Jump to content

వికీపీడియా:పాఠం (ఖాతా)

వికీపీడియా నుండి
మొదటి పేజీ   దిద్దుబాటు   ఫార్మాటింగు   వికీపీడియా లింకులు   బయటి లింకులు   చర్చాపేజీలు   గుర్తుంచుకోండి   ఖాతా   ముగింపు    

మీ పేరు నమోదు చేసుకోవడం తప్పనిసరేమీ కాదు, కానీ మేం దాన్ని ప్రోత్సహిస్తాం!

వికీపీడియాలో రాసేందుకు ఖాతా ఉన్నా లేకున్నా అందరూ ఆహ్వానితులే. అయితే, కొత్త వ్యాసాలు మొదలుపెట్టాలంటే తప్పనిసరిగా మీకు ఖాతా ఉండాలి.

ఖాతా తెరవాలని ప్రోత్సహించడానికి మూడు కారణాలున్నాయి:

ఖాతా సృష్టించుకోవడంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి; మరిన్ని దిద్దుబాటు అవకాశాలు, సభ్యుని అభిరుచులు మొదలైనవి. వాటిలో ఒకటి వీక్షణ జాబితా. మీకు ఆసక్తి ఉన్న పేజీల్లో జరిగిన మార్పులను గమనిస్తూ ఉండే అంశం ఇది. పేజీని తరలించడం లేదా పేరు మార్చడం మరో అంశం.

ఖాతా లేని వ్యక్తి ఏ కంప్యూటరు ద్వారా దిద్దుబాట్లు చేస్తున్నారో ఆ కంప్యూటరు యొక్క ఐ.పి.అడ్రసు ద్వారా సదరు వ్యక్తిని గుర్తిస్తారు. మీ ఐ.పి.అడ్రసు ద్వారా మీ గురించిన సమాచారాన్ని కనుక్కోగలిగే వీలుంది. లాగిన్ అయినపుడు మీ ఐ.పి.అడ్రసు బయటికి కనబడదు కాబట్టి, ఆ రకంగా చూస్తే నమోదు చేసుకోవడం వలన మీ గోప్యత పెరిగే అవకాశం ఉంది. పైగా ఐ.పి.అడ్రసులు తరచూ మారే అవకాశం ఉంది కాబట్టి, వివిధ సమయాల్లో మీరు చేసిన దిద్దుబాట్లు అనేక ఐపీలకు చెంది మీకు గుర్తింపు లభించదు. చర్చలో పాల్గొన్నపుడు ఇతర సభ్యులు లాగిన్ అయి ఉన్న సభ్యునితో చర్చించేందుకు ఇష్టపడతారు గానీ, ఐ.పి.అడ్రసుతో చర్చించేందుకు అంతగా ఇష్టపడరు.

ఇక చివరగా, ఖాతా ఉన్న సభ్యులు మాత్రమే నిర్వాహకులు కాగలుగుతారు. మీకు ఖాతా ఉంటే, మీ సభ్యనామాన్ని, మీ సంకేత పదాన్ని మర్చిపోకండి. ఒకవేళ మర్చిపోయే అవకాశాలున్నాయనుకుంటే, ఖాతా తెరిచేపుడే మీ ఈమెయిలు అడ్రసు ఇచ్చి, ఆ తరువాత దాన్ని నిర్ధారించండి. మీరు సంకేతపదం మరిచిపోయినపుడు కొత్త సంకేతపదాన్ని పంపించేందుకు ఇది పనికి వస్తుంది.

మరింత సమాచారం కోసం అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి? చూడండి.

నమోదు చేసుకోవడం ఎలా

ఖాతా తెరిచేందుకు పైనున్న లింకు నొక్కండి. లేదా ఈ పేజీలో పైన కుడి మూలన ఉన్న లాగిన్ లింకు నొక్కండి. ఓసారి ఖాతా తెరిచాక, సభ్యనామాన్ని మార్చుకోవడం అంత తేలిక కాదు. అంచేత సభ్యనామం ఎంచుకునే విధానాలు చదివి ఆ సూచనల ప్రకారం సభ్యనామాన్ని ఎంచుకోండి.

నేర్చుకున్నదాన్ని ఓసారి సమీక్షించుకుని ముగించండి