Jump to content

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఏప్రిల్ 19, 2015 సమావేశం/ప్రధానాంశాలు

వికీపీడియా నుండి

సమావేశపు ప్రధానాంశాలు

[మార్చు]
  • నమస్తే తెలంగాణ, ఈనాడుల్లో ప్రత్యేక సంచికల్లో ఈబుక్స్ గురించి వచ్చింది కానీ వికీసోర్సు ప్రస్తావన లేదు. ఈ విషయాన్ని ఎత్తిచూపుతూ వారికి చెరొక వికీపీడియన్ రెండు పత్రికలకు మెయిల్ చేయాలని పవన్ సంతోష్ అన్నారు.
    • దీని గురించి మరింతగా సభ్యులు ప్రశ్నించగా పవన్ సంతోష్ తన ఆలోచనను విస్తరిస్తూ ఈ వారం వచ్చిన సంచిక గురించి వచ్చేవారం సంచికలోని ఉత్తరాల విభాగంలో ప్రచురితమౌతుందని, దానిలో పడేలా మీ కవర్ స్టోరీ బావుంది కాకుంటే వికీపీడియన్ల కృషి ద్వారా రూపొందుతున్న వికీసోర్సును ప్రస్తావిస్తే వ్యాసానికి సమగ్రత వచ్చివుండేదన్న విషయాన్ని వ్రాసి పంపాలని చెప్పారు. తద్వారా భవిష్యత్తులో ఇటువంటి వ్యాసాలు వ్రాసేప్పుడు వికీపీడియా ఆ పరిధిలో ఉంటే వారు సరిచూసుకునే వీలుంటుందని చెప్పారు. రాజశేఖర్ దీని కాలావధిని గురించి ప్రశ్నించగా పవన్ గురువారం నాటికి వచ్చేవారపు పుస్తకం ఫైనలైజ్ అయిపోతుంది కనుక మంగళవారం రాత్రిలోగానే మనం మెయిల్స్ చేయాల్సివుంటుందని అన్నారు. అలాగే పవన్ రచ్చబండలోని పత్రికా సంబంధాల విభాగం ద్వారా అందుకు అవసరమైన పాఠ్యాన్ని తయారుచేస్తానని తద్వారా ఇద్దరే పంపే మెయిల్ అయినా అందరి సమిష్టి కృషీ తోడవుతుందని సూచించారు. రాజశేఖర్ మాట్లాడుతూ ఈ ఆలోచన పవన్ ది కనుక ఆయన లీడ్ తీసుకుని ప్రారంభించాలని దాన్ని మిగిలినవారు అవసరమైతే దిద్దుబాట్లు చేస్తారని తెలిపారు.
  • ఆచార్య అండమ్మ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్.డి స్థాయిలో పరిశోధనలను జాబితా చేస్తూ ఆనందరావు అనే ఆచార్యులు ఓ పుస్తకం రూపొందించారని దానిని ఎలా వినియోగించుకోవచ్చో చూడాలని అన్నారు.
    • రాజశేఖర్ మాట్లాడుతూ ఆ పుస్తకాన్ని వికీసోర్సులో చేర్చేందుకు గాను స్వేచ్ఛాహక్కుల్లో పుస్తకం కాపీహక్కులు విడుదల చేయించాల్సివుంటుందన్నారు. పవన్ సంతోష్ పుస్తకాన్ని పరిశీలించి పరిశోధకులకు, విజ్ఞానసర్వస్వ నిర్మాణానికి చాలా ప్రయోజనకారి అనీ, వారు ప్రతిపాదించినట్లుగా విశ్వవిద్యాలయాల పరిశోధనలు పెద్దఎత్తున వికీసోర్సులోకి రావాలంటే ముందుగా ఇటువంటి కాటలాగు చేరితే తద్వారా ఒక ప్రణాళిక రూపొందించుకోవచ్చని సూచించారు.
  • ఆచార్య అండమ్మ విశ్వవిద్యాలయపు పరిశోధనాంశాలు వికీసోర్సులో చేర్చాలి - కాపీ హక్కులతో సమస్య ఉండవచ్చు అన్న విషయాన్ని ప్రస్తావించారు.
