విదేహా రాజ్యము
విదేహా రాజ్యము | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
సిఎ. 1400 బిసిఈ–500 బిసిఈ | |||||||||
విదేహ, ప్రాచీన వేద కాలం యొక్క ఇతర రాజ్యాలు | |||||||||
రాజధాని | మిథిల నగరి[1] | ||||||||
సామాన్య భాషలు | మైథిలి[2] సంస్కృతం[2] | ||||||||
మతం | వేదము-హిందూ మతము[3] | ||||||||
ప్రభుత్వం | రాచరికం | ||||||||
Janaka | |||||||||
చారిత్రిక కాలం | ఇనుప యుగం | ||||||||
• స్థాపన | సిఎ. 1400 బిసిఈ | ||||||||
• పతనం | 500 బిసిఈ | ||||||||
| |||||||||
Today part of | India Nepal |
విదేహా రాజ్యము వేద భారతదేశంలో పురాతన రాజ్యం, ఇది జనక మహారాజు చేత స్థాపించబడింది. ఈ రాజ్యం యొక్క సరిహద్దు ప్రస్తుతం ఉత్తర బీహార్ లోని మిథిల ప్రాంతంలో, నేపాల్ యొక్క తూర్పు తెరేలో ఉంది. పవిత్రమైన రామాయణం ప్రకారం, విదేహా రాజ్యము యొక్క రాజధాని మిథిలా నగరి అని ప్రస్తావించబడింది.[4] మిథిల అనే పదం, మొత్తం రాజ్యాన్ని కూడా సూచించడానికి ఉపయోగించబడింది.[5]
వేద కాలం నాటి (క్రీ.పూ 1100-500 బిసిఈ) సమయంలో, విదేహ రాజ్యం దక్షిణ ఆసియాలో ప్రధాన రాజకీయ, సాంస్కృతిక కేంద్రాలలో కురు, పాంచాలా రాజ్యాలతో పాటుగా ఒకటిగా ఉండేది. విదేహ రాజ్యానికి చెందిన రాజుల పేరు జానకాస్ లేదా జనకులు అని పిలువబడేవారు.[6] బ్రాహ్మణాలు, బృహదారణ్యక ఉపనిషత్తు వంటి ప్రాచీన వేద సాహిత్యంలో విదేహ యొక్క గొప్ప తత్వవేత్త రాజుగా, వేద సంస్కృతి, తత్త్వ శాస్త్రం యొక్క పోషణకు ప్రసిద్ధి చెందినవాడుగా, జనకుడు గురించిన ప్రస్తావన ఉంది. అంతేకాకుండా, ఋషి (సాధువు) కోసం న్యాయస్థానం వలె, యాజ్ఞవల్క్య మహర్షి వంటి వారికి మేధో కేంద్రంగా ఉండేది.[7] విదేహ రాజ్యంలో బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు యొక్క కూర్పు కాలం రాయచౌధురి ప్రకారం 14 వ నుండి 8 వ శతాబ్దం బిసిఈ పరిధిని సూచిస్తుంటే, విట్జెల్ సి. 900 నుండి 500 బిసి పరిధిని సూచిస్తుంది.[7] ప్రాచీన వేద కాలం సమయములో ఐతరేణీయాలకు సంబంధించిన వేద పాఠశాల (లు), స్కాలర్షిప్ ఇతర కేంద్రాలు, బహుశా విదేహ రాజ్యానికి తరలించబడింది (బడ్డాయి).[8]
విదేహ యొక్క ప్రాంతం, సంస్కృతి తరచుగా హిందూ సాహిత్యంలో ప్రస్తావించబడింది.[9] రాజ వంశానికి సంబంధించిన ఆలోచనలను ఈ గ్రంథాలు యందు పేర్కొన్నబడ్డాయి. తత్వవేత్తలయిన రాజుల సంప్రదాయం, నమి (లేదా కొన్ని గ్రంథాలలో నిమి), జనకుడు, ఇతర రాజులు వంటి ఉదాహరణలు ఉన్నాయి.[9] జీవించివున్న వారి కథలు పురాతన హిందూ, బౌద్ధ, జైన గ్రంథాలలో కనిపిస్తాయి. బుద్ధుని పుట్టుక ముందు, రాజుల చేత ' పరిత్యాగము ' అనేది గౌరవనీయ సాంప్రదాయం అని వీటిలో సూచిస్తుంది. ఈ సాంప్రదాయం కూడా విస్తారంగా విదేహ రాజ్యం లోనే కాకుండా అనేక ప్రాంతాల్లో, పాంచాలము, కళింగము, గాంధారము ఇత్యాది వాటిల్లో పరిత్యాగం ప్రస్తావన విషయం అంగీకరించబడింది.[9] జైనమతంలో ఇరవై నాలుగు తీర్థంకరులలో 21 వ వానిగా ' నిమి ' లేదా ' నమి ' లేదా నామి వానిని చేర్చారు. (22 వ తీర్థంకరుడిగా ఉన్న ' నెమి ' కు, ' నిమి ' కి గందరగోళంగా ఉండకూడదు).[9]
