వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అరల్ సముద్రం
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 16:55, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2016 ఢిశెంబరులో సృష్టించబడింది.అప్పటి నుండి ఇది మొలక,మూలాలు లేవు.విస్తరించటానికి అవకాశం ఉన్న వ్యాసాలుకూడా రెండు లైనులుతో సృష్టించి.ఇక వాటిని గురించి పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు వ్యాసం తొగించటమే మార్గం.సమాచారం కోసం వికీపీడియాని దర్శించినవారికి నిరాశ కలుగుతుంది.ఇటువంటి వ్యాసాలు వికీపీడియాలో ఉండదగినవి కావు.కావున తొలగించటానికి ప్రతిపాదించుచున్నాను. 16:13, 28 April 2020 యర్రా రామారావు talk contribs
- మూస తప్ప ఎటువంటి సమాచారం లేని ఈ వ్యాసాన్ని తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 12:27, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసాన్ని తొలగించాలని 2018 లో ఆగస్టులో ఒకసారి ప్రతిపాదించారు. అయితే, ఒక సమాచారపెట్టెను మాత్రం చేర్చి ఆ మూసను తొలగించేసారు. వ్యాసంలో అర్థవంతమైన సమాచారం చేర్చిందేమీ లేదు. పరిమాణాన్ని 2 కెబి దాటించారంతే. "గేమింగ్ ది సిస్టం" అంటే ఇలాగే ఉంటది. ప్రాథమికంగా మొలక అనేది కనీసమాత్రపు సమాచారంతో, కనీసమొక మూలంతో ఉండాలి. "కనీసమాత్రపు సమాచారాన్ని" కచ్చితంగా నిర్వచించలేం కాబట్టి, 2 కెబి ఉండాలి అని అనుకున్నాం. అదుగో అ ఒక్కముక్కను పట్టుకుని, వ్యాసంలో తగినంత సమాచారం లేకపోయినా, మూసను తీసేసారు. ఇంగ్లీషు వ్యాసం నుండి దీన్ని అనువదించేటపుడు అందులోంచి కనీసం రెండు మూడు అనువైన, సముచితమైన పేరాలను అనువదించి ఉంటే వ్యాసం అర్థవంతంగా, పాఠకుడికి ఉపయోగకరంగా ఉండేది. వికీలో ఏదో పేరుకు ఒక వ్యాసం ఉన్నట్టు తప్ప పాఠకుడికి ఉపయోగపడే వ్యాసం కాదిది. తొలగించాలి. (ఒకరు తొలగింపు మూసను పెట్టినపుడు, దాన్ని మరొకరు తీసెయ్యకూడదనీ, దాని బదులు ఇక్కడ తన అభిప్రాయాన్ని చెప్పాలనీ వాడుకరులందరూ తెలుసుకునేలా రచ్చబండలో చెప్పాలి.) __చదువరి (చర్చ • రచనలు) 15:03, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- లోగడ తొలగింపు మూసలు పెట్టిన తరువాత వాటిమీద ఉదాశీనతగా ఉన్నందున, తగిన సవరణలు చేయకపోగా, మూసను ఏకంగా తీసేసిచంకలు కొట్టుకున్నట్లుగా ఉంది.ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు, విధి విధానాలు ఎవరైనా తయారుచేసి చర్చకు ప్రతిపాదించవలసిన అవసరముంది. ఇలానే ఉంటే సమస్యలు మరింత త్రీవమయ్యే అవకాశముంది. లోగడ ఉన్న కొన్ని మార్గదర్శకాలు, విధివిధానాలకు వేరేభాష్యం అన్వయించుకొని లేదా అడ్డుపెట్టుకుని కొందరు పనిసాగించుచున్నారు.వారికి కావలసింది వికీపీడియా ఎలా ఉన్నా పర్వాలేదు.నేను ఇన్ని సృష్టించాను అనే మానిసికతృప్తి ఉంటే చాలన్నట్లుగా ఉంది.ఏప్రియల్ మాసంలో అభివృద్ది చేసిన వ్యాసాలు ఇలాంటివే.వాస్తవంగా అటువంటి వ్యాసాలకు బాధ్యులైనవారు ఒక్కరు ఆ ప్రాజెక్టుపనిలో పాల్గొనలేదు.అందుకనే కొన్ని అవసరమైతే కఠిన నిర్ణయాలు ఉన్నప్పుడే పనిసజావుగా సాగిందని నాఅభిప్రాయం.ఈ ఉదాశీనతను ఇలానే కొనసాగిస్తే వికీపీడియా ఉనికికి మనమందరం ప్రమాదం కలిగించనవారమవుతాం.ఇది వాస్తవం.ఆలోచించగలరు.--యర్రా రామారావు (చర్చ) 16:28, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసాల సంఖ్య పెంచాలనే ఆసక్తి తప్ప మంచి వ్యాసాన్ని వికీ నియమావళికి అనుగుణంగా రాయాలని వాడుకరులకు లేనట్లుంది. ఒక ప్రతీ వ్యాసం 2 కె.