    • రహ్మానుద్దీన్ శోధ్ గ్రంథ రీసెర్చి పేపర్లలో రచయితకు, విశ్వవిద్యాలయానికీ కలిపి హక్కులుంటాయనుకోరాదు. ఎందుకంటే కొన్నిటికి రచయితకే ఉంటుంది. కొన్నిటికి విశ్వవిద్యాలయాలు స్పాన్సర్లు అయినప్పుడు విశ్వవిద్యాలయాలకు కూడా వుంటుంది. ఎవరికైనా ఆసక్తి ఉన్నప్పుడు వారి స్వంత బ్లాగు తయారుచేసి, స్వేచ్ఛా నకలు హక్కులలో ప్రచురించవచ్చు. అన్నారు.
  • ఆచార్య అండమ్మ తనవద్ద కొన్ని వ్రాతప్రతులు ఉన్నాయని వికీకి వినియోగించాలంటే మార్గమేమిటని ప్రశ్నించారు. అలానే తన వ్యక్తిగత పరిశోధన వేరే ఫాంట్ లో ఉందని దానిని యూనీకోడీకరించి వికీసోర్సుకు ఇవ్వడం ఎలాగని ప్రశ్నించారు.
    • ఆమె దాన్ని స్కానింగ్ చేసి స్కాన్డ్ ప్రతులను బ్లాగులో స్వేచ్ఛా నకలు హక్కుల్లో ప్రచురిస్తున్నట్టు స్టేట్ మెంట్ ఉంచి ప్రచురిస్తే, వాటిని నేరుగా కామన్స్లో తాము అప్లోడ్ చేయవచ్చని రాజశేఖర్ సూచించారు. అయితే స్కానింగ్ చేయడానికి విధానాలేమిటని ఆయన అడగగా రహ్మానుద్దీన్ వ్రాతప్రతుల స్కానింగ్ కోసం ప్రత్యేక జాగ్రత్తలుంటాయని, మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీకి వెళ్ళి అక్కడే నిపుణులతో స్కానింగ్ చేయించాలని సూచించారు. లేదంటే కనీసం హై రిజల్యూషన్ స్కానర్లు, కెమెరాల ద్వారానైనా పనిచేయాల్సివుంటుందని చెప్పారు. కార్యక్రమానంతరం పవన్ సంతోష్ ఆచార్య అండమ్మ కోరిక మేరకు ఆమెకు సహకరించి ఓ బ్లాగు రూపొందించారు. ఆమె స్వేచ్ఛానకలు హక్కుల్లో బ్లాగులోని సమాచారం చేరుస్తున్నట్టుగా స్టేట్ మెంట్ చేరుస్తూ బ్లాగును తయారుచేశారు. త్వరలోనే అనుకున్న విధంగా బ్లాగును రూపొందిస్తానని, తన స్వంత ప్రామాణిక వ్యాసాలు కూడా చేరుస్తానని ఆమె పేర్కొన్నారు. యూనీకోడీకరణ విషయంలో రెహ్మానుద్దీన్ తనకు తెలసిిన ఓ వెబ్ పేజీలోని టూల్ పరిచయం చేశారు. తర్వాత దాని వినియోగంపై ఆచార్య అండమ్మ కొన్ని సందేహాలు వ్యక్తం చేయగా వికీపీడియన్లు రహ్మానుద్దీన్ను సంప్రదించాల్సినదిగా పేర్కొన్నారు.
  • పురాణాలు, కైఫియత్లు వికీసోర్సులో చేర్చాలి అని అండమ్మగారు అన్నారు.
    • క్రమంగా అన్నీ జరుగుతాయని వికీపీడియన్లు బదులిచ్చారు.
  • రాజశేఖర్ తెలుగు భాగవతం వికీసోర్స్ లో చేర్చిన సాంబశివరావుగారు ప్రతి పద్యానికి టీకా మరియు తాత్పర్యం వికీపీడియాకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాకుంటే ఆడియో ఫైల్స్ ఇవ్వరు. దీనిని ఎక్కడ (వికీసోర్స్ లేదా వికీబుక్స్) చేర్చాలి, సాంకేతికంగా ఎవరైనా సహాయం చేయగలరా అన్న విషయంపై చర్చించారు.
    • టీకా తాత్పర్యాలు ఇప్పటికే ఆన్లైన్లో పబ్లిష్ అయివున్నందున ఆ వెబ్సైట్లో వారు ముందుగా అనుకున్నట్టే టీకాతాత్పర్యాలు సీసీ బై ఎస్‌ఎ 4.0 వంటి లైసెన్సులో విడుదల చేస్తున్నట్టు, ఆడియో ఫైల్స్ మాత్రం కాపీహక్కుల పరిధిలో ఉంటాయని ఓ స్టేట్ మెంట్ పబ్లిష్ చేస్తే చాలని రహ్మానుద్దీన్ సూచించారు. వికీసోర్సే తగిన ప్రదేశమని ఆయన పేర్కొన్నారు.
