Jump to content

వికీపీడియా:రచ్చబండ (సహాయము)/పాత సహాయము 1

వికీపీడియా నుండి

ఎడిట్‌ బాక్స్‌ లో తెలుగులో రాయాలంటే..

[మార్చు]

ప్రస్తుతమున్న ఎడిట్‌ బాక్స్‌ లో తెలుగు లో రాసే వీలు లేదు, అందుచేత పద్మ వాడి చేస్తున్నాను. వికీపీడియా ఎడిట్‌ బాక్స్‌ లోనే తెలుగు లో రాసే సౌలభ్యం కలుగజేయ గలమా? (చదువరి)

If you are using windows XP you can setup telugu keyboard and type using the Inscript layout keyboard directly anywhere you want. The only downside is that the keyboard layout is not intuitive. so you have to get used to it. I started out using the Inscript layout only. I have uploaded a picture of it here. I am searching for a RTS layout for XP. Other wise we might have to make it ourself --వైఙాసత్య 14:26, 17 August 2005 (UTC)


Have u tried the keyboard which comes with pothana font?

somebody told me it works.

I have not tried it ofcourse :)


నేను పోతన ఫాంట్ తో వచ్చే Taveltusoft వాడుతున్నాను. ఇది నాకు చాలా వీలుగా ఉన్నది. నేరుగా ఎడిట్‌ బాక్స్‌ లో గాని, వేరే ప్రోగ్రాములో గాని టైపు చేయవచ్చునను. పద్మ, లేఖిని లకు కొంచెం భిన్నంగా ఉన్నా, ఇది కూడా intuitive అని చెప్పవచ్చును. "ఆధ్యాత్మ రామాయణము" అని వ్రాయాలంటే, లేఖినిలో "AdhyAtma rAmAyaNamu" అని వ్రాయాలి. Taveltusoft లో "ADhyAthm rAmAyNmu" అని వ్రాయాలి. ఇందులో ప్రతి వత్తుకు ముందు "h" నొక్కాలి. సున్నా కావాలంటే "f" నొక్కాలి. "క" కావాలంటే లేఖిని లో "ka" అని వ్రాయాలి. ఇందులో "k" అంటే చాలు.

కాసుబాబు 17:19, 16 ఆగష్టు 2006 (UTC)


నేను తిరుమల క్రిష్ణ దేసికాచార్యులు గారి కీ బోర్డు (పోతన ఫాంటు తో వచ్చేది)ను m17n పద్దతి లో itrans లాగా మారుస్తున్నాను. కాకపోతే ప్రస్తుతము మాములుగా న కార పొల్లులు వస్తాయి. క రావాలంటే itrans లో లాగా ka టైపు చేయాలి. ఇంకొద్ది మార్పులు చేసిన తరువాత తెవికీగుంపుకి తెలియచేస్తాను

అర్జున 17:01, 26 సెప్టెంబర్ 2007 (UTC)

Complete list of templates

[మార్చు]

Where is the complete list of templates located?- Chaduvari 11:08, 24 August 2005 (UTC)

There is no complete list of templates yet in telugu as you realise. I have created వికీపీడియా:సమాచార పెట్టె with all the infoboxes. In :en wiki All the templates are not in one page. But they have a table with links to different types of templates. This would be good place to start en:Wikipedia:WikiProject Templates --వైఙాసత్య 12:53, 24 August 2005 (UTC)


I collected some of the templates here --వైఙాసత్య 14:04, 24 August 2005 (UTC)
Hey, samachaara pattika page,or the template page we are referring to is done... but,we need to update many of them. I am updating one and am adding it on the main page వికీపీడియా:సమాచారపట్టిక.

I felt, I can take care of these templates better than other parts of the wikipedia. Drop me message in my చర్చ page whenever some one needs a new template / మూస

Also consider "వికీపీడియా: సమాచారపట్టిక" in place of వికీపీడియా: సమాచార పెట్టె. Please dont true translate all stuff. That sucks! Thanks - --సూరపనేని 21:49, 24 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

"templates = మూసలు" --సూరపనేని 22:29, 25 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చిత్రాల గురించి సందేహం

[మార్చు]

నేను కొన్ని చిత్రాలను అప్ లోడ్ చెయ్యకుండా ఆంగ్ల వికీపీడియాలోని చిత్రాల లింకులను ఇక్కడ వ్యాసాలలో ఉపయోగిస్తున్నాను. దీని వలన భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా ??? -- శ్రీనివాస 21:26, 21 జూన్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

ఏమీ ఇబ్బందులు రావు. మీరు చేసిన పనే అన్నిటికంటే ఉత్తమము. పర్ఫెక్ట్ ప్రపంచములో అన్ని బొమ్మలు వికిమీడియా కామన్స్‌ లో ఉండాలి. మిగతా అన్ని ప్రాజెక్టులలో లింకులు మాత్రమే ఉండాలి. కానీ కామన్స్‌ లో అప్లోడ్ చెయ్యాలంటే ఖచ్చితంగా GFDL లైసెన్సు లేదా పబ్లిక్ డొమైనులో ఉండాలి. డీ.వీ.డీ ముఖచిత్రాలువంటివి కాపీహక్కులు కల బొమ్మలు ఫెయిర్ యూజ్ కింద ఆయా వికిపీడియాల్లో స్థానికంగానే అప్లోడ్ చేసి వాడుకోవాలి. --వైఙాసత్య 04:43, 22 జూన్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త సహాయము పేజీ

