Jump to content

వికీపీడియా చర్చ:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మల్లాది కామేశ్వరరావు గారూ! వ్యాసం ప్రారంభించి ఉపశీర్షికలు చేర్చాను. మీరు పరిశీలించి ఏమి శీర్షికలు ఉంటే బాగుంటుందో ఆలోచించి ఉపశీర్షికలుగా వ్రాయండి. తరువాత ఉపశీర్షికలలో విషయం వ్రాయవచ్చు వ్రాయవచ్చు.--59.92.90.196 18:21, 27 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నా విజ్ఞాపనకు స్పందించినందులకు ముందుగా నా ధన్యవాదాలు...!

ప్రారంభంలో

[మార్చు]
  • వికీపీడియా ఎప్పుడు, ఎక్కడ, ఎంతమందితో ప్రారంభమయ్యింది? ప్రారంభ లక్ష్యం ఏమిటి....
  • వికీపీడియా సారధి...
  • విజ్ఞాన సర్వస్వాన్ని లాభాపేక్ష లేని రీతిలో సేవాభావంతో ప్రపంచ మానవాళికి అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనకు స్ఫూర్తినిచ్చిన అంశం ఏదయినా ఉందా...? ఉంటే ఏమిటి...?
  • ఆరంభ దినాలు... ఆటుపోట్లు...
  • ఉత్సాహం... ఉద్వేగం... సమాచార విప్లవం...
  • వికీపీడియా ప్రధాన, శాఖా కార్యాలయాలు..., ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగుల సంఖ్య... వివరాలు
  • ప్రస్తుతం ఎన్ని ప్రపంచ భాషలలో అందుబాటులో ఉంది...?
  • ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో కలిపి ఎన్ని వ్యాసాలు ఉంటాయి...
  • ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది వాడుకరులు ఉన్నారు...?
  • భారత దేశంలో వికీ
  • భారత దేశంలో వికీ ప్రారంభానికి కారణంగా నిలచిన అంశం ఏమయినా ఉందా...?
  • మనదేశంలో... ఏ ప్రాంతంలో... ఏ భాషలో మొట్టమొదటగా వికీపీడియా ప్రారంభమయ్యింది...?
  • మన దేశంలో వికీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది...? భారత వికీ సారధులు...
  • భారతీయ భాషలలో వికీపీడియా
  • మన దేశంలో ఎంతమంది వాడుకరులు ఉన్నారు...?
  • భారత దేశంలో వికీ - ప్రస్తుత ఆదరణ
  • తెలుగు వికీపీడియా గురించి...
  • మన తెలుగులో వికీ ఎప్పుడు ప్రారంభ మయ్యింది...? అప్పటి సారధులు...
  • ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో ఎన్ని వ్యాసాలు ఉన్నాయి...?
  • తెలుగు భాషా వాడుకరులు ఎంతమంది ఉన్నారు...
  • తెవికీ సాధించిన ప్రగతి... సాధించ వలసిన లక్ష్యాలు...
  • ప్రచారం
  • సభలు సమావేశాలు
  • అంతర్జాతీయ సమావేశాలు
  • భారతీయ సమావేశాలు
  • అకాడమీలు
  • గణాంకాలు

ఇంక ఆఖర్న మనం ఏమి అందిస్తున్నాం... ఏమి కోరుకుంటున్నాం... .....వంటి వివరణతో వ్యాసం ముగిస్తే బాగుంటుందని నా ఆలోచన. పెద్దలు పరిశీలించ మనవి.

సభ్యుల అభిప్రాయాలు

[మార్చు]

