వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా)/పాత చర్చ 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ధన్యవాదాలు

[మార్చు]

చంద్రకాంత రావు గారికి నమస్కారములు, మీ బ్లాగులో నాకూ కాసింత చోటిచ్చినందుకు ధన్యవాదాలు, నాకు మనసులో ఏదీ దాచుకోకండా అందరితో పంచుకోవాలనుంటుంది, అందుకు మన తెలుగులో వికీపీడియా ద్వారా అవకాశం వుందని మొన్నటి ఆదివారం వార్తలో చూసేంతవరకు తెలీదు. నేను ఇంటివద్ద పి.సి. పెట్టుకునే అవకాశం ఈ మధ్యనే లభ్యమయింది. కొత్తగా నెట్ లో చూడడం మొదలు పెట్టాను. మొదట్లోనే మీ వంటి పెద్దల స్నేహ హస్తం లభించినందుకు థాంక్స్. నా వరకు నా కంట్రిబ్యూషన్ మన:పూర్వకంగా అందిస్తాను. ़~~़జంఝావతి

సభ్యుల వ్యాసాలతో పాటు కవితలుకూ ఒక పేజీ వుంటే బాగుణ్ణు

[మార్చు]

తెలుగులో ఇంత మంది మిత్రుల వ్యాసాలతో పాటు కవితలుకూ అవకాశం కల్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చంద్రకాంతరావుగారి రిప్లై కోసం ఎదురుచూస్తుంటా. ధన్యవాదాలు.

़~~़జంఝావతి..

కవితలకూ, స్వంత రచనలకు వికీసోర్స్ సరైన వేదిక. వికీపీడియా లో విజ్ఞాన సంభందమైన విషయాలే ఉంటాయి. రవిచంద్ర(చర్చ) 05:04, 2 నవంబర్ 2008 (UTC)
జంఝావతి గారూ, తెవికీ నియమావళి ప్రకారం ఇందులో వ్యాసాలు మాత్రమే వ్రాయాలి. కవితలకూ, అలాగే స్వంత రచనలకు ఇక్కడ స్థానం లేదు. ఇది వరకే ఉన్న విషయాల తప్ప స్వంత అభిప్రాయాలు ఇందులో చేర్చరాదు. అలాగని ఎక్కడో ఉన్న సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా కాపీ కూడా చేయరాదు. గ్రంథాలలో, పత్రికలలో, వెబ్‌సైట్లలో ఉన్న కొన్ని వాక్యాలను తీసుకొని వ్యాసాలలో చేర్చవచ్చు. వాటికి రెఫరెన్స్ పెడిచే చాలు. మీరు వ్యాసాలను వ్రాయడం ప్రారంభించండి. కొంత కాలంలోనే మీకు పూర్తి అవగాహన వస్తుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 06:07, 2 నవంబర్ 2008 (UTC)
తెవీకీ సంబంధించిన సృజనాత్మక కృతులను వికీపీడియా:తెవికీ వార్త కు రాయవచ్చు.-- అర్జున 04:31, 18 అక్టోబర్ 2010 (UTC)

తెలుగు వారి పేర్లు

[మార్చు]

ఇక్కడ కొంత విషయం వాడుకరి:Sairatna పేజీకి మార్చడమైనది. --కాసుబాబు 11:50, 29 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:Secularindia

[మార్చు]

ఈ వాడుకరి మీద నిఘా ఉంచితే మంచిది అని నా అభిప్రాయము. వాడుకరి:Secularindia కిరణ్మయీ 14:18, 14 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక విశేషం

[మార్చు]

ఇవ్వాళ అరేబియా సముద్రము పేజీనుండి రుమేనియన్ అంతర్వికీ లింకును నొక్కి ఆ పేజీకి వెళ్ళాను. ఆశ్చర్యంగా అక్కడ నాకో వ్యక్తిగత సందేశం ఉన్నట్టు కనబడింది (వాళ్ళ భాషలోనేననుకోండి, ఆ వాక్యాన్ని బట్టి, దాని బ్యాగ్రౌండు రంగును బట్టి నా వ్యక్తిగత సందేశం అనుకున్నాను.) ఆ లింకుకు వెళ్తే ంజంగానే నాకో సందేశం ఉంది. అంతర్విక్ లింకు ద్వారా వెళ్తే ఆటోమాటిగ్గా సందేశం వచ్చే ఏర్పాటేదో చేసారు వాళ్ళు. వికీలన్నిటికీ కామను లాగిన్ ఉంటం వలన ఇది చెయ్యగలిగారన్నమాట. __చదువరి (చర్చరచనలు) 02:59, 5 ఆగష్టు 2009 (UTC)

మీకు ఆ సందేశాన్ని బాటు ద్వారా అందించిఉండవచ్చు. మన తెవికీ లో కూడా ప్రదీపు గారు రాసిన స్వాగతం బాటు ఉంది. దాన్ని రన్ చేస్తే కొత్త వాడుకరులందరికీ అదే ఆటోమాటిక్ గా స్వాగత సందేశాన్ని పంపేస్తుంది. --రవిచంద్ర (చర్చ) 08:32, 5 ఆగష్టు 2009 (UTC)