[మార్చు]

మార్గదర్శకము లింకుల్లోని సహాయము లింకు ఇక నుండి కొత్త సహాయము పేజికి వెళ్తుంది. __చదువరి (చర్చ, రచనలు) 18:05, 20 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

తమిళ సహాయం

[మార్చు]

తమిళ వికీపీడియాలో సహాయం పేజీల్లో ఆడియో ఫైళ్ళు పెట్టారు. అది చాలా ఉపయోగకరం. తమిళం తెలిసిన వారెవరైనా అవి విని, ఎలా ఉన్నాయో వాటిలో ఏమున్నాయో తెలుసుకోగలరా? మనమూ ఆ ఏర్పాటు చేసుకుందాం. __చదువరి (చర్చ, రచనలు) 19:44, 20 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు అరవం రాదు, కాని నేను ఈ ప్రణాళికకు రేడీ, నా గళం చాలా బాగుటుంది. నన్ను ఈ ప్రణాళికలొ చేర్చుకోరూ...ప్లీజ్, ప్లీజ్...--S172142230149 19:48, 20 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అంతలా బతిమిలాడ్డం ఎందుకండి, మీరే చెయ్యండి. ముందుగా వికీపీడియా:5 నిమిషాల్లో వికీ పేజీలోని "ఎడమవైపున ఉండే లింకులు" అనే విభాగాన్ని చదివి, రికార్డు చేసి, (.ogg ఫైలుగా చెయ్యాలనుకుంటా) అప్ లోడు చెయ్యండి. ఆ తరువాత మిగతా వాటి సంగతి చూద్దాం__చదువరి (చర్చ, రచనలు) 19:57, 20 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

రెండు సమస్యలున్నాయి

[మార్చు]
పి.డి.యఫ్ & తెలుగు ఫాంట్స్ గురించి నాకు రెండు సమస్యలున్నాయి.వాటికి

పరిష్కారం సూచించగలరని ఆశిస్తున్నాను: 1.తెలుగు పి.డి.యఫ్ ఫైల్లో కొంత భాగాన్ని కట్ చేసి సేవ్ చేసుకో వచ్చా?దానిని వార్డ్ డాక్యుమెంట్లో సేవ్ చేసుకోవచ్చా? 2.http://www.andhrabharati.com/strI_bAla/bAlabhASha/index.html ఇందులో వేటూరి ప్రభాకర శాస్త్రి సేకరించిన పిల్లల పాటలు చాలా వున్నాయి .వాటిని కాపీ- పేస్ట్ పద్దతిలో సేవ్ చేయలేక పోతున్నాము.ఈ సైట్లో అరుదైన తెలుగు సామెతలు చాటువులు శతకాలు వున్నాయి. వాటిని తెలుగు లిపిలో యదాతదంగా సేవ్ చేసుకునే వుపాయం ఏమిటి? Nrahamthulla 18:12, 13 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

పి.డి.యఫ్ ఫైలులోంచి కాపీ చేసే అవకాశం లేదనుకొంటాను. ఎందుకంటే ఇప్పటిదాకా తెలుగులో O.C.R. software అభివృద్ధి కాలేదు (నాకు తెలసినంతలో). ఇంక ఆంధ్రభారతి గురించి క్రింద వ్రాసిన చర్చ చదవండి. --కాసుబాబు 20:16, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

లాగ్ అవటం మరచిపోతే ఐ.పి. నంబర్ తో మనం రాసిన విషయం నమోదు అవుతుంది.ఇలా కాకుండా లాగ్ ఐతేనే రాసిన విషయం నమోదు అయ్యేలా ఏర్పాటు చేయొచ్చు కదా?--Nrahamthulla 04:27, 21 నవంబర్ 2008 (UTC)

ఆలాంటి అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే వికీలో అనామక సభ్యులకూ, లాగిన్ అయిన వారికీ పెద్ద తేడాలు లేవు. బొమ్మలు అప్‌లోడ్ చేయడం వంటి కొద్ది విషయాలలో తప్ప. అయితే మీ లాగిన్ పేజీలో "బనన్ను గుర్తుంచుకో" బాక్సు ద్వారా ఆటొమాటిక్‌గా లాగిన్ అవవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:05, 21 నవంబర్ 2008 (UTC)

AMdhrabhArati .com

[మార్చు]