వేద కాలం ముగింపులో, విదేహ యొక్క ప్రాంతం బహుశా ' వ్రిజ్జీ ' (పాలి: వాజ్జీ) సమాఖ్య భాగంగాను, తరువాత మగధ సామ్రాజ్యం భాగంగా మారింది.[10] సంస్కృత పురాణాలలో, మహాభారతం, రామాయణాలలో కూడా విదేహ రాజ్యం ప్రస్తావించబడింది. రామాయణంలో సీత విదేహ రాజ్యం రాకుమార్తె, [9] రాముడును వివాహం చేసుకోవడంతో కోసల, విదేహ రాజ్యాల మధ్య సంబంధాన్ని ఏర్పడినట్లు సూచిస్తుంది.[11] విదేహ యొక్క రాజధాని జనక్‌పూర్ (ప్రస్తుతం నేపాల్ లో ఉంది) [11] లేదా బలిరాజ్‌గడ్ (ప్రస్తుతం మధుబాని జిల్లా, బీహార్, భారతదేశం) గా భావిస్తారు.[12]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Michael Witzel (1989)
- ↑ 2.0 2.1 D. Gellner; J. Pfaff-Czarnecka; J. Whelpton (6 December 2012). Nationalism and Ethnicity in a Hindu Kingdom: The Politics and Culture of Contemporary Nepal. Routledge. pp. 516–. ISBN 978-1-136-64956-1.
- ↑ Ben-Ami Scharfstein (1998), A comparative history of world philosophy: from the Upanishads to Kant, Albany: State University of New York Press, pp. 9-11
- ↑ Michael Witzel (1989), Tracing the Vedic dialects in Dialectes dans les litteratures Indo-Aryennes ed. Caillat, Paris, pages 13, 17 116-124, 141-143
- ↑ https://books.google.co.in/books?id=OEZe-wAIiKIC&pg=PA207&lpg=PA207&dq=Mithila+was+used+to+refer+to+entire+videha&source=bl&ots=T-IGKEeY6j&sig=5iHf6Mhym6QYz05wb6fOpaPyNA4&hl=en&sa=X&ved=0ahUKEwiig6Pv38TTAhVGqY8KHZ7jAuEQ6AEIMDAG#v=onepage&q=Mithila%20was%20used%20to%20refer%20to%20entire%20videha&f=false
- ↑ Michael Witzel (1989), Tracing the Vedic dialects in Dialectes dans les litteratures Indo-Aryennes ed. Caillat, Paris, pages 13, 141-143
- ↑ 7.0 7.1 H. C. Raychaudhuri (1972), Political History of Ancient India and Nepal, Calcutta: University of Calcutta, pp.41–52
- ↑ Michael Witzel (1989), Tracing the Vedic dialects in Dialectes dans les litteratures Indo-Aryennes ed. Caillat, Paris, pages 76-77, 125
- ↑ 9.0 9.1 9.2 9.3 9.4 Geoffrey Samuel, (2010) The Origins of Yoga and Tantra: Indic Religions to the Thirteenth Century, Cambridge University Press, pages 69-70
- ↑ H.C. Raychaudhuri (1972), pp. 70-76
- ↑ 11.0 11.1 Raychaudhuri (1972)
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-10-26. Retrieved 2017-06-03.
- Mahabharata of Krishna Dwaipayana Vyasa, translated to English by Kisari Mohan Ganguli
- The Geography of India: Sacred and Historic Places. Britannica Educational Publishing.
- Pages using the JsonConfig extension
- Pages using infobox country with unknown parameters
- మిథిల
- రాజవంశాలు
- రామాయణంలో రాజ్యాలు
- చారిత్రక భారతీయ ప్రాంతాలు
- బీహార్ చరిత్ర
- భారతదేశంలోని మిథిలలో ఉన్న ప్రాంతాలు
- భారతదేశం 13 వ శతాబ్దం బిసి
- భారతదేశం 12 వ శతాబ్దం బిసి
- భారతదేశం 11 వ శతాబ్దం బిసి లో
- భారతదేశం 7 వ శతాబ్దం బిసి భాతదేశంలో
- భారతదేశం 6 వ శతాబ్దం బిసి
- ఆసియాలో 15 వ శతాబ్దం బిసి స్థాపనలు
- భారతదేశం 6 వ శతాబ్దం బిసి వినాశనాలు
- హిందూమతం