బి మాత్రమే తయారుచేసి మూలాలు, అంతర్గత లింకులు, ఇతర వ్యాసాల నుండి లింకులు ఏవీ ఇవ్వకుండా వేరొక వ్యాసం మొదలు పెడతారు. ఇలా మొలకల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. మనం {{మూలాలు లేవు}} మూసను తగిలించదమే తప్ప ఎవరూ మూలాలు చేర్చరు. ఇలా నిర్వహణ మూసలు ఉన్న వ్యాసాల సంఖ్య పెరిగిపోతుంది. గతంలో ఏక వాక్య మొలకలకు బాధ్యులైనవారు ఎవరూ ఏప్రియల్ నెలలోని ప్రాజెక్టులో భాగంగా వారి మొలక అభివృద్ధికి కృషిచేయలేదు. వారి మొలకలు కూడా మనమే విస్తరించాల్సి వచ్చింది. మనం వికీ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే మరల మొలకలను రాస్తూనే ఉన్నారు. మొలక అనే మూస పెడితే 2 కె.బి వరకు తెచ్చి వదిలేస్తున్నారు. దీనికి సరైన విధానాలు ఏర్పరిస్తే మంచిదేమో ఆలోచించాలి. కె.వెంకటరమణ (చర్చ) 16:42, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- లోగడ తొలగింపు మూసలు పెట్టిన తరువాత వాటిమీద ఉదాశీనతగా ఉన్నందున, తగిన సవరణలు చేయకపోగా, మూసను ఏకంగా తీసేసిచంకలు కొట్టుకున్నట్లుగా ఉంది.ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు, విధి విధానాలు ఎవరైనా తయారుచేసి చర్చకు ప్రతిపాదించవలసిన అవసరముంది. ఇలానే ఉంటే సమస్యలు మరింత త్రీవమయ్యే అవకాశముంది. లోగడ ఉన్న కొన్ని మార్గదర్శకాలు, విధివిధానాలకు వేరేభాష్యం అన్వయించుకొని లేదా అడ్డుపెట్టుకుని కొందరు పనిసాగించుచున్నారు.వారికి కావలసింది వికీపీడియా ఎలా ఉన్నా పర్వాలేదు.నేను ఇన్ని సృష్టించాను అనే మానిసికతృప్తి ఉంటే చాలన్నట్లుగా ఉంది.ఏప్రియల్ మాసంలో అభివృద్ది చేసిన వ్యాసాలు ఇలాంటివే.వాస్తవంగా అటువంటి వ్యాసాలకు బాధ్యులైనవారు ఒక్కరు ఆ ప్రాజెక్టుపనిలో పాల్గొనలేదు.అందుకనే కొన్ని అవసరమైతే కఠిన నిర్ణయాలు ఉన్నప్పుడే పనిసజావుగా సాగిందని నాఅభిప్రాయం.ఈ ఉదాశీనతను ఇలానే కొనసాగిస్తే వికీపీడియా ఉనికికి మనమందరం ప్రమాదం కలిగించనవారమవుతాం.ఇది వాస్తవం.ఆలోచించగలరు.--యర్రా రామారావు (చర్చ) 16:28, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసాన్ని తొలగించాలని 2018 లో ఆగస్టులో ఒకసారి ప్రతిపాదించారు. అయితే, ఒక సమాచారపెట్టెను మాత్రం చేర్చి ఆ మూసను తొలగించేసారు. వ్యాసంలో అర్థవంతమైన సమాచారం చేర్చిందేమీ లేదు. పరిమాణాన్ని 2 కెబి దాటించారంతే. "గేమింగ్ ది సిస్టం" అంటే ఇలాగే ఉంటది. ప్రాథమికంగా మొలక అనేది కనీసమాత్రపు సమాచారంతో, కనీసమొక మూలంతో ఉండాలి. "కనీసమాత్రపు సమాచారాన్ని" కచ్చితంగా నిర్వచించలేం కాబట్టి, 2 కెబి ఉండాలి అని అనుకున్నాం. అదుగో అ ఒక్కముక్కను పట్టుకుని, వ్యాసంలో తగినంత సమాచారం లేకపోయినా, మూసను తీసేసారు. ఇంగ్లీషు వ్యాసం నుండి దీన్ని అనువదించేటపుడు అందులోంచి కనీసం రెండు మూడు అనువైన, సముచితమైన పేరాలను అనువదించి ఉంటే వ్యాసం అర్థవంతంగా, పాఠకుడికి ఉపయోగకరంగా ఉండేది. వికీలో ఏదో పేరుకు ఒక వ్యాసం ఉన్నట్టు తప్ప పాఠకుడికి ఉపయోగపడే వ్యాసం కాదిది. తొలగించాలి. (ఒకరు తొలగింపు మూసను పెట్టినపుడు, దాన్ని మరొకరు తీసెయ్యకూడదనీ, దాని బదులు ఇక్కడ తన అభిప్రాయాన్ని చెప్పాలనీ వాడుకరులందరూ తెలుసుకునేలా రచ్చబండలో చెప్పాలి.) __చదువరి (చర్చ • రచనలు) 15:03, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.