Jump to content

వికీపీడియా:నాణ్యతాభివృద్ధి సమిష్టి కృషి

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియాలోని వ్యాసాలకు కనీస నాణ్యత ఉండేలా తెలుగు వికీపీడియా సభ్యులు సమిష్టిగా పనిచేయడం అన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

మొదటి పేజీ ఎందుకు?

[మార్చు]

మొదటి పేజీ తెలుగు వికీపీడియాలో సాధారణంగా అతి ఎక్కువ మంది పాఠకులు చూసే పేజీ. దీనిలో ప్రదర్శించే వ్యాసాలలో కనీస నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం ఒక విధంగా ప్రదర్శించే ఉద్దేశాలకే దెబ్బ. కాబట్టి కనీస నాణ్యతా ప్రమాణాలు నిర్దేశించుకుని, రెండు వారాలకు ముందు మొదటి పేజీలో ప్రదర్శించబోయే వ్యాసాలను మెరుగుచేస్తూ ఉండడం దీని లక్ష్యం.

ప్రమాణాలు

[మార్చు]

ఈ ప్రమాణాలు మూడు విధాలుగా ఉంటాయి:

  1. కనీస స్థాయి
  2. మధ్యమ స్థాయి
  3. తృతీయ స్థాయి

మరీ తీసికట్టుగా ఉండకపోవడం కనీస స్థాయి అయితే మంచి అయ్యేలాంటి వ్యాసాలు మెరుగైన స్థాయి.

పద్ధతి

[మార్చు]

మొదటి పేజీలో రాబోయే వ్యాసాలని రెండు వారాల ముందు జాబితా వేయడం జరుగుతుంది. పాల్గనే సభ్యులు జాబితాలోని వ్యాసాలను పరిశీలించి వివిధ స్థాయిల్లోని వ్యాసాలను మెరుగు చేసి ఏయే స్థాయిల్లో మెరుగుచేశామన్నది నమోదుచేస్తారు. అన్ని వ్యాసాలూ వారాంతం కల్లా కనీస స్థాయిలోకి వస్తాయన్నది బలమైనది కాకున్నా ఒక ఉద్దేశం.

ప్రస్తుత సమిష్టి కృషి
వికీపీడియా:మొదటి పేజీ సమిష్టి కృషి/2019-11వ వారం

పాల్గొనేవారు

[మార్చు]
  1. --పవన్ సంతోష్ (చర్చ) 04:23, 11 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]