu గారిని 11 వ వార్షికోత్సవాలకు అద్యక్షులుగా, మరియు తమ్మిపూడి సుజాత t.sujatha గారిని ఉపాధ్యక్షులుగా, ప్రణయ్‌ Pranayraj1985 ను కార్యదర్శిగా ప్రతిపాదిస్తున్నాను. ఎవరికైనా అభ్యంతరం ఉంటే తెలియచేయగలరు...విశ్వనాధ్ (చర్చ) 14:06, 4 నవంబర్ 2014 (UTC)

సభ్యుల అంగీకారం[మార్చు]

మద్దతు[మార్చు]

 1. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:14, 4 నవంబర్ 2014 (UTC)
 2. భాస్కరనాయుడు మరియు సుజాత గార్లు తమకున్న వికీ అనుభవాల్ని, తమ ఉద్యోగవ్యవహార అనుభవాలను మేళవించి ఈ సమావేశాలను నిర్వహించి తద్వారా తెలుగు వికీపీడియా ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని పోవడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. వారికి మా పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి.--Rajasekhar1961 (చర్చ) 05:38, 5 నవంబర్ 2014 (UTC)
 3. * ఎవరైనా సమ్మతమే. JVRKPRASAD (చర్చ) 07:31, 11 నవంబర్ 2014 (UTC)

వ్యతిరేకత[మార్చు]

అభిప్రాయం[మార్చు]

CISA2K సహకారం[మార్చు]

CISA2K నుండి గత దశాబ్ధి ఉత్సవాలకు విష్ణువర్ధన్ (వాడుకరి:Visdaviva) గారి ద్వారా అపూర్వమైన సహాకారం అభించింది. అదే విధంగా ఆయన వ్యక్తిగతంగానూ ఎంతో శ్రమించి ఉత్సవాలను విజయవంతంగా జరపడంలో సహాయపడ్డారు. ఇపుడు జరుపబోవు ఈ 11వ వార్షికోత్సవాలలో కూడా గతంలోలానే తెలుగు వికీపీడియాకు CIS నుండి, మరియు మీరు రహమానుద్దీన్ ఇద్దరూ మాకు తోడ్పాటు అందించాలని మా ఆకాంక్ష

తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవ కార్యవర్గ సభ్యుల సమావేశాలు[మార్చు]

1. మొదటి సమావేశం (28.12.2014)[మార్చు]

మొదటి సమావేశం గత ఆదివారం గోల్డెన్ త్రెషోల్డ్ లో నిర్వహించిన తెలుగు వికీమీడియా హాకథాన్ -2014 కు ముందు ఉదయం సభ్యుల అందరి మధ్య జరిగింది. దీనిలో పాల్గొన్న సభ్యులు

 1. రాజశేఖర్
 2. భాస్కరనాయుడు
 3. గుళ్లపల్లి నాగేశ్వరరావు
 4. కొంపెల్ల శర్మ
 5. విశ్వనాధ్
 6. వీవెన్
 7. రహ్మానుద్దీన్
 8. పవన్ సంతోష్
 9. ప్రణయ్‌రాజ్ వంగరి

తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్ధేశ్యం

 • తెలుగు వికీపీడియాలో వ్యాసాల నాణ్యతను, సంఖ్యను పెంచడం.
 • తెలుగు వికీపీడియా వాడుకరులను పెంచడం.
 • తెలుగు సమాచారాన్ని ఉచితంగా అందరికి అందుబాటులో ఉంచడం.
 • తెలుగు వికీపీడియా వాడుకరులు కొత్త వాడుకరులను తయారుచేసేలా ప్రోత్సహించడం.
 • తెలుగు వికీపీడియాకు గుర్తింపు వచ్చేలా, ప్రజలందరికి తెలిసేలా చేయడం.
 • గ్లోబల్ లెవల్ లో తెలుగు వికీపీడియాకు విజిబులిటి కల్పించడం.

స్థలం మరియు తేదీలు

 • తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవం నిర్వహించడానికి స్థల నిర్ణయంకు మరికొన్ని రోజుల సమయం అవసరం. వార్షికోత్సవ తేదీలు కూడా నిర్ణయించాలి.