  • గ్రామాల వ్యాసాల్లో కొత్తవాడుకరులు లోకల్ ఈనాడు, సాక్షి వంటి పేపర్లను (1) అని అంకె వేసి మూలాలు అన్న విభాగంలో మళ్లీ 1. వేసి దాని పక్కన రాస్తున్నారు. వీటిని ప్రామాణిక మూలాలు చేయాలంటే ఏంచేయాలి అని పవన్ సంతోష్ చర్చకుతెచ్చారు.
    • వైజాసత్య మాట్లాడుతూ వాటిని బాటు ద్వారా ప్రామాణిక మూలాలుగా చేయడం పెద్ద విషయం కాదన్నారు. కాకుంటే తాను ఇటువంటి వాటిలో నమ్మదగినదిగా కనిపించని ఓ మూలాన్ని గుర్తించానని, కనుక ముందు వీటిని నిర్ధారించుకోవాలన్నారు. వందలాది వ్యాసాల్లోని ఈ మూలాలు ఎలా నిర్ధారించగలమని ప్రశ్నించారు. అలానే రాజశేఖర్ మాట్లాడుతూ ఈనాడు వంటివి ఆన్లైన్లో తేలికగా లభించవని, యూనీకోడ్లో లేనివనీ గుర్తుచేశారు. వైజాసత్య ప్రశ్నలకు సమాధానమిస్తూ పెద్దస్థాయిలోని దేన్నైనా తనిఖీ చేసేందుకు ఉపయోగించే శాస్త్రీయ విధానమైన శాంప్లింగ్ గుర్తుచేశారు. ఆ విధంగానే రాండమ్ గా కొందరు వాడుకరులు కొన్ని వ్యాసాల్లోని మూలాలు చూస్తారని, వాటిని స్థానిక లైబ్రరీల్లోనో, వీలుంటే ఆన్లైన్లోనో లభ్యమయ్యే పత్రికల ప్రతులలో చూసి సరిగా ఉన్నాయో లేదో నిర్ధారిస్తారన్నారు. ఆ శాంపిల్ ఎంత శాతం విజయవంతం అయినదన్న దాన్ని ఆధారం చేసుకుని వీటన్నిటినీ బాట్ ద్వారా ప్రామాణికీకరించాలో వద్దో నిర్ణయించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
  • కొత్త వాడుకరులు వ్రాసిన వ్యాసాలలో సమాచారం తక్కువగా ఉందన్న కారణంగా వెనువెంటనే డిలీషన్ మూసలు పెట్టడం వల్ల వారు వెనుదిరిగుతున్నారు.
    • పవన్ సంతోష్: ఈ సమస్యను నివారించేందుకు మూస:అభినందన రూపొందించుకుని, దానిలో మీరు కొత్త వ్యాసాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు అభినందనలు. ఫలానా వ్యాసంలో మీరు అతితక్కువ సమాచారం చేర్చారు. ఈ వ్యాసాన్ని వీలున్నంతగా అభివృద్ధి చేసి దాన్ని మంచి స్థితికి తీసుకురావాలని కోరుతున్నాము. మీరు కనీసం ఓ పదిలైన్లకు అభివృద్ధి చేయగలిగితే బావుంటుంది, లేదంటే డిలీషన్ మూసను తగిలించి వ్యాసం డిలీషన్ గురించి చర్చించాల్సివస్తుంది. భవిష్యత్తులో మీరు వికీపీడియా అభివృద్ధి చక్కని కృషిచేస్తారని భావిస్తున్నాము. లాంటి లైన్లు చేర్చి కొత్త వ్యాసం వ్రాసిన, కొత్తవాడుకరి చర్చపేజీలో తగిలించి వారం తర్వాత వ్యాసానికి డిలీషన్ మూస తగిలించినా ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. భాస్కర నాయుడు పై విధమైన ఎప్రోచ్ కొత్తగా వ్యాసం