Jump to content

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఏప్రిల్ 19, 2015 సమావేశం

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

వివరాలు

[మార్చు]
గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

ఈనెల అతిథి

[మార్చు]

చర్చించాల్సిన అంశాలు

[మార్చు]

ఈ సమావేశాలలో చర్చించ దగినవని నేను అనుకుంటుంన్న కొన్ని ప్రతిపాదించిన అంశాలు: 1. మన అన్ని ప్రాజెక్టులలో ఇప్పుడు వ్రాస్తున్న వాడుకరులు (అన్నింటిలో అనగా తెవికి/విక్షనరి/వికీసోర్సు ... వీటిలో మన వికీపీడియా పద్దతి ప్రకారమే వ్రాస్తున్నారా? లేదా తమ గణాంకాల సంఖ్యలను పెంచుకోవడాకి ప్రయత్నిస్తున్నారా? ......లేదా .... ఏదో వ్రాస్తున్నాము.....ఏదో ఒకటి వ్రాయాలి అనే ధోరణిలో వ్రాస్తున్నారా? అనే విషయము గమనించి ........ అనుభవము, విషయ పరిజ్ఞానము వున్న ఇలాంటివారిని సక్రమమైన పద్దతిలో పెట్టగలిగితే నాణ్యమైన వ్యాసాలు చేరే అవకాశమున్నది. ఎలా పెట్టాలి?

2. ఉత్సాహ వంతులు ఏదైనా ఒక వ్యాసాన్ని వ్రాయడానికి ప్రయత్నిస్తే..... ఆ వ్యాసాం పూర్తి కాకుండానే..... ప్రారంభంలోనే......... దీనికి మూలాలు లేవు.... ఇది తొలిగించబడుతుంది... అని భయపెట్టడం జరుగుతున్నది. (స్వీయానుభవము) దీనితో పాత వాడుకరులు ఇలాంటి హెచ్చరికలతో కొంత అవగాహన కలిగి వ్యైరేకంగా స్పందించక పోయినా..... కొత్త వాడుకరులు మాత్రము శాస్వతముగా వికిపీడియాకు దూరమయ్యే అవకాశమున్నది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించ వలసి వున్నది.

3. తెవికి అన్ని విభాగలలోను కొత్త వాడుకరులు చాలమందే స్వచ్చందంగా వస్తున్నారు. అలాంటి వారిలో ఎంతమంది కనీసము ఒక్క మార్పు/చేర్పు చేసి తెవికీ లో నిలబడుతున్నారు? అని విమర్శించుకుంటే...... ఫలితము శూన్యం. ఎందుకు అలా జరుగుతున్నది?. అలాంటివారిని తెవికీలో స్థిరంగా నిలబడేటట్లు చేయ లేమా.....??? ఎలా? .. ఇలాంటివి కొన్ని విషయాలు చర్చించ వలసి వున్నది.

4. కొంత మంది క్రొత్త వాడుకరులు తెవికి గురించి అవగాన రాహిత్యంతో ఇక్కడ ఎవరైనా...... ఏదైనా వ్రాయవచ్చు..... అనే తెవికి మూల సూత్రాన్ని అనుసరించి ఏదో తమకు తోచింది ఉత్సాహంతో వ్రాస్తుంటారు. అలాంటివి నిజంగా చెత్త వ్రాతలే...... వాటిని తప్పకుండా తొలగించ వలసినదే...... ఇందులో సందేహం లేదు. కాని వాటిని తొలగిస్తూ .......... వాటిని ఎందుకు తొలగించ వలసివచ్చింతో..... ఎలా వ్రాస్తే వాటిని తొలగించరో...... అనే అవగాహన వారికి కలిగిస్తే...... అలాంటి ఉత్సాహవంతులు విషయాన్ని కొంత వరకైనా అర్థం చేసుకొని,. కొంతకాలమైనా వికీపీడియాలో నిలదొక్కుకునే అవకాశమున్నది. స్వీయానుభవముతో.... అలాంటివారు తెవికీలో అత్యంత చురుకైన వాడుకరులుగా మారే అవకాశమున్నది. ఆవిధంగా వారిని ప్రోత్సహించలేమా????.

