విజయ్ కుమార్ హన్స్‌దక్
విజయ్ కుమార్ హన్స్‌దక్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 | |||
ముందు | దేవిధాన్ బెస్రా | ||
---|---|---|---|
నియోజకవర్గం | రాజ్‌మహల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కలితల్లా గ్రామం, సాహిబ్‌గంజ్ జిల్లా, జార్ఖండ్ రాష్ట్రం | 1982 అక్టోబరు 27||
రాజకీయ పార్టీ | జార్ఖండ్ ముక్తి మోర్చా | ||
తల్లిదండ్రులు | థామస్ హన్స్‌దక్, సరోజిని ముర్ము | ||
జీవిత భాగస్వామి | చత్రిన్ హెంబ్రోమ్ | ||
నివాసం | బర్హర్వా | ||
మూలం | [1] |
విజయ్ కుమార్ హన్స్‌దక్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1]అతను రాజ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]విజయ్ కుమార్ హన్స్‌దక్ 1982 అక్టోబర్ 27న జార్ఖండ్ రాష్ట్రం, సాహిబ్‌గంజ్ జిల్లా, కలితల్లా గ్రామంలో థామస్ హన్స్‌దక్, సరోజిని ముర్ము దంపతులకు జన్మించాడు. అతను జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లోని సెయింట్ జేవియర్స్ స్కూల్‌లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]విజయ్ కుమార్ హన్స్‌దక్ తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాలలోకి వచ్చి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలో చేరాడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాజ్‌మహల్ నుండి పోటీ చేసి నుండి జేఎంఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి హేమలాల్ ముర్ముపై 41,337 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 7 అక్టోబర్ 2014 నుండి 25 మే 2019 వరకు పార్లమెంట్‌లో గ్రామీణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 12 మార్చి 2015 నుండి 25 మే 2019 వరకు కన్సల్టేటివ్ కమిటీ & లైబ్రరీ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
విజయ్ కుమార్ హన్స్‌దక్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాజ్‌మహల్ నుండి జేఎంఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి హేమలాల్ ముర్ముపై 99,195 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 13 సెప్టెంబర్ 2019 నుండి 4 జూన్ 2024 వరకు పార్లమెంట్‌లో బొగ్గు, గనులు & ఉక్కుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 16 సెప్టెంబర్ 2019 నుండి 4 జూన్ 2024 వరకు లాభదాయక కార్యాలయాలపై జాయింట్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
విజయ్ కుమార్ హన్స్‌దక్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాజ్‌మహల్ నుండి జేఎంఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి తలా మరాండీపై 1,78,264 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (2024). "Vijay Kumar Hansdak" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
- ↑ TV9 Bharatvarsh (5 June 2024). "JMM के विजय हंसदक राजमहल सीट से डेढ़ लाख से अधिक वोटों के अंतर से जीते, जानिए उनके बारे में सबकुछ". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Rajmahal". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.