Jump to content

వికీపీడియా చర్చ:WikiProject/పుస్తకాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మూస అచ్చుతప్పులు

[మార్చు]

వికీప్రాజెక్టు పుస్తకాలు మూసలో అచ్చుతప్పులున్నాయి. "పుస్తకాల" బదులు "పుస్తకాలకు" అలాగే "సంబందించిన" బదులు "సంబంధించిన" ఉండాలి. నాకు మూస మార్పుచేర్పులు తెలియదు. ఎవరైనా చెప్పినా సరే లేదా దిద్దినా సరే. వికటకవి 16:53, 4 అక్టోబర్ 2007 (UTC)

ఈ ప్రాజెక్టులొ రచయితలు కూడా ఉంటాఋ కదా? ఉదాహరణ కు విశ్వనాథ సత్యనారాయణ గారు--బ్లాగేశ్వరుడు 20:20, 7 అక్టోబర్ 2007 (UTC)
రచయితలును కూడా కలపాలా? లేదా అన్నది మనం నిర్ణయించుకోవలసిన విషయం --వైజాసత్య 21:06, 7 అక్టోబర్ 2007 (UTC)
రచయితలను వేరే ప్రాజక్టుగా వృద్ధిచేయటం మంచిది.--అర్జున 08:03, 2 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

సమాచార పెట్టెలు

[మార్చు]

ఈ సమాచార పెట్టె లేదా మంచి సమాచార పెట్టెల్ని తయారుచేసి పుస్తకాల కోసం ఉపయోగిస్తే బాగుంటుంది. మూస:సమాచారపెట్టె పుస్తకం లో చేర్చవలసిన వివరాలు | ముద్రణ సంవత్సరాలు = | ప్రతులకు = | అంకితం = Rajasekhar1961 14:37, 3 ఆగష్టు 2011 (UTC)


ఆహ్వానం

[మార్చు]

ఈ ప్రాజెక్టు అభివృద్ధి చెయ్యాలని ఆలోచనతో బాధ్యతను చేపట్టాను. దీనికి మీ అందరి సహకారం ఎంతో అవసరం. మీ మీ దగ్గర ఉన్న పుస్తకాల గురించి ఒక పేజీని తయారుచేయండి. వాటిని ఎలా మంచి వ్యాసంగా చేయాలో ఆలోచిద్దాం. నా వద్ద ఉన్న వాటితో ప్రారంభిస్తున్నాను. దీని అభివృద్ధికి మీ సలహాలు ఎంతో ఉపయోగకరం.Rajasekhar1961 07:55, 26 డిసెంబర్ 2011 (UTC)

మీ జాబితా వికీ చిరునామా ఇవ్వలేదే? ఇది మంచిఆలోచన. ఇద్దరి దగ్గర అదే పుస్తకం వుంటే దాని గురించి కలిసి వ్యాసం రాయటం బాగుంటుంది. భారత_డిజిటల్_లైబ్రరీ లోని పుస్తకాలయితే అందరూ పాలుపంచుకోవచ్చు. --అర్జున 09:31, 26 డిసెంబర్ 2011 (UTC)
మొలకలు కాకుండా కనీసం మూడు పేరాల కనీసం ప్రతి పేరా మూడు వాక్యాలతో వ్యాసం రాయగలిగితే బాగుంటుంది.--అర్జున 09:45, 26 డిసెంబర్ 2011 (UTC)
భారత డిజిటల్ లైబ్రరీ లోని తెలుగు పుస్తకాలు చదవడానికి ప్రయత్నించాను. కానీ దానికి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ అవసరమని చెబుతున్నది.Rajasekhar1961 10:06, 26 డిసెంబర్ 2011 (UTC)
అది ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు. [ http://www.archive.org/ ఆర్కైవ్. ఆర్గ్] లో తెలుగు కోసం వెతకండి. దానిలో మరింత వాడుకరులకు సులభంగా వుంటుంది. --అర్జున 06:03, 27 డిసెంబర్ 2011 (UTC)
వచ్చే 3 నెలలకు అభివృద్ధి ప్రణాళికను తయారుచేస్తున్నాను. మీ అమూల్యమైన సలహాలను చేర్చండి.Rajasekhar1961 12:32, 29 డిసెంబర్ 2011 (UTC)
పుస్తకం మూసలో కొన్ని కాలమ్ లు పనిచేయడం లేదు. ఎందువలన. తెలిసినవారు సరిచేయండి.Rajasekhar1961 11:58, 27 డిసెంబర్ 2011 (UTC)
అన్నీ పనిచేస్తున్నాయి. --అర్జున 08:02, 2 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు

[మార్చు]

AVKF సంస్థ వారి బొమ్మలు తెవికీలో పెట్టడం మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. ఎవరికి వారు తమ దగ్గరవున్న పుస్తకాల బొమ్మలను చేర్చటం బాగుంటుంది. AVKF వారికి పుస్తకపు బొమ్మపై నకలు హక్కులు వుండవు కాబట్టి, వారు సేకరించిన బొమ్మలను ఇక్కడ పెట్టితే అనవసరంగా ఒక వ్యాపార సంస్థకి ప్రచార కలిగించిన భావం కొందరిలో కలగవచ్చు. ఇప్పటికే చేర్చిన బొమ్మలను తొలగించటం మంచిదని నా అభిప్రాయం. -- అర్జున 13:16, 31 డిసెంబర్ 2011 (UTC)

వేగవంతమైన తొలగింపు విధానాలకోసం ఇంగ్లీషు విధానాలు చూడండి. ఇప్పటికే కొన్ని తెవికీ బొమ్మలపై దీనిని ఉదహరించారు.ఉదా: తెనాలి రామలింగ బొమ్మ.--అర్జున 08:11, 2 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ముఖ్యమైన పుస్తకాలు

[మార్చు]

తెలుగు వికీపీడియాలో ఇప్పటికే ఉన్నవాటిలో కొన్ని ముఖ్యమైన పుస్తకాలను గుర్తిస్తే వానిలో నా దగ్గర ఉన్నవి నేను విస్తరిస్తాను. దయచేసి ఇక్కడ తెలియజేయండి.Rajasekhar1961 07:53, 2 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా చూసి ప్రధానమైన వర్గాన్ని గుర్తించండి. అక్కడే మీ దగ్గర వున్న పుస్తకాల పేర్లు రాసి ఈ వ్యాఖ్య దగ్గర మీ మార్పుల చిరునామా ఇవ్వండి. --అర్జున 08:07, 2 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
సమగ్ర ఆంధ్ర సాహిత్యం, విశ్వంభర, విశ్వరూపం, అమృతం కురిసిన రాత్రి పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి.Rajasekhar1961 08:21, 2 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
వీటిపై ఇప్పటికే వ్యాసాలున్నాయి వాటిని విస్తరించండి. కాని వీటిని ఆధునిక నవలలు, సాహిత్య చర్చ అనే వర్గాలుగా అనుకుంటే బాగుంటుందా--అర్జున 08:24, 2 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]