వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/లోతైన అభ్యాసం
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:: తొలగించాలి. – K.Venkataramana – ☎ 15:26, 19 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పేరు మొదలుకొని అంతా కృత్రిమ అనువాద పరిణామం. ఇది కేవలం ఈ ఒక్క వ్యాసం విషయమే కాదు, అనేక వ్యాసాల్లో ఈ వాడుకరి సృష్టిస్తున్నవి ఇలానే జరుగుతున్నాయి. కాబట్టి, తొలగింపుకు ప్రతిపాదిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 03:17, 13 నవంబర్ 2020 (UTC)
- ముందే సాంకేతిక వ్యాసాలు సంబంధిత పరిభాషతో కూడుకుని ఉండడంతో అంత త్వరగా అర్థం కావు. దానికి తోడు భాషా లోపాలు కూడా ఉంటే వ్యాసాన్ని అర్థం చేసుకోవడం మరింత కష్టమౌతుంది. అంచేత అలాంటి వ్యాసాలను రాసేవారు భాష విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. పేజీలోని మొదటి వాక్యాన్ని చూస్తే.. -"లోతైన అభ్యాసం లేదా సునిశిత అధ్యయనం లేదా డీప్ లెర్నింగ్ (డీప్ స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అని కూడా అంటారు) అనేది ప్రాతినిధ్య అభ్యసనతో కృత్రిమ న్యూరల్ నెట్ వర్క్ ల ఆధారంగా మెషిన్ లెర్నింగ్ విధానాల యొక్క విస్త్రృత కుటుంబంలో ఒక భాగంఈ రకమైన అభ్యసన పర్యవేక్షణ లేకుండా, పాక్షిక పర్యవేక్షణ లేకుండా లేదా పర్యవేక్షణ రహితంగా పనిచేస్తుంది." ఈ వాక్యం అర్థం కావడం లేదు. అనువాదంలోని తప్పు స్పష్టంగా, కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. అ తప్పేంటో చెప్పడానికి మూలం చూడక్కర్లేదు. అలాంటి తప్పులను సవరించకుండా ప్రచురించెయ్య కూడదు. ప్రచురించినా ఒకసారి మనమేం రాసామో పరిశీలించుకోవాలి. అనువాదమంటే యంత్రం మనకిచ్చినదాన్ని ఉన్నదున్నట్టు ప్రచురించెయ్యడం కాదు, దాని లోని తప్పులను సవరించాల్సి ఉంటుంది అని గ్రహించాలి. ఇలాంటి తప్పులు వ్యాసంలో ఎక్కడో ఒకచోట ఉంటే పర్లేదు, సవరించుకోవచ్చు. కానీ ఎక్కువగా ఉంటే సవరణలకే ఎక్కువ సమయం పడుతుంది. ఒక వారం లోపు భాషా దోషాలను, అనువాద దోషాలనూ సవరించకపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 04:30, 13 నవంబర్ 2020 (UTC)
- ఈ వ్యాసం శుద్ధిచేయబడని యాంత్రిక అనువాద వ్యాసం. ఒక నెలరోజులైనా శుద్ధి చేయబడనందున తొలగించాలి. – K.Venkataramana – ☎ 15:25, 19 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.