Jump to content

వికీపీడియా:మెరుగైన వ్యాసాలు/మధ్యమ స్థాయి

వికీపీడియా నుండి
ప్రధాన పేజీచర్చమౌలికాంశాలు, నాణ్యతా చట్రంకనీస స్థాయిమధ్యమ స్థాయితృతీయ స్థాయిసూచనలు

వికీపీడియా విజ్ఞాన సర్వస్వ వ్యాసం పేజీకి ఉండాల్సిన కనీసం మాత్రపు హంగులను సమకూర్చడం.

వాడుకరులకు ఈ పని చెయ్యడానికి అవసరమైనవి.

  • ఈ పని చేసేందుకు భాషపై ప్రాథమిక స్థాయి పట్టు ఉంటే చాలు.
  • వికీపీడియా కుశలత: ప్రాథమిక స్థాయి కుశలత ఉంటే చాలు.
  • కొత్తగా పాఠ్యం చేర్చల్సిన పని లేదు కాబట్టి, దాని కోసం పరిశోధన చెయ్యనక్కర్లేదు.

ఈ స్థాయిలో వ్యాసానికి సమకూర్చాల్సిన హంగులను కింది పట్టికలో చూడవచ్చు. ఈ చెక్‌లిస్టు ప్రకారం పేజీని మెరుగుపరచుకుంటూ వెళ్ళండి.

క్రమ సంఖ్య అంశం
1 సమాచారపెట్టె: సమాచారపెట్టె ఉంటే అందులో ఉండాల్సిన కనీస సమాచారం రాయాలి. అసలు పెట్టే లేకపోతే, సంబంధిత సమాచారపెట్టెను చేర్చి సమాచారం చేర్చాలి.
2 వ్యాసంలో జనన వివరం రాయాలి
3 వ్యాసంలో మరణ వివరం రాయాలి (జీవించి ఉన్న వ్యక్తులకు కాకుండా)
4 సమాచారపెట్టెలో జనన వివరం రాయాలి
5 సమాచారపెట్టెలో మరణ వివరం రాయాలి
6 తేదీ పేజీలో జనన వివరం నమోదు చెయ్యాలి
7 తేదీ పేజీలో మరణ వివరం నమోదు చెయ్యాలి
8 సంవత్సరం పేజీలో జనన వివరం నమోదు చెయ్యాలి
9 సంవత్సరం పేజీలో మరణ వివరం నమోదు చెయ్యాలి
10 ఫలానా సంవత్సరంలోని జననాలు అనే వర్గాన్ని చేర్చాలి
11 ఫలానా సంవత్సరంలోని మరణాలు అనే వర్గాన్ని చేర్చాలి
12 అంతర్వికీ లింకులను చేర్చాలి
13 పేజీకి ఎడమ వైపున ఉన్న నేవిగేషను లింకుల్లో "వికీడేటా అంశం" లింకు లేకపోతే, సంబంధిత అంశానికి ఈ పేజీని జతపర్చాలి. అంశం అసలు ఉనికిలోనే లేకపోతే, ఆ అంశాన్ని సృష్టించాలి.
14 {{Authority control}} మూస: పేజీని ఎడిట్ మోడులో తెరిచి, అడుగున, మిగతా మూసలకు పైన ఈ మూసను ఉంచి పేజీని భద్రపరచండి. అయినా ఈ మూస పేజీలో కనిపించకపోతే, ఆందోళన పడవద్దు. ఈ పేజీకి సంబంధించిన వికీడేటా అంశంలో ఐడెంటిఫయర్లేమీ లేకపోతే, ఈ మూస కనిపించదు. కాబట్టి, పేజీని సేవు చేసాక, మూస కనబడ్డం లేదే అని ఆందోళన పడనక్కర్లేదు. మూసను పెట్టి మర్చిపోవాలి, అంతే)
15 ఐ.ఎమ్.డి.బి ఐడీ (సమాచారపెట్టెలో ఈ ఐడీని చేర్చాలి.)
16 పేజీలో బొమ్మ లేకపోతే, కామన్స్‌లో వ్యాస విషయానికి సంబంధించిన సముచితమైన బొమ్మ ఉంటే దాన్ని చేర్చాలి