ప్రారంభించిన కొత్తవాడుకరులకు మాత్రమే పాటిస్తే చాలు. అనుభవజ్ఞులైన వాడుకరులకు అటువంటిదేమీ అవసరం ఉండదు అన్నారు. వైజాసత్య, రాజశేఖర్లు అదేకాక ఇప్పటికే వ్యాసం అభివృద్ధి చెందుతోంది అన్న విషయాన్ని తెలిపేందుకు సరిపోలే మూసలున్నాయి. అనుభవజ్ఞులు వ్యాసం మొదట్లో వాటిని చేర్చి అభివృద్ధి చేస్తే సరిపోతుంది. అలానే మనవాళ్లెవరైనా కొత్తవాడుకరులకు శిక్షణనిచ్చి శిక్షణశిబిరాల ద్వారా తయారుచేస్తున్నట్టయితే వారికి కూడా ఆ మూస వాడడం తెలిపితే బావుంటుంది అని అభిప్రాయపడ్డారు. వైజాసత్య మాట్లాడుతూ నిజానికి గాంధీ గారి గురించి తెవికీలో వ్యాసం లేదనుకోండి ఎవరైనా ఓ రెండు లైన్లతో వ్యాసాన్ని ప్రారంభిస్తే డిలీషన్ మూసలు తగిలించడం సరికాదు, వికీలో వ్యాసం ఉంచాలా తొలిగించాలా అన్నదానికి కేవలం వ్యాసంలో తక్కువ సమాచారం ఉండడమే ప్రాతిపదిక కాదు, ఆ వ్యాసానికి ప్రాముఖ్యత, ప్రాధాన్యత వంటివి ఉండాలి. అందువల్ల ఆటోమేటెడ్ డిలీషన్లు చేసే వాడుకరులు మన తెలుగు వికీ లాంటి చిన్న వికీపీడియాలో అటువంటివి వినియోగించడం అంత సరైనది కాదని గుర్తించాలి అన్నారు.
  • కొత్తవాడుకరులు వికీశైలికి వ్యతిరేకంగా వ్రాస్తున్నారని వారిని వారిస్తే మొత్తంగా వికీకి దూరమైపోతారు కనుక మనం వారి శైలిని కొత్తవారిని భయపెట్టరాదు అన్న సూచనకు కట్టుబడే ఎలా మార్పించాలి అన్న విషయాన్ని భాస్కరనాయుడు చర్చకు తెచ్చారు.
    • పవన్ సంతోష్ తన అనుభవాన్ని వివరిస్తూ గతంలో ఒక వాడుకరి అనవసరమైన సమాచారాన్ని ఓ గ్రామవ్యాసంలో చేరుస్తుండగా చూశానని, ఆ సమాచారం తొలగించి వారు చేర్చిన సమాచారంలో వికీశైలికి పనికివచ్చే గ్రామంలోని ఆలయం గురించిన వివరాలు చూశానని ప్రారంభించారు. అప్పుడు ఆయన చర్చపేజీలోకి వెళ్లి మీరు వికీపీడియాలో రచనలు చేయడం చాలా సంతోషకరం. కాకుంటే మీరు చేరుస్తున్న వ్యక్తిగత సమాచారం వికీశైలికి, వికీలో ఉండాల్సిన ప్రాధాన్యతకు సరిపోదు. కనుక మీరు చెప్పిన గ్రామంలోని ప్రాచీనాలయం ఫోటోలు తీసి కామన్స్(లింక్ ఇచ్చి)లో అప్లోడ్ చేసి, దాన్ని తెచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే బావుంటుందని సూచించినట్టు వివరించారు. అది సత్ఫలితాలనిచ్చిందో లేదో చూడలేదని కాకుంటే దుష్ఫలితాలు మాత్రం ఇవ్వదని భావిస్తున్నానని, అలానే వీలున్నంత వరకూ పర్సనలైజ్డ్ మెసేజి(మూసవంటివి కాకుండా) ద్వారా మనం వారిని సక్రమమైన మార్గంలోకి తీసుకురావచ్చని నమ్ముతున్నట్టు చెప్పారు.
