వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/పాఠ్యాంశాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సూచనలు[మార్చు]

కశ్యప్[మార్చు]

  1. ఎక్కువ శాతం మంది మొబైల్ ద్వారా నే వికీపీడియా చూస్తున్నారు, వీలయితే కొన్ని సవరణలు మొబైల్ లోనే చేసున్నారు,అయితే ఇప్పటికీ కూడా అది ప్రాధమిక దశలోనే ఉన్నది కావున, మొబైల్ వీక్షణ నుండి డెస్క్ టాప్ వీక్షణ ను మారటం చాలా మందికి తెలియదు వీలయితే ఆ పాఠ్యాంశములు ప్రాధమిక సిలబస్ లో చేర్చవల్సినది గా, మొబైల్ ఎడిటింగ్ కు టైపింగ్, ఇంటరుఫేసు లాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా గా, అలాంటి వీడియోలు మొబైల్ అనుకూల ఫార్మేట్ లో తయారుచేయ సూచన : Kasyap (చర్చ) 05:29, 6 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి[మార్చు]

ఈ విభాగంలో దీని ఉపవిభాగాల్లో నా అభిప్రాయాలను సూచనలనూ చేరుస్తూంటాను.__చదువరి (చర్చరచనలు) 04:16, 9 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పాఠ్య ప్రణాళిక - మెటా అంశాలు[మార్చు]

  1. ఈ పాఠ్య ప్రణాళికలో ఈ పాఠాలకు సంబంధించి వచ్చే వివిధ అంశాలకు సంబంధించి (వికీ అంశాలు కాదు ఈ ప్రణాళికకు సంబంధించిన అంశాలు) ఒక ప్రామాణిక పేర్ల పట్టిక (నోమెన్‌క్లేచరు) తయారు చేసుకోవాలి. పాఠాల్లో ఎక్కడైనా ఆ పేర్లనే వాడాలి - అజంతం హలంతం వగైరాలను కూడా నిర్దుష్టంగా నిర్థారించుకోవాలి. ఉదాహరణకు - పాఠాన్ని ఏమనాలి, వీడియోను ఏమనాలి, కంప్యూటరు, ల్యాప్‌టాపు, మొబైలు, బ్రౌజరు, కీబోర్డు, మౌసు, తెరపట్టు, యూజర్ ఇంటర్‌ఫేసు, నాంది, ముగింపు.. వగైరా.
  2. పాఠాలకు (పాఠ్యం/వీడియో/ఆడియో) ప్రామాణికమైన డిజైను, రంగులు వగైరాలుండాలి. వీటిలో కొన్ని ఒక్కోస్థాయికి ఒక్కో విధంగా ఉండాలి. కొన్ని అన్ని స్థాయిలకూ ఒకేలా ఉండాలి.
  3. పాఠాలకు ఒక ప్రామాణికమైన నాంది, ముగింపు ఉండాలి. ఒకే నాంది ముగింపు ఉండాలనడం లేదు, ఒకే రకంగా ఉండాలి. వికీలోగోతో పాటు, తెలుగు పాఠాల లోగో ఒకటి ప్రతీ పేజీలోను, వీడియో లోనూ ఉండాలి.
  4. ఈ పాఠాల వీడియోల్లో చూపే బొమ్మలను అది డైనమిక్‌గా తీసుకోవాలి. ఎందుకంటే యూజర్‌ ఇంటర్ఫేసులకు కాలదోషం పట్టే/మారుతూండే అవకాశం ఉంది. మళ్ళీ వీడియోను కొత్తగా తయారు చెయ్యకుండా, బొమ్మ మాత్రమే మారిస్తే సరిపోయేలా ఉండాలి. చాలా సందర్భాల్లో ఇది పనికొస్తుంది.
  5. వీడియో కేవలమొక స్టాటిక్, స్టాండలోన్ వీడియోగా ఉండకూడదు. దానిలో ఇంటరాక్టివిటీ ఉండాలి. వీడియో నుండి మరేదైనా పాఠానికి (వీడియో/ఆడియో/పాఠ్యం) వెళ్ళే సౌకర్యం ఉండాలి. వీడియో వివరిస్తున్న అంశాన్ని ఆ వీడియో లోనే పరీక్షించే సౌలభ్యం ఉంటే బాగుంటుంది. ఉదాహరణలు, బొద్దు చెయ్యడం వివరిస్తున్నారనుకోండి - ఇదిగో ఇక్కడ పరీక్షించండి అంటూ ఒక ఇన్‌పుట్ పెట్టె ఇవ్వడం అందులో వాడుకరి ఏదైనా పదాన్ని ఇచ్చి, బొద్దుగా చూపు అనే బొత్తాన్ని నొక్కితే అది బొద్దుగా కనబడ్డం - ఇలా ఉండాలి. దీనివలన వాడుకరికి పాఠం ఆసక్తికరంగా ఉంటుంది, వేడుక గానూ ఉంటుంది, తొందరగా అర్థమౌతుంది కూడాను.
  6. వీడియో ప్రామాణిక నిడివిని నిర్థారించుకోవాలి. మరీ పొడుగ్గా ఉండరాదు. రెండు మూడు నిమిషాలైతే బాగుంటుందని నా అభిప్రాయం. వీడియోలో ఆడియో కూడా ఉండాలి.
  7. ఈ పాఠాలను నిలువు అడ్డాలుగా వర్గీకరించారు కదా - ఇక్కడ రాసిన పాఠ్యాంశాలన్నిటినీ ఆ పట్టికలో పెడితే బాగుండేది. పరిశీలించండి.
    1. నిలువు వర్గీకరణలో - కొత్తవారు, మధ్యమ స్థాయి, ఉన్నత స్థాయి అనే మూడు ఉంటే సరిపోతుందనుకుంటాను. ఆ పై స్థాయిల వాళ్ళకు వీడియోలు అక్కర్లేదు, ప్రత్యేకంగా పాఠాలూ అక్కర్లేదనుకుంటాను. వికీపీడియా ఫేరుబరిలో ఉండే వ్యాసాలు సరిపోతాయి. రెండే సరిపోతాయా అనేది కూడా ఆలోచించాలి.
    2. అడ్డు వర్గీకరణలో - ఏ అంశం ఏ నిలువు వర్గానికి చెందుతుందో చూపే పట్టికను ఇక్కడ పెడితే పరిశీలనకు తేలిగ్గా ఉంటుంది.
  8. ఇక్కడి పాఠాలను ప్రామాణికంగా ఏ ఆపరేటింగు వ్యవస్థ, ఏ బ్రౌజరు వగైరాలపై ఆధారపడి తయారుచేసామో తెలిపే వీడియో ఒకటి ఉండాలి. ఇక్కడి పాఠాల్లో చూపిన అంశాలన్నీ ఆ సాంకేతికాలకు అనుకూలంగా ఉంటాయన్నమాట. అవి ఏయే ఇతర వ్యవస్థలకు, బ్రౌజర్లకూ అనుకూలిస్తాయో కూడా చెప్పాలి. ప్రత్యేకించి ప్రతి పాఠం లోనూ ఈ అంశాలను చెప్పరు. కానీ ఎక్కడైనా ఈ ప్రామాణిక సాంకేతికాలు కాకుండా వేరేవి ఉదహరించాల్సి వస్తే ఆ విషయాన్ని అక్కడ పేర్కొంటారు.
  9. వికీపీడియాలో పనిచేసేందుకు మీ కంప్యూటరులో, మీ బ్రౌజరులో ఏయే అంశాలను ఎలా అమర్చుకోవాలి అనే పాఠం ఒకటి ఉండాలి. ఉదాహరణకు భాషలు, జావాస్క్రిప్టు వగైరాలు.
  10. పాఠాల తయారీలో కొత్తవారి (ప్రాథమిక స్థాయి) కోసం విజువల్ ఎడిటరును మాత్రమే వాడాలి. ఇతర స్థాయిల్లో కూడా అదే వాడుతూ అవసరమైన చోట్ల వికీటెక్స్టు ఎడిటరును వాడితే బాగుంటుంది.
  11. పాఠాల వర్గీకరణ అంశం వారీగా కూడా చెయ్యాలి. ఉదాహరణకు వికీలో సహాయం పొందడం ఎలా అనే అంశం కింద ఉన్న పాఠాలను ఒకచో చేర్చాలి. దాని కింద - వికీపీడియా పేరుబరిలో ఏముంటై, సహాయం పేరుబరిలో ఏముంటై, సహాయ కేంద్రం, సంప్రదింపు కేంద్రం, రచ్చబండ (దాని విఉభాగాల్తో సహా) వగైరా పాఠాల లింకులుండాలి.