ఆంధ్రభారతిలో వ్యాసాలని సేవ్ చేసుకునే దారి లేదనుకుంటాను. వారు ప్రిసైజ్ గా ఇలాంటి వాటిని అరికట్టడానికే డైనమిక్ ఫాంటుని ఎంచుకున్నారు. ఇది చాలా విచారకరం. కొంతకాలం క్రితం నాగార్జున వెన్న ("తమ కార్యమ్ము పరిత్యజించి.. " ) ఆంద్రభారతి వారి ఫాంటుకి తన పద్మ ఎక్టెన్షన్ లో సపొర్ట్ కలిగించాడు. అందువల్ల ఆంద్రభారతి పేజీలు firefox లో యూనికోడులో కనిపించేవి. వాటిని అప్పుడు యూనికోడులో సేవ్ చేసుకోగలిగేవారు. ఈ సంగతి గమనించిన ఆంధ్రభారతి నిర్వాహకులు ఆ ఫాంటుని తొలగించి, పనికట్టుకుని వేరే encoding కల వేరే ఫాంటుని ఉపయోగించడం మొదలు పెట్టారు. uni.medhas.org వారుకూడా కొన్నాళ్ళు ఆంధ్రభారతిని సపోర్ట్ చేసే వాళ్ళు. ఇది గమనించిన ఆంధ్రభారతి వాళ్ళు దానిని కూడా అచేతనం చేసారు. ఆంధ్రభారతి వారు ఈమధ్య కొంతమంది వికీపీడియన్ల విన్నపాన్ని కూడా తిరస్కరించారని తెవికీ గ్రూపులో చదివాను. ఇది చాలా విచారకరం. ఎంతో మంచి కంటెంట్ కల సైటులు పని కట్టుకుని ఇలా వాళ్ళ సైటుని వేరే వాళ్ళకి నిరుపయోగంగా చెయ్యడానికి ఎంత ఆలోచించినా నాకు కారణం కనిపించదు. ఆంధ్రభారతి వాళ్ళ కంటెంట్ వారు సృష్టించినది కాదు కదా! రామయణ భారత భాగవతాలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నవే కదా! సమకాలీన సాహిత్యానికి వారు ఆయా రచయితల కాపీరైటు హక్కులు పొందారో లేదో మనకి తెలీదు. వారు చేసినది వాటిని అన్నిటినీ ఓపికగా టైపు చేసిన ఒక చోట పెట్టడం. అది ఇతరులతో, అందులోనూ, వికీపీడియా లాంటి ఉన్నతమైన ఆశయాలున్న ప్రాజెక్టులతో పంచుకోకపోవడం చాలా సంకుచితమని నా అభిప్రాయం.

ఇలాంటి సందర్భాల్లో నాకు ఈ భర్తృహరి (ఏనుగు లక్షణ కవి అనువాదం) సుభాషితం గుర్తుకు రాకమానదు. :-( -- పద్మ ఇం.

మీరు "ఇంద్రగంటి పద్మ"గారే కద? మీమ్మల్ని వికీలో చూడటం సంతోషం కలిగిస్తోంది. ఇక ఆంధ్రభారతి విషయానికొస్తే...మీ సందేశం వలన నాకు కొత్త విషయాలు తెలిశాయి. అసలు ఆంధ్రభారతి వారిని మళ్ళీ కదిపి చూద్దాం అనుకున్నాను, కానీ మీరు వ్రాసింది చదివిన తరువాత..ఆలోచనను మానుకొంటున్నాను. వికీలో రెండు వేల మంది ఉన్నాం...చేతులు చేతులు కలిపితే సాహితీ సాగరాన్ని యూనీకోడీకరించడం నెలల్లో పని. దీనికొక ప్రణాలికను తయారు చేసి సాహితీ సాగరాన్ని వికీ సోర్సులో ఉండేటట్టు చేద్దాం --నవీన్ 04:47, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అలా అనుమతి అడిగింది నేనే. వారు అనుమతి నిరాకరించడం నాకు నిరుత్సాహం కలిగించిన మాట నిజమే. కాని మనకు అనుమతి ఇవ్వకపోవడం వారి పరిపూర్ణమైన హక్కు. కనుక మనం నిష్టూరంగా మాటలాడడం ఉచితం కాదు. ఏమైనా ఆంధ్రభారతివారి భాషా సేవను మాత్రం మనం ప్రశంసించాలిసిందే. --కాసుబాబు 20:24, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సుందరకాండము గురించి మాటలబాబు గారి ప్రశ్న

[మార్చు]
తరువాత ఈ చర్చను సుందరకాండకు తరలిద్దాము.

రామాయణం చేసినట్లు సుందరకాండ కు ఒక మూస చేస్తే ఎలా ఉంటుంది. సుందరకాండలోనే చాలా కథలు ఉన్నాయి కదా.. ఉదాహరణకు లంకా లంఘనం,కాంచనలంకావలోకనం+లంకిణి మరణం,పుష్పక విమాన వర్ణణం,అశోకవనాన్ని సీతమ్మ ను కాంచడం, రావణాసురుడు సీతమ్మ వద్దకు రావడం,త్రిజటా స్వప్నం, హనుమ సీతమ్మ తొ మాట్లాడ్డం, సీత అభజ़్తం+తకాకాసుర వృత్తాంతం,జంబుమాలి రావణ కింకరుల మరణం, అక్ష కుమారుడు మరణం, ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం, హనుమ రావణుడిని చూడడం,లంక అగ్ని లొ పూర్తిగా దగ్ధం అవ్వడం, మళ్ళి సీత దర్శనం, మహేంద్రగిరి కి చేరుకోవడం, వానరాలు కిష్కిందకు చేరడం హనుమ రామునకు సీత విషయాలు చెప్పడం. ఇది ప్రాధమిక సమాచారం, నేను ప్రతి వ్యాసం లొ 2 kb వచ్చేటట్లు చేస్తాను --మాటలబాబు 23:05, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