....Malladi kameswara rao (చర్చ) 12:24, 28 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కామేశ్వరరావు గారు, మీరు కోరే చాలా సమాచారం వికీ గణాంకాలలో లభ్యమౌతుందండి. గణాంకాల నుంచి సేకరించవచ్చు. అలాగే "అంతర్జాతీయ వికీపీడియా" పేరు సమంజసంగా లేదు. వికీపీడియా పేర్లన్నీ భాషాపరంగానే ఉంటాయి. కాబట్టి వికీపీడియా అని ఉంచితే చాలు అది అన్నింటికీ వర్తిస్తుంది. మన తెలుగు వికీపీడియా వ్యాసం, ఆంగ్ల వికీపీడియా వ్యాసం, వికీ గణాంకాలలో, en:Category:Wikipedias by language వర్గంలో అన్ని భాషలకు చెందిన వికీపీడియా వివరాలున్నాయి చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:47, 28 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంత్ రావుగారూ ! ఈ వ్యాసం సర్వసభ్య సమావేశం కొరకు తయారు చెయ్యబడుతుంది. కనుక వికీపీడియా నియమాలు దీనికి వర్తించవలసిన అవసరం లేదు. మాట మంతీ వ్యాసంలోలా దీనిలో బహువచన ప్రయోగం ఉంటుంది. ఇలా ఇక్కడ ఉండడానికి అభ్యంతరం ఉంటే కనుక దీనిని ప్రాజెక్ట్ పేజ్జిగా మార్చి దీనిని నా సభ్యపేజీ నుండి లింకు ఇస్తాను. --t.sujatha (చర్చ) 03:27, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రారంభం చాలా బావుంది. వ్యాసం వేగవంతంగా పూర్తి కావడానికి అక్షర దోషాలను ఎప్పటికప్పుడు సరిదిద్దే ప్రయత్నంలో మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా సహకరించవచ్చునా...? అంశాలకు సంబంధించి వచ్చే ఆలోచనలను చర్చాపేజీలో తెలియజేస్తుంటాను. వికీపీడియా అంటే ఏమీ తెలియని వ్యక్తికి ఈ వ్యాసం చదివితే వికీపీడియా గురించి కనీస అవగాహన కలగడంతోబాటు, మరింత అదనపు సమాచారంకోసం వికీపీడియాలోకి ప్రవేశించాలన్న ఉత్సాహం కలిగించాలన్నది నా కోరిక. అలాంటి వారికి చంద్రకాంతరావు గారు చెప్పినట్లుగా ఈ వ్యాసంలో ఆ అంశాల ప్రస్థావన వచ్చినప్పుడు ఆయా పేజీల్లోకి వెళ్ళే లింకులు ఇస్తే సరిపోవచ్చునేమో...! పరిశీలించ మనవి. ...Malladi kameswara rao (చర్చ) 06:41, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కామేశ్వరరావుగారూ ! అక్షరదోషలు సరిదిద్దారంటే నాకు కొంచం శ్రమ తప్పుతుంది. నేను వేగవంతంగా వ్రాసుకుపోగలిగిన వీలు కలుగుతుంది. అవసరమనుకున్న చోట శైలి కూడా స్వతంత్రంగా మార్చవచ్చు. ఇది మీ కొరకు వ్రాస్తున్న వ్యాసం కనుక మీకు అనుకూలమైన మార్పులు చేయండి. --t.sujatha (చర్చ) 07:19, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సుజాత గారు, ఈ సమాచారం సర్వసభ్య సమావేశం కొరకైతే మీరన్నట్లు వికీపీడియా నేంస్పేస్ కు (అంటే ప్రాజెక్టు పేజీగా) తరలించాలి. అప్పుడు వ్యాసపు నియమాల నుంచి దీనికి మినహాయింపు లభిస్తుంది. అలాగే కామేశ్వరరావు గారు, "నేను కూడా సహకరించవచ్చునా?" అని అంటున్నారు. ఇక్కడ మీరూ సభ్యులే కదా, తెవికీలో తప్పకుండా మార్పులు చేర్పులు చేయవచ్చండి. అక్షరదోషాలే కాదు, పదాలు, వాక్యాలు, పేరాలూ చేర్చండి. దీన్ని ప్రాజెక్టు పేజీగా తరలిస్తే మన అభిప్రాయాలూ జోడించవచ్చు కూడా. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:48, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావుగారూ ! దీనిని ప్రాజెక్ట్ పేజీగా తరలించవచ్చు. నేనే మీ సహాయం కోరాలని అనుకున్నను. మీరే ముందుకు రావడం ముదావగహం. వికీపీడియా గురించి చక్కని అవగాహన ఉన్న అనుభవం కలిగిన మీరు ఇందుకు సహకరించగలరు కనుక మీరు ఈ వ్యాస రచనకు మీ తోడ్పాటు అందించండి. --t.sujatha (చర్చ) 14:01, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సుజాత గారు, వికీపీడియా నేంస్పేసుకు బదులు మీరు మూసపేరుకు తరలించారు. మళ్ళీ తరలింపు చేయాలండీ. అలాగే ఈ వ్యాసం (కాదు కాదు ప్రాజెక్టు పేజీ) రచనకు నా వంతు సహకారం అందించడానికి ప్రయత్నిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:28, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చంద్రకాంతరావుగారి పెద్దమనసుకు నా ధన్యవాదాలు. వికీపీడియా గురించి చాలా తక్కువ అవగాహన ఉన్న నేను విధాన విషయాలలో వేలు పెట్టకుండా... అక్షరదోషాలు సరిచెయ్యడం, సామాన్యుడికి సైతం సులభంగా అర్దమయ్యేందుకు వీలుగా వాక్యనిర్మాణంలో స్పష్టతకోసం కృషి చెయ్యడం బాధ్యతగా నిర్వహించగలనని మనవి చేసుకుంటున్నాను. సుజాతగారూ, శీర్షిక పేరులో తప్పు వచ్చింది... నాకు సరిచెయ్యడం రావటంలేదు......Malladi kameswara rao (చర్చ) 15:22, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

