వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/అయోమయ నివృత్తి
పేజీల కేటాయింపు
[మార్చు]చదువరి గారూ ప్రాజెక్టులో పాల్గొనేవారు వర్గం:అయోమయ నివృత్తి అనే వర్గంలోని అక్షరక్రమం ప్రకారం ఒక్కక్కరు ఏ అక్షరం నుండి ఏ అక్షరం వరకు వారు సవరణలు చేపడతారో తెలిపితే బాగుంటుంది.లేదా మీరే కేటాయింపు పట్టిక చేసినా బాగుంటుంది.నావరకు నేను "అ" నుండి "ఔ" వరకు 447 పేజీలు చేపడదామని అనుకుంటున్నాను.లేదా మీరు కేటాయించినా పర్వాలేదు.చేసే వారు వారు చేసే పనికి అవకాశంఉంటే ఒక పేజీలాగా పని వివరం ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 09:44, 3 జనవరి 2020 (UTC)
- యర్రా రామారావు గారూ, ఔనండి, నేనది గుర్తించలేదు. మీరు చెయ్యదలచిన పేజీలను అక్కడ రాయండి. అలాగే అందరూ చేస్తారు. ధన్యవాదాలు. __చదువరి (చర్చ • రచనలు) 09:59, 3 జనవరి 2020 (UTC)
యర్రా రామారావు సూచనలు
[మార్చు]- రెండు రాష్టాలు విడిపోయినందున ఏ రాష్ట్రానికి సంబందించిన గ్రామాలు, మండలాలు ఆ రాష్ట్రాల విభాగంగా కూర్పు. ఈ రెండిటికి సంబంధంలేనివి మాములుగా కూర్పు.
- గ్రామము,మండలము అనే పదాలలో అనుస్వారం (సున్న) వాడుకతో సవరణ.
- తెలంగాణలో పునర్య్వస్థీకరణలో భాగంగా వెంకటాపురం, నరసాపురం (అయోమయ నివృత్తి) కొన్ని ఇలా సవరించాను.ఎలానూ సవరిస్తున్నాం కనుక ఇవి కూడ పరిగణన లోకి తీసుకుంటే బాగుంటుంది.--యర్రా రామారావు (చర్చ) 16:08, 4 జనవరి 2020 (UTC)
చేసిన పేజీలేవో తెలుసుకోవడం ఎలా
[మార్చు]అయోమయ నివృత్తి పేజీలకు ఇచ్చిన లింకులను సవరించిన పేజీలేవో తెలుసుకునే వీలు లేదు. అయా పేజీలను తెరిచి, "ఇక్కడికి లింకున్న పేజీలు" ఏమేంటో చూస్తే తప్ప తెలియదు. అయితే ఒకటుంది... సవరణ జరిగాక, భవిష్యత్తులో ఆ పేజీలకు మళ్ళీ లింకులు ఇవ్వరని చెప్పలేం. కాబట్టి అప్పుడప్పుడూ చూసుకుంటూనే ఉండాలి. అంచేత ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించనవసరం లేదని భావిస్తున్నాను. యర్రా రామారావు గారూ మీరేమంటారు? __చదువరి (చర్చ • రచనలు) 05:13, 6 జనవరి 2020 (UTC)
- ఒక ఆలోచన.. సవరించిన పేజీలను ప్రాజెక్టు పేజీలో చేరుద్దాం. __చదువరి (చర్చ • రచనలు) 06:28, 6 జనవరి 2020 (UTC)
- చదువరి గారూ గమనించాను.బాగుంది.క్షమించాలి.ఆ పేజీలో కొద్ది సవరణలు చేశాను.అలా కాకుండా ఏమైనా మార్పులు చేయవలసిఉంటే చేయండి.--యర్రా రామారావు (చర్చ) 07:06, 6 జనవరి 2020 (UTC)