చేయవలసిన పనులు

 • బడ్జెట్ వేగంగా పూర్తి చేయాలి
 • ముందస్తు వికీ శిక్షణ ఎక్కడెక్కడో నిర్ణయించాలి
 • వసతి ఏర్పాట్ల గురించి నిర్ణయించాలి
 • తిరుపతికి వెళ్ళి ముందుగా కార్యక్రమం అమలు పనులు చూడాలి

జరిగిన పనులు

2. రెండవ సమావేశం (31.12.2014)[మార్చు]

31-12-2014 ఉదయం 11 గంటలనుండి 01 గంట వరకూ జరుగుతుంది. అందరూ పాల్గొనవచ్చు

3. మూడవ సమావేశం[మార్చు]

ఈతేదీ తప్పు, రెండోసమావేశం కంటే ముందు మూడవ సమావేశం ఎలా వస్తుంది --గుళ్ళపల్లి 01:41, 31 డిసెంబరు 2014 (UTC)

సభ్యుల సూచనలు, సలహాలు[మార్చు]

భాస్కరనాయుడి గారి ద్వారా -

1. చేతి పుస్తకము/కరపత్రాలు / సామాజిక మాధ్యమాలు[మార్చు]

ముందుగా చేతి పుస్తకం ద్వారా /కరపత్రాలు / గోడ పత్రికల ద్వారా / ఇతర మాద్యమాల ద్వార ప్రచారం జరగాలి. చేతి పుస్తకం (hand book) కొత్తవారికి/ ఇదివరకే చేరిన వారికి రచనలు కొనసాగించేలా ప్రోత్సాహ కరంగా వుండాలి. దీనిని ప్రత్యేకంగా రూపొందించాలి. మన ప్రయాణ మార్గంలో ఎదురయ్యే కళాశాలలు, గ్రంధాలయాలు, ఇతర సంస్థల చిరునామాలు సేకరించి వారికి చేతిపుస్తకాలు/కరపత్రాలు పంపిణి చేయాలి. వారు అంగీకారంతో ఆయా సంస్థలలో మన అవగాహన కార్యక్రమము చేయవచ్చు. ఆ యాప్రాంతాలలో ప్రాంతీయంగా వున్న వున్న వికీపీడియన్లను కలుపు కోవాలి.
ముందుగా ఈ కార్యక్రమ ఆహ్వాన పత్రాన్ని రూపొందించి దానిని సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ , వాట్సప్ లో పంపిణీ చేయగలిగితే ఎక్కువ మంది తెలుగువారి కి ఈ సమాచారం చేరవేయవచ్చు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11
49, 23 డిసెంబరు 2014 (UTC)

2. ప్రచార మాధ్యమాలు[మార్చు]

ప్రసార మాధ్యమాలను ఆహ్వానించి వారికి తెవికి గురించి తగు ప్రచారము చేయడానికి ప్రోత్సాహం కల్పించాలి

3. ముఖ్య అతిధులకు ఆహ్వానము[మార్చు]

తిరుపతిలో ప్రాంతీయంగా వున్న ప్రముఖులను (రాజకీయ ప్రముఖులు/విధ్యాప్రముఖులు మొ|| వారిని ప్రధాన సమావేశానికి ఆహ్వానించాలి. అహ్వానాన్ని మన్నించిన వారికి వికీపీడియా గురించి కొంత ఆవగాహన కలిగించాలి.
విశిష్ఠ అతిధిగా 2014 తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, చిత్తూరు జిల్లా వాసి శ్రీ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆహ్వానించవచ్చు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11
46, 23 డిసెంబరు 2014 (UTC)

4. విద్యార్థులకు వ్వాసరచన పోటి ... పురస్కారాలు[మార్చు]

తిరుపతిలోని విజ్ఞాన భారతి కళాశాల/ఉన్నతపాఠశాల విద్యార్తులకు వ్యాసరచ పోటీ నిర్వహించి గెలుపొందిన వారికి పురస్కారాలు ఇవ్వాలి.
కేవలం తిరుపతి మాత్రం కాక, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కళాశాలలను వ్యాసరచనలో భాగం చేయాలి.

5. వికీపీడియన్లకు పురస్కారాలు[మార్చు]