5.స్థానికంగా హైదరాబాద్ లో వున్న వారికొరకే ఈ నెల వారి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అందరి వాడుకరులకు మనస్సులో ఒక నిర్దుష్టమైన స్థిర నిర్ణయము ఏర్పడినట్లు తోస్తున్నది. (ఇది నా అభిప్రాయము) నిజానికి ఇటువంటి సమావేశము ప్రపంచ వ్యాప్తంగా వున్న అందరి తెవికి వాడుకరుల అవగాహన కొరకే అన్న అభిప్రాయము హైదరాబాదు స్థానికేతరులకు వున్నట్లు కనిపించడం లేదు. ఎందుకనగా...???? హైదరాబాదులో నిర్వహించ బడుతున్న ఈ నెల వారి సమావేశాలు మన తెవికి సముదాయమందరికీ సంబంధించినదనీ., స్థానికేతరులు /ఈ సమావేశాలలో పాల్గొనే అవకాశము లేని వారు ఇక్కడ తమ అభిప్రాయాలను, సూచనలనూ చెప్పగలిగిన అవకాశమున్ననూ దానిని అంది పుచ్చుకున్న వారు ఇంతవరకూ నాకగుపడలేదు. ఇలాంటి సమావేశాలు జరుపుతున్నది మన తెవికి సముదాయములోని అందరికొరకు అనే అవగాహన స్థానికేతరులందరికి కలుగజేయవలసిన అవసరమున్నది. ఇక్కడ వారి చూచనలు, సలహాలు ఇవ్వగలిగే అవకాశము వారికి ఎప్పటికీ వున్నది. ఈ విషయము అందరికి తెలియ వలసిన అవసరమున్నది. ఆ విధంగా వారి సూచనలు, సలహాలు (స్థానికేతరులు) మనము స్వీకరించ వలసి వున్నది. అదే విధంగా వారి అభిప్రాయలను పరిగణలోనికి తీసుకోవలసి వున్నది. నిజానికి స్థానికేతరులు తమ అభిప్రాయాలను, సూచనలను, ఈ నెల వారీ సమావేశాలలో తెలియ జేసినది ఎన్నడు జరగనేలేదు. (ఇది నా స్వంత అభిప్రాయము. ఈ విషయంలో బేధాభిప్రాయాలుంటే ఈ అంశాన్ని చర్చనీయాంశాల జాబితాలోనుండి తొలిగించ వచ్చు)

6. మనం నిర్ణయించుకున్న నిర్ధుష్టమైన గమ్యం (తెవికిలో వ్యాసాల సంఖ్యా పరంగా జూలై 2016 నాటికి) చేరుకోగలమా???? దానికొరకు మనందరము చేయవలసిన కృషి ఎలావుండాలి? అనే విషయము అతి ప్రాముఖ్యమైనది. దీని గురించి చర్చించాలి. (నా అభిప్రాయము ప్రకారము ..... ప్రస్తుతము మనము పయనిస్తున్న వేగము ఆధారముగా పరిగణిస్తే...... ఆ గమ్యము అసాద్యము అని పిస్తున్నది) దీనిని సుసాధ్యము చేయాలంటే ఏమి చేయాలి????

అవకాశముంటే పైవాటిని చర్చనీయాంచాల జాబితాలో చేర్చండి....... చర్చ చేద్దాము.(చర్చ) 16:30, 14 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

  • తెలుగు భాగవతం వికీసోర్స్ లో చేర్చిన సాంబశివరావుగారు ప్రతి పద్యానికి టీకా మరియు తాత్పర్యం వికీపీడియాకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దీనిని ఎక్కడ (వికీసోర్స్ లేదా వికీబుక్స్) చేర్చాలి, సాంకేతికంగా ఎవరైనా సహాయం చేయగలరా అని చర్చిద్దాము.--Rajasekhar1961 (చర్చ) 07:54, 16 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు.

సమావేశం నిర్వాహకులు

[మార్చు]

సమావేశానికి ముందస్తు నమోదు

[మార్చు]

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


బహుశా పాల్గొనేవారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


పాల్గొనటానికి కుదరనివారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


స్పందనలు
  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక

[మార్చు]
ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
  1. రాజశేఖర్
  2. భాస్కరనాయుడు
  3. గుళ్ళపల్లి నాగేశ్వర రావు
  4. మాదిరెడ్డి అండమ్మ (ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్)
  5. పవన్ సంతోష్
  6. ప్రణయ్‌రాజ్ వంగరి
Skype ద్వారా హాజరయినవారు
  1. వైజాసత్య
  2. రహ్మానుద్దీన్

చిత్రమాలిక

[మార్చు]