  • పవన్ సంతోష్ తన ప్రతిపాదనలో తెవికీలో నాణ్యత పెరగాలంటే నాణ్యత పెంచడం గర్వకారణమైన పనిగా, ఇతరులకు చెప్పుకోదగ్గ విలువ ఆపాదించాలని సూచించారు. అందుకు తాననుకున్న మార్గం చెప్తూ ఆంగ్ల వికీపీడియాలో చాలా మంచి ప్రమాణాలున్న వ్యాసాలను గుర్తిస్తూ గుడ్ ఆర్టికల్, ఫీచర్డ్ ఆర్టికల్ వంటివి ఉన్నాయని, తెలుగులోనూ మంచి వ్యాసం, విశేష వ్యాసం అన్నవి ఉన్నా తేడాలున్నాయన్నారు. ఆంగ్లంలో ఒక్కో వ్యాసాన్ని గుడ్ ఆర్టికల్ స్థాయికి అభివృద్ధి చేయాలంటే చాలా కృషిచేసి అపురూపమైన వ్యాసాలు తయారుచేయాల్సివుంటుందన్నారు. గుడ్ ఆర్టికల్ కొరకు ప్రతిపాదించిన వ్యాసాలను పీర్ రివ్యూ విధానం ద్వారా తోటి వికీపీడియన్ వాటి నాణ్యత అంచనా కట్టి, ఏమైనా చేర్పులు చేయాల్సివుంటే సూచనలు చేస్తారని ఈ ప్రాసెస్ ద్వారా మంచి వ్యాసాలను గుర్తిస్తున్నారన్నారు. వైజా సత్య గారు అభిప్రాయపడ్డట్టు పవన్ జంధ్యాల స్థాయిలో ఇక్కడి వికీపీడియన్లు వ్యాసాలు రాయాలంటే కొలమానం పెద్దది చేయాలని, ఆయనకూ స్ఫూర్తినిచ్చినవి ఆంగ్లవికీ విధానాలేనని పేర్కొన్నారు.
    • వైజాసత్య మాట్లాడుతూ తాను కూడా మొదట్లో ఆంగ్లవికీలో పనిచేశానని, శుద్ధి దళంలో పనిచేయడం, క్లీనింగ్ డెస్క్ లో వ్యాసాలు పెట్టడం, త్వరితంగా వాటిని శుద్ధి చేసి డెస్క్ ఖాళీ చేసుకోవడం లాంటి ఉత్సాహకరమైన విషయాలుండేవని గుర్తుచేశారు. పవన్ చెప్పిన సూచన చాలా బావుందని దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే మనం ఆంగ్లవికీలోని ఆ విధానాలు అనువదించుకుని, తెవికీకి తగ్గట్టు మార్పులు చేసుకుని వాటిని అమల్లోపెట్టాలని సూచించారు.
    • రాజశేఖర్ మాట్లాడుతూ పవన్ సంతోష్, పవన్ జంధ్యాల, స్వరలాసిక, వైజాసత్య, సుజాత గారి వంటి కొందరు వికీపీడియన్లకు ఆ స్థాయి వ్యాసాలు వ్రాసే సామర్థ్యం, అలవాటూ ఉన్నాయని కనుక దీన్ని ఓ సత్సాంప్రదాయంగా మలచాలని పేర్కొన్నారు.
    • నేను ఇన్ని మార్పులు చేశానని చెప్తున్నట్టుగా, నేను ఇన్ని వ్యాసాలు ప్రారంభించానని అంటున్నట్టుగా నేనిన్ని మంచి వ్యాసాలు తయారుచేశాను, నేను ఇన్ని విశేష వ్యాసాలను తయారుచేశాను అనగలగడం, అందుకు మనం ఓ వేదిక సృష్టించగలగడం ద్వారానే తెవికీలో ఆ దిశగా ప్రగతి జరుగుతుందని పవన్ సంతోష్ అభిప్రాయపడ్డారు.
  • భాస్కరనాయుడు మాట్లాడుతూ హైదరాబాదులో నిర్వహిస్తున్నంత మాత్రాన ఈ సమావేశాలు కేవలం హైదరాబాదులోని వికీపీడియన్లకు పరిమితం కాదని, ప్రత్యక్షంగా పాల్గొనలేనప్పుడు పవన్ సంతోష్, రహ్మానుద్దీన్, విష్ణు, సుజాత గతంలోనూ ఇప్పుడూ స్కైప్ ద్వారా హాజరుకాగలగడం, ఇప్పుడు వైజాసత్య విదేశాల నుంచి కూడా సమావేశంలో హాజరుకావడం దానికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మరింతమందిని కలుపుకోవాల్సిన అవసరం తెలుపుతూ, దీనిపై కొన్ని దురభిప్రాయాలు తొలగిపోవాలంటే ఏం చేయాలని సూచనలకు ఆహ్వానించారు.
    • వైజాసత్య మాట్లాడుతూ అందరినీ ఆహ్వానిస్తూ మీరే చర్చాపేజీల్లో ఇకపై చేరుస్తూండండి ప్రయోజనం కలగవచ్చునన్నారు. పవన్ సంతోష్ మాట్లాడుతూ కార్యక్రమ ముఖ్యాంశాలు మరింత విపులంగా వ్రాస్తూ, ఆఫ్-వికీ కార్యక్రమ చర్చలను ఆన్-వికీలోని చర్చలతో కలపడం వల్ల మరింత జనప్రియమౌతుందని సూచించారు.