గత సమావేశంలో అనుకున్నట్లు వికీపీడియాలో అత్యధిక కృషి చేసిన వారిలో ఐదు మందికి తగు పురస్కారాలు ఇవ్వాలి.
ఈ పురస్కారానికి అర్హులుగా..... 2014 లో వికీపీడియా లోని అన్ని సోదర ప్రాజెక్టులలో కలిపి అత్యధిక మార్పులు చేసిన సభ్యులను ఎన్నుకోవాలి.
ఈ పురస్కారానికి వికీపీడియన్ ఆఫ్ ది ఇయర్ /2014 సంవత్సర వికీపీడియన్ / ఈ ఏటి ఉత్తమ వికీపీడియన్ అని పేరు పెట్టవచ్చు.
ఈ పురస్కారమునకు ప్రఖ్యాత రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు పురస్కారం గా వ్యవహరించే ప్రతిపాదనను సభ్యులు చర్చించవచ్చు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11
47, 23 డిసెంబరు 2014 (UTC)
కొమర్రాజు లక్ష్మణరావు గారు పెద్ద రచయితేమీ కాదు. ఆయనకంటే తెలుగులో గొప్ప రచయితలు చాలామందే ఉన్నారు. వికీపురస్కారానికి ఆయన పేరు పెట్టడానికి కారణం తెలుగు విజ్ఞానసర్వస్వరంగంలో ఆయన చేసిన కృషివళ్లే. విజ్ఞానసర్వస్వమైన వికీపీడియాలో కృషిని గుర్తించడానికి అంతకంటే మంచి పురస్కారమేముంటుంది. కాబట్టి అదే పేరు కొనసాగించాలని నా సూచన --వైజాసత్య (చర్చ) 12:02, 23 డిసెంబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఒక్కో సంవత్సరం ఒక్కో ప్రముఖుడి పేరుతో పలానా సంవత్సర విశిష్ట వికీపీడియన్ అని పెడితే మనలో, బయట చాలా మందికి కొందరి గురించిన సమాచారం ప్రతి సంవత్సరం తెలుస్తూ ఉంటుంది..విశ్వనాధ్ (చర్చ) 15:33, 23 డిసెంబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వికీపురస్కారానికి తిరుపతి స్థానికుడైన నామిని పేరు పేరు పెట్టవచ్చుననే అలోచన చాల గొప్పది. ప్రతిపాదించిన సుల్తాన్ ఖాధర్ గారికి చాల ధన్యవాదాలు. దీనికి నాపూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. వాడుకరి:Bhaskaranaidu (చర్చ) 15:43, 23 డిసెంబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
నామిని పేరును స్థానికుడనో, గొప్ప రచయిత అనో పురస్కారం పేరుకు ప్రతిపాదించడం సరికాదు. ఉత్తమ మాండలిక రచయిత పురస్కారాన్ని సాహిత్యరంగంలో అయితే నామిని సుబ్రహ్మణ్యం నాయుడు మాండలిక రచనా పురస్కారం అన్న పేరుతో ఇస్తే బావుంటుంది. విజ్ఞాన సర్వస్వ విషయంలో మాత్రం విజ్ఞాన సర్వస్వం, అందరికీ విజ్ఞానం వంటి రంగాల్లో మైలురాళ్ళు అనదగ్గ కృషి చేసిన మహనీయుల పేర్లు పెడితే బావుంటుంది. లేదంటే నా పేరు ఎందుకు పెట్టరాదు అన్న వివాదాలు ప్రతి ఏడాది మనల్ని బయట నుంచి ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఏడాదే నామిని పేరు వల్ల మనం సమస్యలు ఎదుర్కొనే అవకాశమూ ఉంటుంది. ఇక పేరు లేకపోవడం కన్నా కొమఱ్ఱాజు లక్ష్మణరావు గారి పేరు ఉండడం ఉచితమనిపిస్తుంది నాకు. అవసరమైతే కొమఱ్ఱాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియన్ పురస్కారం-2015 అని పెడితే సరిపోతుంది. విజ్ఞాన సర్వస్వానికి తెలుగులో పాదులుపెట్టిన వ్యక్తిగానే కాక విజ్ఞాన చంద్రికా గ్రంథమాల ఏర్పరిచి తెలుగులో విజ్ఞాన సంబంధిత గ్రంథాలు రావడానికి ఒక ముఖ్య ప్రేరకమయ్యారు. తెలుగు వైతాళికుల్లో ముఖ్యులు. ఆయన పేరిట ఓ పురస్కారాన్ని ఏర్పరిచి ఇవ్వడం ఆయనకు గొప్ప నివాళి మాత్రమే కాక వికీపీడియన్లు కూడా చాలా గౌరవం.--పవన్ సంతోష్ (చర్చ) 09:21, 1 జనవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

6.ఇతర సంస్థల సహకారం[మార్చు]

తిరుపతిలో ఇతర భావసారూప్య సంస్థలైన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు విభాగము మరియు తిరుమల తిరుపతి దేవస్థానము ల సహకారం వీలైతే తీసుకోవచ్చు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:52, 23 డిసెంబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

7.వికీపీడియన్లకు / ఇతరులకు సమావేశానికి ఆహ్వానించుట గురించి[మార్చు]

తిరుపతి వార్షికోత్సవానికి సహ వికీపీడియన్లను కూడ ఆహ్వానించాలి. అటువంటి ఆహ్వానానికి ఎవరు అర్హులో సూచించాలి.