చెయ్యొచ్చు కానీ..నేని విషయంలో కొంచెం సంధిగ్ధంలో ఉన్నాను. ఇంత వివరంగా సుందరకాండలోని వివిధ ఘట్టాల గురించి రాస్తే వికీపీడియా పరిధి దాటిపోతుందేమోనని నా అనుమానం. వికీసోర్స్‌లో చేర్చటానికి మీరు ఒక పబ్లిక్ డొమైన్ మూలాన్ని యధాతధంగా రాయటం లేదు కదా. వికీ బుక్స్ పరిధిలోకి వస్తుందేమో చూడాలి. ఈ విషయమై మిగిలిన సభ్యుల అభిప్రాయాలను కోరటం మంచిది. నేనూ ఆంగ్ల తదితర వికీల్లో ఇలాంటి సమస్యనెదుర్కున్నారేమో కొంచెం అధ్యయనం చేస్తా. ఒక 4-5 రోజులు ఆగండి. --వైజాసత్య 23:16, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నా చర్చాపేజీలో ఈ విషయం గురించి నేను రాసిన వ్యాఖ్య
ఉన్నవాళ్ళే చర్చజరుపుతారు. అసలు చర్చనే ప్రారంభించకపోతే మిగిలిన వాళ్లకి ఎలా తెలుస్తుంది. సుందరకాండ గురించి మిగిలిన వాళ్లు చూసినట్టు లేరు. నా ఆంగ్ల వికీ శోధన వళ్ల తెలిసిందేమంటే రామాయణం కధ నెలాగూ రామాయణం వ్యాసంలో చెబుతున్నాము. వికీలో రామాయణం గురించి రాయచ్చు కానీ రామాయణం రాయకూడదు (అది సొంత వాక్యాల్లోనైనా సరే). ఆంగ్లవికీలో కాండలకు కూడా పేజీల్లేవు..కాస్త పట్టువిడుపుగా ఇక్కడ కాండలకు వ్యాసాలు రాసినా అంతకంటే ముందుకు వెళ్ళి ప్రతి ఘటనకూ వ్యాసం మెదలుపెట్టడం అనవసరం. అది విజ్ఞానసర్వస్వ పరిధిని దాటిపోతుంది కూడా. --వైజాసత్య 07:37, 7 జూలై 2007 (UTC)
రెండు అభిప్రాయాలకూ కొంత బలముంది. కాని "స్వేచ్ఛ" అనేది వికీకి మౌలిక విధానం. కనుక మాటలబాబుకు తోచిన విధంలో విడి విడి వ్యాసాలు నిస్సందేహంగా అమలు పరచవచ్చును. కాకుంటే మూసను కాస్త జాగ్రత్తగా తయారుచేయమంటాను. - "సాగర లంఘనం", "లంకా నగరం", "సీతాన్వేషణ", "పుష్పకవిమానం", "త్రిజటా స్వప్నం", "హనుమ సీతా దర్శనం", "హనుమ రాయబారం", "లంకా దహనం" - వంటి క్లుప్తమైన శీర్షికలతో. మాటలబాబు సుందరకాండను ఎత్తుకొన్నవిధం చూడగానే ఇది ఒక వ్యాసంలో పట్టదనుకొన్నాను. (ఒక్కో ఘట్టంలో ఎన్నో నిగూఢమైన యోగ, మంత్ర, వేదాంత రహస్యాలు ఉన్నాయని పెద్దలంటారు. ముందు ముందు ఎవరైనా అవన్నీ వికీలో చేర్చవచ్చునేమో!) --కాసుబాబు 10:43, 9 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మాటలబాబుకు ఏ వ్యాసాలైనా సృష్టించే సేఛ్ఛ ఉంది. ఇక్కడ నాకొచ్చిన సందిగ్ధమేంటంటే ఉదాహరణకి పుష్పక విమానం వ్యాసం తీసుకుంటే పుష్పక విమానం అంటే ఏంటో వివరించి వివిధ పురాణాల్లో తటస్థించిన వివిధ పుష్పక విమానాలు ఎలా ఉండేవో. ఇవి నిజంగానే ప్రస్తుతమున్న అధునిక విమానాలతో పోల్చదగినవా? కావా?. వీటికేమైనా చారిత్రక లేదా మరే ఇతర శాస్త్రీయ ఆధారాలున్నాయా అన్న అంశాలుంటాయనుకుంటాను. (కానీ రామాయణంలో పుష్పకవిమానం ఎక్కిన సంఘటన రాయటం ఇందులోకొస్తుందో లేదో తెలియదు) అదే పద్దతిలో లంకా నగరం వ్యాసం. రామాయణంలో ఇంకా ఇతర ఐతిహాసాల్లో లంకా నగరాన్ని ఎలా వర్ణించారు. లంక నిజంగా ఇప్పటి శ్రీలంకేనా? ఆధారాలు వగైరా వగైరా. కానీ హనుమ సీతా దర్శనం, త్రిజటా స్వప్నం లాంటివి వ్యాసాలుగా మనగలుగుతాయో లేదో. కానీ ప్రయత్నములో తప్పులేదు --వైజాసత్య 11:04, 9 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

'నమొదు', 'నమోదు'

[మార్చు]

'నమొదు', 'నమోదు' ఈ రెండు పదాలలో ఏది సరి అయినది ?

