వికీపీడియా:2010 సమీక్ష
స్వరూపం
- తెవికీ తెరవెనుక సంగతులను, వికీపీడియన్లను అందరికి పరిచయంచేసి, తెవికీ సముదాయ చైతన్యాన్ని పెంచే ఆశయాలతో తెవికీ వార్త జులై 1, 2010న ప్రారంభమైంది.
- గూగుల్ వేతన వికీపీడియన్లకృషి వలన 665 పైగా వ్యాసాలు చేరి సగటు వ్యాస పరిమాణాన్ని పెంచాయి. అయితే ఔత్సాహికులు కృషి తగ్గిపోవటంతో వికీ అభివృద్ధి తగినంతగాలేదు.
- నెలలో రోజుకు 4 నుండి 22 వ్యాసాలు సృష్టించబడుతున్నాయి.
- నెలకు 5 దిద్దుబాట్లు చేసేవారి సంఖ్య 27 నుండి 42 మధ్య వుంది.
- నెలకు 100 దిద్దుబాట్లు చేసేవారి సంఖ్య 2 నుండి 10 మధ్య వుంది.
- నెలకు కొత్త గా వికీపీడియన్లుగా చేరే వారి సంఖ్య 3 నుండి 10 మధ్య వుంది.
- పేజీ వీక్షణలు పిభ్రవరి 2010 లో అత్యధిక స్థాయియైన 4.5 మిలియన్లుకు చేరి ఆ తర్వాత చాలా తగ్గి డిసెంబరు చివరికి 2.1 మిలియన్లకి చేరుకున్నాయి.
- డిసెంబరు 2010 పేజి వీక్షణలు డిసెంబరు 2009 తో పోల్చితే, -48 % పెరుగుదల. అన్ని వికిపీడియాల పెరుగుదల తోపోల్చితే తెవికీ 23వ స్థానంలో వుంది.
- 2010లో అత్యధిక వ్యాస మార్పులు చేసినవారిలో మొదటి 10 ర్యాంకులుగల వికీపీడియన్లు రాజశేఖర్, రవిచంద్ర, టి.సుజాత, అర్జున, చంద్రకాంతరావు, రహ్మాతుల్లా, వైజాసత్య, ముక్తేశ్వరి, కాసుబాబు మరియు వీర. వీరిలో అత్యధికంగా 4776 అత్యల్పంగా 309 మార్పులు చేసినట్లు నమౌదైంది.