ఉదా: 2014 వ సంవత్సరంలో కనీసం 1000 దిద్దుబాట్లు (అన్నీసోదర ప్రాజెక్టులలో చేసిన దిద్దుబాట్లను కలిపి) చేసిన వారు మాత్రమే అర్హులుగా......???? నిర్ణయించాలి. వీరితో బాటు దిద్దుబాట్ల సంఖ్యతో సంబంధంలేకుండా నిర్వహకులను కూడ ఆహ్వానించాలి. వికీపీడియా నుండి వారికి ప్రయాణపు ఖర్చులు, భోజన ,వసతి కల్పించాలి.

వికీపీడియన్లు కాని వారిలో ఒకరిద్దరిని భాషా పండితులను కూడ అవ్యానించాలి. తెవికికి భాషా సంబందమైన విషయంలో వారి సలహాలను కోరాలి.
 • 2014 లో 1000 దిద్దుబాట్లు చేసినవారే సభకు ఆహ్వానితులుగా నిర్ణయించిన సభ్యులు చాలా మంది అనర్హకుల జాబితాలో చేరుతారు.Palagiri (చర్చ) 04:11, 23 డిసెంబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
2014 అనే కాదు. వికీపీడియన్ అయిన అందరూ ఆహ్వానితులుగా ఉండేలా చూడాలి..విశ్వనాధ్ (చర్చ) 05:54, 24 డిసెంబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

8.చొక్కాలు.. టోపీలు.. మొదలగునవి[మార్చు]

ప్రతి తెలివి సమావేశంలో చొక్కాలు ( టీ షర్టులు) ఇచ్చే సాంప్రదాయం కొన సాగుతున్నది. దాంతో బాటు ఈ సమావేశంలో వికీపీడియా చిహ్నంతో వున్న టోపీ ఇస్తే బాగుంటుంది.

దీనికి గాను గంపగుత్తగా ఒకే సంస్థకు తయారీ బాధ్యతలను అప్పగించవచ్చు. ఈ చొక్కా ఆకృతి వికీపీడియనులలో ఎవరైనా రూపొందించవచ్చు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:47, 23 డిసెంబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
గతంలో పంచిన చొక్కాలు చాలా నాసి రకంగా ఉన్నాయి.ఈ సారి అటువంటి పొరబాటు జరుగకుండా చూడాలి.Palagiri (చర్చ) 04:05, 23 డిసెంబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

9.సమావేశానంతరము......[మార్చు]

విజయ వాడ సమావేశం సందర్భంగా (దశమ వార్షిక ఉత్సవాలు) నిర్వహించిన మాదిరి తిరుపతి సమావేశాలు అయిన అనంతరము రెండు రోజులు తిరుపతి చుట్టుప్రక్కల వున్న కళాశాలలో రెండు రోజులు తెవికి అవగాహన సదస్సు నిర్వహించాలి.

10. ముందస్తు సమావేశాలు[మార్చు]

జనవరి 2015 లో వారానికి ఒక సమావేశము జరిపి పై విషయాలను కూలంకషంగా పరిశీలించి నిర్ణయించి సహ సభ్యుల ఆమోదం పొందాలి.

11. బడ్జెట్[మార్చు]

బడ్జెట్ కొరకు WMF వారికి ముందుగా సవివరంగా ప్రపోజల్ పంపించాలి. దాని తయారీ ముందు జరగాలి. లేదంటే ఏపనీ జరగక అందరిపై వత్తిడి తీవ్రమవుతుంది. ఈ నెలలో అది పూర్తి కావాలి..విశ్వనాధ్ (చర్చ) 13:44, 23 డిసెంబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]


ఈ వార్షికోత్సవ సభలో 2015 సంవత్సరములో వికీపీడియాలో జరగ వలసిన అభివృద్ధి గురించి కొన్ని నిర్ణయాలు ప్రకటించి దాని అమలుకు సహ వికీపీడియన్లు సహరించేటట్లు చేయాలి[మార్చు]