నమోదు సరైనది. __చదువరి (చర్చరచనలు) 02:49, 6 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ప్దిడిఫ్ ఫైలు (వికీ) లింకు

[మార్చు]

నేను pothanapaper.pdf file upload చేసాను. దానికి లింకు ఎలా ఇవ్వాలి. (అర్జున 02:30, 26 సెప్టెంబర్ 2007 (UTC))

ఇదిగో ఇలా బొమ్మ:Pothanapaper.PDF లేదా మీడియా:Pothanapaper.PDF ఇస్తే లింకులు వచ్చేస్తాయి. __మాకినేని ప్రదీపు (+/-మా) 19:13, 26 సెప్టెంబర్ 2007 (UTC)

nenu kadalu vrayalanukontunnau.

[మార్చు]

i am very interested to write stories. is there any possiblity to show my stories in this site? i think i dont know how to write thest stories very well, but somethig what i know thst i wanted to write here. please send me reply to this address as early as possible. EMail address is :: vindula_srinu@rediffmail.com thank you. srinu.

నేను ఈరోజు ఈనాడు వ్యాసాన్ని చూసి తెవికి గురిన్ఛి తెలుసుకున్నాను ఇంకా అకౌంటు ప్రారంభించలేదు. తెవికి నాకుచాలానచ్చింది. మరిన్ని వివరాలు తెలుసుకుని నేనుకూడా ఈ బృహత్తరకార్యంలో చిరుభాగం పంచుకోవాలనిఉంది.ఈనాడు కు నాధన్యవాదాలు. రాఘవరావు.

subjects gurinchi information

[మార్చు]

సబ్జెక్ట్స్ గురించిన సమాచారం మిగిలిన భాషలలొ చాలా లభ్యం అవుతోంది. ముఖ్యంగా ఇంగ్లీష్ లో చాలా అవకశాలున్నై. వీలయినంత సమాచారం పొందుపరిస్తె బావంటుంది.

మీడియా:Example.oggవికిపిడియా ఇంగ్లిష్ లో వున్న సమాచారం మనం తెలుగులొకి మార్చుకోవడానికి వీలవుతుందా?

<

త్యగరాజు కీర్తనలు కొత్తవి చేర్చటం గురించి

[మార్చు]

తెవికి లో త్యాగరాజకీర్తనలు పూర్తిగా లేవు. నేను కొన్ని చేరుద్దామను్కుoటున్నాను. దీనిని గురించి కొంచెం ఎవరయిన సహయం అందించ గలరా.చాలా sites లొసమాచారం pdf files లాగా దొరుకుతోంది. దానినే word file లాగా మరచలని నా పరయతనమ్

త్యాగరాజు కీర్తనలు వంటి పూర్తి పాఠాలను వికీపిడియాలో ఉంచకూడదు. త్యాగరాజు "గురించి" గాని, త్యాగరాజు కీర్తనల "గురించి" కాని వ్యాసాలు వ్రాయవచ్చును. త్యాగరాజు కీర్తనలు వికీసోర్స్‌లో ఉంచవచ్చును. ఇప్పటికే కొన్ని ఉన్నాయి. చూడండి. pdf files ను word file గా మార్చాలంటే సరైన Optical Character Recognition Software కావాలి. నాకు తెలిసి ఇప్పటికి తెలుగులో మంచి OCR software లేదు. మీకు ఏమయినా తెలిస్తే చెప్పండి.
వికీపీడియా అనేది స్వీయ, సృజనాత్మక రచనలు, అభిప్రాయాలు ప్రచురించే స్థలం కాదు. పూర్తి రచనల ప్రచురణా వేదిక కూడా కాదు. వికీపీడియా:ఏది వికీపీడియా కాదు అన్న పేజీని ఒకమారు పరిశీలించండి. ఉదాహరణకు మహాభారతం తీసికొనండి. మహాభారతాన్ని "గురించిన" వ్యాసం వికీపీడియాలో ఉండవచ్చును. మహాభారతం "పూర్తి పాఠం" వికీసోర్స్‌లో ఉండవచ్చును. (ఆంధ్ర మహాభారతం అనే బృహత్తరమైన ప్రాజెక్టు ద్వారా ఈ మహాకార్యాన్ని నిర్వహిస్తున్నారు)

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:31, 25 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

pictures from google earth

[మార్చు]

అందరికి నమస్కారములు,

నేను మా గ్రామము పటము గూగుల్ ఎర్త్ నుంఛి తీసుకోదలిఛాను. ఇది సమ్మతమేనా?