శీర్షిక పేరును మరియు రెండు నేంస్పేసులు వచ్చిన దాన్ని నేను సరిచేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:30, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు చంద్రకాత్ రావుగారూ ! నేనే మీ సహాయం కోరాలనుకున్నను. మీరే చేసారు.--t.sujatha (చర్చ) 04:16, 2 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మల్లాదిగారూ ! ముందు అవసరమైన వివరాలు సేకరిస్తున్నాను. వాటితో మీరు ఆకర్షణీయమైన వ్యాసం తయారుచెయ్యవచ్చు.--t.sujatha (చర్చ) 04:28, 2 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సుజాతగారూ... వ్యాసం అద్భుతంగా వస్తోంది. 'తెలుగు వికీపీడియా అభివృద్ధి'ని 'తొలి అడుగులు'గా మార్చి, 'అభివృద్ధి'ని వేరుచేసాను. ఇందులో- 'ప్రస్తుత స్థితి గురించి చెబుతూనే, సాధించవలసిన లక్ష్యాల'ను సూచన ప్రాయంగా చెబితే బావుంటుందేమో.... ఆలోచించగలరు. అలాగే - 'తొలి అడుగులు'లో పేర్కొన్న నిర్వాహకుల (సారధులు) గురించి చిన్న పరిచయంతో బాటు, వారి చిత్రాలు కూడా జోడిస్తే, ఈ వ్యాసం చదువుతున్న పాఠకులకు స్పూర్తిదాయకంగా వుంటుంది. ....Malladi kameswara rao (చర్చ) 07:28, 3 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మల్లాదిగారూ ! మీ ప్రశంశకు ధన్యవాదాలు. మూలాలు చేర్చే పని పూర్తి అయింది. మెరుగులు దిద్దే పని ఉంది ఇక ఆ పని మొదలుపెడతాను. వ్యాసాన్ని ఆకర్షణీయంగా చేసే పని మాత్రం మీది. మీరైతే ఆపని చక్కగా చేయగలరు.--t.sujatha (చర్చ) 13:20, 3 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

10 లక్షలకు మించి వ్యాసాలున్న భాషలలో డచ్చి, జపాను భాషలు రెండూ ఉన్నాయా?కంపశాస్త్రి 18:17, 5 మార్చి 2013 (UTC)కంపశాస్త్రి

డచ్చి ఉంది కాని జపాను లేదండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:03, 5 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చంద్రకాంతరావుగారికి, కంపశాస్త్రిగారికి పొరపాటు గమనించి సరిదిద్దినందుకు ధన్యవాదాలు. ఇంక ఆఖర్న మనం ఏమి అందిస్తున్నాం... ఏమి కోరుకుంటున్నాం... .....వంటి వివరణతో వ్యాసం ముగిస్తే బాగుంటుందని నా ఆలోచన. పెద్దలు పరిశీలించ మనవి. ఇది పరిశీలించి మీ అభిప్రాయాలు వ్యాసంలో చేర్చండి. --t.sujatha (చర్చ) 03:01, 6 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

శీర్షిక సలహాలు

[మార్చు]

శీర్షిక ను వికీపీడియా- స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము గా మార్చితే బాగుంటుంది.--అర్జున (చర్చ) 08:54, 20 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సూచన బాగుంది. అలాగే చేయవచ్చు. --t.sujatha (చర్చ) 09:06, 20 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి సూచన వ్యాసాన్ని ఆ పేజీకి దారిమార్చండి.Rajasekhar1961 (చర్చ) 09:08, 20 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మెరుగు కి సలహాలు

[మార్చు]
చాలా శ్రమ తీసుకొని ఈ వ్యాసాన్ని తయారుచేసిన సుజాత గారి గురించి ఈ వ్యాసంలో వివరిస్తే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 09:09, 20 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వండన శేషగిరిరావు గారిని గురించి రెండు సార్లు వివరించారు. వారూ వీరూ వేరా, లేక ఒకరేనా. ఒకరే అయితే ఏదేన ఒకదాంట్లో తొలగించండి.విశ్వనాధ్ (చర్చ) 13:36, 20 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఒకదాన్ని తొలగించాను.Rajasekhar1961 (చర్చ) 15:18, 20 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
కొందరు సభ్యులు నిర్వహకులు, ప్రస్తుత నిర్వహకులు అనేది పెట్టారు. అది కొంత గందరగోళంగా ఉంటుంది అనుకొంటున్నను. ఇంతకు ముందు నిర్వహకులు, ఇప్పటి నిర్వహకులు అని వేరుగా వ్రాయడం అనవసరం అని నా అభిప్రాయం.విశ్వనాధ్ (చర్చ) 14:18, 21 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాధ్ గారు, నిర్వహకులు అందరికి "ప్రస్తుతం" అనే పెట్టాను. అందరిలో ఉన్న ప్రస్తుతం అనే దానిని ఇప్పుడు తొలగించాను. ఇది వరకు నిర్వహకులుగా పని చేసి ఉంటే, ఆ విషయము తెలిసినప్పుడు "నిర్వహకులుగా పని చేసారు" అని వ్రాయడములో తప్పులేదు. మీరు అర్థము చేసుకొనగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 16:07, 21 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]