  • తెవికీపీడియన్లు తెవికీలోని వ్యాసాల నాణ్యత పెంచేందుకు బొమ్మలు కావాలన్న విషయంపై దృష్టిసారించారని, అందుకే బొమ్మలు కావాలన్న మూస చేరుస్తున్నారని ప్రారంభించిన పవన్ సంతోష్ ఇప్పటికే విష్ణు తమ ప్రణాళిక చర్చలో గ్లోబల్ మెట్రిక్స్ గురించి ప్రస్తావించడం, వాటిలో కామన్స్ ఫోటోలు కూడా ఒకటి కావడం గుర్తుచేశారు. ఆ క్రమంలో తెలుగు సముదాయానికి అవసరమైన ఈ బొమ్మలు కావాలన్న అంశానికి అనుగుణంగా వారి ప్రణాళికలో ఏదోకటి చేర్చుకుని తద్వారా తెలుగు వికీ నాణ్యత అభివృద్ధి చేయాలని సీఐఎస్-ఎ2కె ప్రణాళిక చర్చలో ప్రస్తావిద్దామని ఆయన అన్నారు.
    • దీనిపై స్పందిస్తూ వైజాసత్య బొమ్మ అభ్యర్థన మూస ద్వారా ఇప్పటికి వర్గీకరించామని, కొన్ని రోజుల్లోనే బాట్ ద్వారా ఈ సంఖ్య మరింత పెరుగుతందని (దాదాపు 30వేలు ఉండొచ్చన్నారు) అన్నారు. ఈ అవసరాన్ని వారి ప్రణాళికలో చేర్చుకోవడం చాలా మంచి ఆలోచన అని అభినందించారు. తద్వారా వేలాది వ్యాసాలు నాణ్యతాపరంగా అభివృద్ధి చెందుతాయన్నారు. కాకుంటే గ్లోబల్ మెట్రిక్స్ తీసుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాకా వేసుకోవాల్సిన అంచనా అని, దాన్ని ఆధారంగా చేసుకుని లక్ష్యాలు స్వీకరించాల్సిన అవసరం లేదేమోనన్నారు. ఏధేమైనా తెవికీలో ఈ ప్రణాళిక పనుల ద్వారా వేలాది వ్యాసాలు బొమ్మల వల్ల లాభిస్తే అంతకన్నా కావాల్సినది లేదని వ్యాఖ్యానించారు. ఇక సీఐఎస్ పనితీరు గురించి వ్యాఖ్యానిస్తూ సీఐఎస్-ఎ2కె వారు కమ్యూనిటీతో వ్యవహరించడం, కొత్తవాడుకరులను తీసుకురావడం, సంస్థాగతంగా మాట్లాడడం వంటి విషయాల్లో చాలా నిపుణత కనబరిచారని, కాకుంటే వికీ ప్రాజెక్టుల్లోని సమాచారం చేర్పు, వాటి పనితీరు, వికీలోని పాలసీలు, విధానాలు ఇటువంటి విషయాల్లో వారికి ఆ స్థాయి అవగాహన లేదనిపిస్తుందన్నారు. అయితే వారికి ఆ విషయాల్లో అవగాహన ఉన్న సభ్యులు, సముదాయంలోని చర్చల ద్వారా సహకరించి ప్రణాళికలు మెరుగుపరిచేలా చేస్తే చాలా మంచి ఫలితాలు పొందవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై అప్పటికి చర్చలో ఉన్న రాజశేఖర్, భాస్కరనాయుడు వంటివారు కూడా సానుకూలంగా స్పందించారు.
  • వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఏప్రిల్ 19, 2015 సమావేశం#చర్చించాల్సిన అంశాలులో భాస్కరనాయుడు ప్రస్తావించిన వ్యాసాల సంఖ్యలక్ష్యం గురించి పవన్ సంతోష్ ప్రస్తావించారు.
    • భాస్కరనాయుడు మాట్లాడుతూ దాన్ని అందుకోవడం కుదరకపోవచ్చని, అయినా వ్యాసాల సంఖ్యను లక్ష్యంగా పెట్టుకోవడం సరికాదన్నది ఇప్పటికే వైజాసత్య గారితో ఆన్-వికీ చర్చల్లో తేలిపోయిందని, ఇక దాన్ని చర్చించాల్సిన అవసరం లేదని అన్నారు.