శేషుకుమార్

లేదు గూగూల్ ఎర్త్ ఫోటోలు కాపీహక్కులు కలిగినవి. వాటిని ఇక్కడ ఉపయోగించకూడదు. ఏదైనా పబ్లిక్ డొమైన్లో ఉండే పటమేదైనా ఉంటే చూడండి (ఉదాహరణకి అమెరికా ప్రభుత్వము సృష్టించిన పటాలు, మ్యాపులు సాధారణంగా పబ్లిక్ డొమైన్లో ఉంటాయి) --వైజాసత్య 17:38, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం లో ఫోటోలని వుంచటం (అప్లోడ్) చాల గందరగోళంగా వుంది :-(

[మార్చు]

వ్యాసం లో ఫోటోలని వుంచటం (అప్లోడ్) చాల గందరగోళంగా వుంది. పరికరాల పెట్టె లోని ఫైల్ అప్లోడ్ ద్వార అప్లోడ్ చేస్తే మరల ఇంకో పేజి లోపల వివరాలు వస్తున్నవి కాని ఫోటో కనిపించడం లేదు. పోనీ ఫోటో అప్లోడ్ అయిన పేజి ద్వారా ఎడిటింగ్ పేజీలో ఫోటో ని సెట్ చేద్దమనుకుంటే ఎలాగో అర్థం అవటం లేదు.నా మార్పులు చేర్పుల పేజి లో ("బొమ్మ:Psalbum starter.jpg" యొక్క కొత్త కూర్పును అప్‌లోడు చేసాం.) (top) అనే వివరాలు వున్నాయి.ఈ వివరాల ద్వారా ఫోటో ని ఏలే వుంచుకోవాలి నా ఎడిటింగ్ పేజీలో ??? అలాగె ఇంగ్లీష్ వికీపీడియా లోని ఫోటో లని మన తెలుగు వికి లో వాడుకోవచ్చా ? bojja అనే పేరుతో ఫోటోషాప్ గురించి వ్రాస్తున్న వ్యాసం లో ఒక ఫోటో ని వుంచండి దానిని చూసి నేర్చుకుంటాను. ముందుగానే కృతజ్ఞతలతో..బొజ్జ

ఫోటోషాప్ వ్యాసంలో ఒక బొమ్మ అమర్చాన చూడండి. ఆంగ్ల వికీపీడీయాలోని బొమ్మలు ఇక్కడ వాడుకోవచ్చు కానీ అందులో ఏ లైసెన్సుతో అక్కడ బొమ్మలు వాడుతున్నారో దాన్ని ఇక్కడ కూడా తెలపాలి --వైజాసత్య 15:29, 9 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంగ్లీష్ పేజి ఎడిటింగ్ కి చాల సౌకర్యాలు ఉన్నాయి. తెలుగు ఎడిటింగ్ పేజి కి ఎందుకు లేవు ?

[మార్చు]

ఇంగ్లీష్ పేజి ఎడిటింగ్ కి చాల సౌకర్యాలు ఉన్నాయి. తెలుగు ఎడిటింగ్ పేజి కి ఎందుకు లేవు ? సాంకేతిక నిపుణులు దృష్టి పెడితే మన తెలుగు పేజి ఎడిటింగ్ (మార్పులు చేర్పులు ) ఇంకొంచం సులభము అవుతుంది కదా! వందనములతో ... బొజ్జ

అందులో ఉన్నవి దాదాపు ఇందులోనూ ఉన్నవి కదా (ఒక్క చివరిలో రెఫెరెన్సు ఐకాన్ తప్ప). ఏవి కావాలో తెలియజేయండి ప్రయత్నిస్తాము --వైజాసత్య 15:32, 9 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీని రద్దు చెయ్యాలి?

[మార్చు]

నేను తయారు చేసిన ఒక పేజీని తీసివెయ్యాలి అంటే ఏమి చెయ్యాలో చెప్పగలరు!

రచ్చబండ నా వీక్షన జాబితాలో ఉంది కనుక సమాధానం ఇక్కడే తెలుపండి. తక్కిన వరికి కూడా పనికి వస్తుంది!


తొలగించాలనుకొన్న పేజీలో {{తొలగించు|కారణం}} అని ఒక మూసను పెట్టండి. నిర్వాహకులు ఎవరైనా తరువాత ఆ పేజీని తొలగిస్తారు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:14, 25 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కృతఙ్నతలు కాసుబాబు గారు. --సూరపనేని 22:25, 25 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు అప్లోడ్ చెయ్యాలి అంటే కష్టంగా ఉంది:

[మార్చు]

బొమ్మని, "ఫైలు అప్లోడ్"ఉపయోగించి చేద్దామంటే, అనుమతి లేదు... నిర్వహకులు మాత్రమే చేయగలరు అని వస్తుంది.