పాఠ్య ప్రణాళిక గురించి[మార్చు]

  1. పేరుబరి అంటే ఏమిటి, వివిధ పేరుబరుల క్లుప్త పరిచయం అనేవి కనిపించలేదు. వాటి గురించి వికీపీడియా పరిచయం విభాగంలో ఉండాలి.
  2. వీకీ తత్వం గురించి చెప్పాలి - ఉదా: ఎక్కడో ప్రచురితమైన సమాచారాన్నే ఇక్కడ చేర్చాలి. "గురించి" రాయాలి. మీకు తెలిసినంత మాత్రాన రాసెయ్యకూడదు -మూలాలు చెప్పాలి,
  3. వికీలో నమోదు కాగానే, అభిరుచులు విభాగంలో ఏయే అంశాలను అనుకూలీకరించుకోవాలో చెప్పే పాఠం ఒకటి ఉండాలి.
  4. వ్యాసం పేరును మార్చాలంటే ఎలా (తరలింపు) అనేది కనబడలేదు. అది కూడా ఉండాలి
  5. వ్యాసం తొలగింపు గురించి చెప్పాలి
  6. ప్రత్యేక పేజీల గురించి చెప్పాలి
  7. వికీ నియమాలు విభాగంలో "వికీ కాపీరైట్స్" అనే విభాగం పేరు పొరపాటు అనుకుంటాను. ఆ పేరు మార్చాలి. అందులో వికీ మూల సూత్రాలు, విధానాలు మార్గదర్శకాల గురించి విడివిడిగా చూపాలి
  8. వాడుకరుల సమూహాలు, అర్హతలు, హోదాలు, అనుమతులు మొదలైన వాటి గురించిన పాఠం చేర్చాలి
  9. పదకోశం ఒకదాన్ని తయారు చెయ్యాలి -ఏదైనా పదం గురించి సందేహం వచ్చినపుడు దాన్ని చూస్తే ఠక్కున తెలిసిపోయేలా
  10. అయోమయ నివృత్తి గురించి వివరణ ఉండాలి
  11. దారిమార్పు గురించి చెప్పాలి
  12. దిద్దుబాటు సారాంశం గురించి చెప్పాలి
  13. నిర్వాహకులను సంప్రదించడం ఎలాగో చెప్పాలి
  14. వికీప్రాజెక్టుల గురించి చెప్పాలి
  15. చమత్కార పదాలను పరిచయం చెయ్యాలి
  16. ఏది వికీపీడియా కాదో చెప్పాలి