ఒక ఉదాహరణ: నందమూరి తారక రామారావు అనే వ్యాసం తీసుకుందాం

  1. సమాచారపెట్టె ఉందా? ఉంది. దానిలో సమాచరం అంతా ఉందో లేదో చూడండి. ఉన్నాయి. కాబట్టి దీన్ని పట్టించుకోనక్కర్లేదు.
  2. వ్యాస పాఠ్యంలో జనన వివరం - తేదీ, స్థలం - ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి దీన్ని పట్టించుకోనక్కర్లేదు.
  3. వ్యాస పాఠ్యంలో మరణ వివరం - తేదీ, స్థలం - ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి దీన్ని పట్టించుకోనక్కర్లేదు.
  4. సమాచార పెట్టెలో జనన వివరం - తేదీ, స్థలం - ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి దీన్ని పట్టించుకోనక్కర్లేదు.
  5. సమాచార పెట్టెలో మరణ వివరం - తేదీ, స్థలం - ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి దీన్ని పట్టించుకోనక్కర్లేదు.
  6. ఈ పేజీ 1923 జననాలు అనే వర్గానికి చేర్చి ఉందా? ఉంది. కాబట్టి దీన్ని పట్టించుకోనక్కర్లేదు.
  7. ఈ పేజీ 1996 మరణాలు అనే వర్గానికి చేర్చి ఉందా? ఉంది. కాబట్టి దీన్ని పట్టించుకోనక్కర్లేదు.
  8. 1923 పేజీలో నందమూరి తారక రామారావు జనన వివరం ఉందా? ఉంది. కాబట్టి దీన్ని పట్టించుకోనక్కర్లేదు.
  9. 1996 పేజీలో నందమూరి తారక రామారావు మరణ వివరం ఉందా? ఉంది. కాబట్టి దీన్ని పట్టించుకోనక్కర్లేదు.
  10. మే 28 పేజీలో నందమూరి తారక రామారావు జనన వివరం ఉందా? ఉంది. కాబట్టి దీన్ని పట్టించుకోనక్కర్లేదు.
  11. జనవరి 18 పేజీలో నందమూరి తారక రామారావు మరణ వివరం ఉందా? ఉంది. కాబట్టి దీన్ని పట్టించుకోనక్కర్లేదు.
  12. నేవిగేషను పట్టీలో అంతర్వికీ లింకులున్నాయా? ఉంది. కాబట్టి దీన్ని పట్టించుకోనక్కర్లేదు.
  13. నేవిగేషను పట్టీలో వికీడేటా అంశానికి లింకుందా? ఉంది. కాబట్టి దీన్ని పట్టించుకోనక్కర్లేదు.
  14. పేజీకి అడుగున {{Authority control}} మూస ఉందా? మామూలుగా కనబడకపోతే, పేజీని ఎడిట్ మోడులో తెరిచి, ఉందేమో చూడండి. లేకపోతే పెట్టండి. మూస ఉంది, కాబట్టి దీన్ని పట్టించుకోనక్కర్లేదు
  15. బొమ్మ ఉందా? లేకపోతే, కామన్స్ లో ఉందేమో చూసి దాన్ని ఈ పేజీలో పెట్టాలి. నందమూరి తారక రామారావు పేజీలో బొమ్మ ఉంది. కాబట్టి దీన్ని పట్టించుకోనక్కర్లేదు.
  16. సమాచారపెట్టెలో ఐ.ఎమ్.డి.బి ఐడీ లేదు. ఎందుకు లేదో పరిశీలించండి. వీలైతే చేర్చండి.