నేను లైసెన్సు వివరాలు సంపాదించినా కూడా,ఇప్పుడు, వ్యాసం పూర్తి చేయలేని పరిస్థితి. ఏమి చెయ్యలో సంబధించిన వారు చెప్పగలరు.? --సూరపనేని 00:15, 27 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఫ్రీ బొమ్మలైతే మీరు కామన్స్‌లో బొమ్మలు అప్లోడ్ చేయాలి. అక్కడ ఒక అకౌంట్ సృష్టించుకొని అప్లోడ్ చేయండి. ఫ్రీ కాకపోతే, కొద్ది రోజులు ఆగండి. క్రొత్త అకౌంట్లకు కొన్ని సార్లు అనుమతి ఉండడు. సాయీ(చర్చ) 03:23, 27 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నెను హెమ1937అని, రెజిస్టెర్ ఛెసాను.నిష్క్రమణ అనె ఛొట క్లిక్ ఛెసెసరికి అన్తాగడబిడ అయినది. నిష్క్రమణ బాక్ పెజి లా అనుకొన్నాను. ఇప్పుడు మొత్తమ్ ఛెరిపెసి కొత్తగా ఛెసుకొవాలా?

హేమ గారూ! స్వాగతం. మీరు సభ్యులుగా రిజిస్టర్ అయ్యారు. కనుక మళ్ళీ రిజిస్టర్ చేసుకోవద్దు. తెలుగు వికీ ఓపెన్ చేసి పైన 'అకవుంట్ సృష్టించు లేదా లాగిన్ అవ్వు" ఎన్నుకోండి. లాగన్ పెట్టె వస్తుంది. మీ సభ్యనామం, సంకేతపదం టైపు చేయండి. ఏమయినా ఇబ్బంది ఉంటే మళ్ళీ ఇక్కడే మీ సందేహం అడుగవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:14, 11 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పుస్తకాలు కావాలి

[మార్చు]

నాకు రావూరి భరద్వాజ గారి పుస్తకాల కాపీలు కావాలి.ఏవరి వద్దఎనా వుంటె srigargeya_1@yahoo.co.in 9949497202(sai)కి దయఛెసి తెలుపగలరు. భవదీయుడు పరవస్తు నాగ సాయి సూరి.

లెఖిని.ఆర్గ్ లొ తెలుగు పదాలను ఆంగ్లంలొ టైపు చెసిన తరువాత క్రింది పెట్టెలొ తెలుగులొ మార్పు చెందుతుందికదా? ఆ తెలుగుని ఎదైనా ఫైలులొ బధ్రపరుసుట ఎట్లా? దానిని తిరిగి కాపీ చెసుకొని మరొక సైటు లొ పెస్టు (ఉదాహర్ణకి:సాహిత్యం లొ ) చెసుకొవాలంటె ఏమి చెయాలి? లెఖిని.ఆర్గ్ లొ సెవంగ్ చెసె పద్దతి లెదు కదా మరి?

లేఖిని నుండి కాపీ చేసుకొని వేరే ప్రోగ్రాము (MS Word లాంటిది)లో పేస్టు చేయవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:04, 10 అక్టోబర్ 2008 (UTC)

how to save the typed matter, typed in lekhini.org and use it later?

[మార్చు]

Pabbarajumadhavarao 05:50, 11 అక్టోబర్ 2008 (UTC)I am a member in Sahityam Group. To send my write-ups, in Telugu, to Sahityam group, I am using Lekhini.org, copying the Telugu portion of write-up, minimising the lekhini.org, opening the Sahityam page and then pasting the write-up in the appropriate box. My doubt is : after typing one or two pages, if current goes-off; or I have to leave the compter and go out, how I can save the matter already typed in lekhini.org and use the same whenever I want to use it? Kindly explain.

మాధవరావు గారూ! ఈ సమస్యకు నేరుగా పరిష్కారం లేదనుకొంటాను. ఇలా చేస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుంది. M S Word లాంటిది ఒక ప్రోగ్రాము ఓపెన్ చేసి ఉంచుకోండి. లేఖినిలో వ్రాసింది అప్పుడప్పుడూ (అరగంటకోసారి) కాపీ చేసి, M S Word ఫైలులో పేస్టు చేసి "సేవ్" చేసుకొంటూ ఉండండి. కరంటు పోయినా సేవ్ చేసినంతవరకు భద్రంగా ఉంటుంది. తరువాత M S Word లోంచి అది కావలసినప్పుడు కాపీ చేసుకొని మీకు కావలసిన ఎడిటర్‌లో పేస్టు చేసుకోవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:21, 4 డిసెంబర్ 2008 (UTC)

వికీలో చేరాలని అనుకొంటున్నవారు

[మార్చు]

I am nitin. working as a journalist in jyothy. I really inspired about these wikipedia telugu site.