ఉదాహరణకు

1. రోజువారి క్రొత్తగా చేరే వాడుకరుల సంఖ్య గణణీయంగానే వుంది. దీనికి కారణం అప్పుడప్పుడు జరుపుతున్న అకాడెమీలే కారణం కావచ్చు. కానీ అలా క్రొత్తగా చేరిన వారు దిద్దుబాట్లను చేయడములో వెనుకంజ వేస్తున్నారు. 2014 లో ప్రారంబంలో క్రియాశీలంగా వున్న సభ్యుల సంఖ్య 252 వుంటే..... 2014 చివరి నాటికి క్రియాశీల వాడుకరుల సంఖ్య 215 వుంది. ఈ మధ్యలో వారి సంఖ్య కనీస స్థాయి 134 నుండి గరిష్ట స్థాయి 285 మధ్యలో వున్నది. ఇందులో 2014 సంవత్సరారంబంలో 54,000 (సుమారు) పుటలుండగా..... 2014 ఆఖరుకి ఆ సంఖ్య 60,000 లకు పెరిగింది. అభివృద్ధి ఈ ఏడాదిలో 6000. అనగా నెలకు 500 అభివృద్ధి. ఈ క్రియాశీల వాడుకరుల సంఖ్య కనీసం 400 కు అటు ఇటు వుండేటట్లు చేస్తే దిద్దు బాట్ల గణాంకాలు అభివృద్ధి జరగ గలదు. ఈ విషయాన్ని ఈ సమావేశంలో అందరికి వివరంగా చెప్పి.... తదనుగుణంగా కృషి చేయవలెనని అభ్యర్థించ వచ్చు. సమావేశానంతరము ఈ విషయమై ప్రతి వాడుకరికి వారి వారి చర్చా పుటలో ఈ సందేశం పెట్టితే ఫలితం వుండవచ్చు.

2. అదే విధంగా విక్షనరీలో క్రియాశీల వాడుకరుల సంఖ్య 2014 ప్రారంబంలో 21 వుండగా చివరి నాటికి 15 గా వుంన్నది. ఈ మధ్య కాలంలో క్రియాశీలక వాడుకరుల సంఖ్య కనీస స్థాయి 7 ....గరిష్టంగా 27 మధ్యలో వున్నది. అయినా విక్షనరీలో పురోగతి బాగానే వున్నది. ఈ సంవత్సరారంబంలో విక్షనరీలో 76000 విషయపు పుటలుండగా.... సంవత్సరాంతానికి దాని సంఖ్య 97000 చేరింది. అభివృద్ధి 21,000 పుటలు.

3. వికీసోర్సులో 2014 ఆరంబంలో వున్న 8000 గావున్న పాట్యపు పుటల సంఖ్య సంవత్సరాఖరుకు 10,000 చేరింది. ఈ ఏడాదిలో ఆభివృద్ధి 2,000.

ఈ విషయాన్ని సభా ముఖంగా.... వాడుకరులందరికి తెలియ జేసి వారిని మరింత ఉత్సాహ వరచ వలసి వున్నది. అదే విధంగా పైన చెప్పిన గణాంకాలను నిర్ధుష్టంగా సరిచేసి సభానంతరము చేయు నివేధికలో పొందు పరిస్తే వాడుకరలందరికి మంచి అవగాహన వుండగలదు.

4. 2015 వ సంవత్సరంలో మనం చేయబోయే అభివృద్ధికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి సభముందు వుంచి వారి ఆమోదం పొంది ఆ విధంగా కార్యక్రమము కొనసాగించాలి.

ఉదా:

వికీపీడియాలో 2015 లో 15,000 వ్యాసాలకు పెంచాలి. అనగా సంవత్సరాంతానికి 75000 వ్యాసాలు వుండాలని ఒక నిర్ణయం చేసుకోవచ్చు. అలాగే విక్షనరిలో 2015 అంతానికి 100,000 పైగా వుండాలని నిర్ధేశించవచ్చు. వికీసోర్సులో మరొక 10000 అభివృద్ధి సాధించాలని నిర్ణయంగా పెట్టుకోవచ్చు. అంతేగాక ఇంతవరకు అభివృద్ధి కి నోచుకోని ఇతర సోదర ప్రాజెక్టుల లో కనీసం రెండింటిని ప్రగతి బాటలోని తీసుక రావడానికి కృషి చేయాలని నిర్ణయం తీసుకోవచ్చు. వాటిలో వికీకోట్స్ , వికీస్ఫీస్ , ..... , ఇందులో వికీకోట్స్ నందు నేను కొంతవరకు బాధ్యత తీసుకుంటాను.

విక్షనరీ, మరియు వికీసోర్స్ లలో క్రొత్త వాడుకరులు కూడ ఆత్యంత సులభంగా వ్రాయవచ్చు. వీటిలో వ్రాయడానికి వికీ నిబంధనావళి అంతగా అడ్డు కాదు. కనుక క్రొత్తవారిని ఇందులో వ్రాయమని ప్రోత్సహించవచ్చు. ఆయా విభాగలలో అభి వృద్ధి సాధించ గలము.

(వాడుకరి: భాస్కరనాయుడు)

12. 13,14. 1సహా వికీపీడియన్లు ఏమైనా సూచనలు చేయ వచ్చును.[మార్చు]