మరీ ముఖ్యంగా సినిమా పేజీలు చాలా బాగుంటున్నాయి. వీటిని ఎవరు ఎడిట్ చేస్తున్నారు?.వికీ సభ్యులకు అభ్యంతరం లేకపోతే వారి వివరాలు తెలుసుకోగోరుచున్నాను.నేను కూడా ఇందులో భాగస్వామిని కావాలన్నది నా ఆకాంక్ష. If feel free the all restpected members, mail me once at nitin143_v@yahoo.com

నితిన్ గారూ! మీకు తెలుగు వికీపీడియా నచ్చినందుకు చాలా సంతోషం. ఇందులో భాగస్వామి కావాలని అనుకొంటే దానికి తతంగం ఏమీ లేదు. మీరు వెంటనే మార్పులు చేయడం మొదలుపెట్టండి. మీరు ఈ వ్యాఖ్య వ్రాసిన విధంగానే వ్యాసాలు కూడా వ్రాసేయొచ్చు. సభ్యునిగా రిజిస్టర్ అయి, మీకు నచ్చిన వ్యాసాలు క్రొత్తవి వ్రాయండి. పాతవి మెరుగు దిద్దండి. ఇతర సభ్యుల సహకారం ధారాళంగా మీకు లభిస్తుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:21, 4 డిసెంబర్ 2008 (UTC)

వికీపీడియా గురించి తెలుగులో ప్రజంటేషన్

[మార్చు]

వికీపీడియా వాడటం గురించి, పాలసీల గురించి, ఎవరైనా తెలుగులో ప్రజంటేషన్ తయారు చేసివుంటే దయచేసి, ఒక నకలు ఇవ్వండి. నేను త్వరలో జరపబోయే వికీ అకాడమీలో వాడటానికి సహాయపడుతుంది.అర్జున 15:54, 17 ఆగష్టు 2009 (UTC)

అర్జునరావుగారూ! ఈ విషయం ప్రస్తావించినందుకు, వికీ అకాడమీ మొదలుపెడుతున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఇలాంటి ప్రెజెంటేషన్ చేయాలని నేను ఎప్పటినుండో అనుకొంటున్నాను. ప్రస్తుతం ఆఫీసు పనులగురించి బిజీగా ఉన్నాను. రెండు వారాలలో అలాంటిది ఒకటి చేసి మీకు పంపడానికి యత్నిస్తాను. --కాసుబాబు 18:48, 17 ఆగష్టు 2009 (UTC)

వీవెన్ తయారుచేసిన వికీ మరియు తెలుగు వెబ్ జైనుల పరిచయ ప్రజంటేషన్ ఒకటి పంపించారు, త్వరలో మూలపు పైలుని ఇక్కడ పెట్టటానికి ప్రయత్నిస్తాను. పాలసీ, మీడియావికీ సింటాక్స్ , మూసలు, బొమ్మలు లాంటివి గురించి ఎవరైనా చేసి వుంటే తెలుపండి.అర్జున 05:12, 22 ఆగష్టు 2009 (UTC)

జాలంలో వికీపీడియా అకాడమీ

[మార్చు]

వికీపీడియా గురించి సందేహాలున్న వారూ, కొత్త వారి సందేహాలను నివృత్తి చేయాలనుకునే వారూ ఒకే చోట కలవడానికై ఒక ఛాట్ సెషనుని నిర్వహిస్తున్నాను.

  • వేదిక: chat.etelugu.org
  • సమయం: సెప్టెంబర్ 19, 2009 శనివారం ఉదయం 10:00 నుండి 11:00 వరకు

మరిన్ని వివరాలు నా బ్లాగులో. అందరూ పాల్గొంటారని ఆశిస్తున్నాను. —వీవెన్ 04:24, 17 సెప్టెంబర్ 2009 (UTC)

జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్ తమో‌రిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం meaning please rajkin9@yahoo.in,please send telugu meaning please

గూగుల్ అనువాద పరికరము.

[మార్చు]

నేను గూగుల్ అనువాద పరికరాన్ని ఎక్కడ నుంచి పొందగలనో తెలియజేయగలరు. దీని ద్వారా ఆంగ్ల వికీపీడియా నుంచి విషయ సంగ్రహణ అత్యంత సులువుగా ఉంది. దానిని తరువాత తెనిగించవచ్చు.

గూగుల్ ట్రాన్స్లేట్ వెబ్ తో ఆన్లైన్లోనే వాడవచ్చు. --అర్జున 13:24, 31 డిసెంబర్ 2010 (UTC)

కంప్యూటర్ లో డౌన్లోడ్ చేసిన మూవీస్ నూ T.V DVD Player లో ప్లే చేయాలంటే, ఎ విదంగా రీడ్ చేయాలో చెప్పండి. ప్లీజ్

క్షమించాలి. తెవికీ కి సంబంధించిన ప్రశ్నలను మాత్రమే ఇక్కడ అడగాలి. సరియైన సాఫ్ట్వేర్ తో సరియైన ఫార్మాట్తో రాయాలి. కంప్యూటర్ నిపుణులను వ్యక్తిగతంగా సంప్రదించండి.--అర్జున 13:24, 31 డిసెంబర్ 2010 (UTC)

పిల్లల సంరక్షణ చట్టము

[మార్చు]

నాకు పిల్లల సంరక్షణ చట్టము గురించి కావాలి. దయచేసి సమాచారము ఇవ్వగలరు.

బాలల హక్కులు చూడండి. -- అర్జున 06:05, 31 అక్టోబర్ 2011 (UTC)