Jump to content

వినయ్ కోర్

వికీపీడియా నుండి
వినయ్ విలాస్‌రావ్ కోర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
ముందు సత్యజిత్ పాటిల్
నియోజకవర్గం షాహువాడి

పదవీ కాలం
2008 డిసెంబర్ 8 – 2009 నవంబర్ 6

పదవీ కాలం
1999 – 2014
తరువాత సత్యజిత్ పాటిల్
నియోజకవర్గం షాహువాడి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జన్ సురాజ్య శక్తి
ఇతర రాజకీయ పార్టీలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

వినయ్ విలాస్‌రావ్ కోర్ (సావ్కార్) (జననం 1971) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సంప్రదాయేతర ఇంధనం & ఉద్యానవన, ఉపాధి హామీ శాఖ మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

వినయ్ కోర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 1999లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పన్హాలా శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత ఎన్‌సీపీని వీడి స్వంత పార్టీ జన్ సురాజ్య శక్తిని స్థాపించి 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పన్హాలా శాసనసభ నియోజకవర్గం నుండి జన్ సురాజ్య శక్తి అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

వినయ్ కోర్ 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో షాహువాడి శాసనసభ నియోజకవర్గం నుండి జన్ సురాజ్య శక్తి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సత్యజిత్ పాటిల్‌పై 8,311 ఓట్ల తేడాతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అశోక్ చవాన్ మంత్రివర్గంలో 2008 డిసెంబర్ 8 నుండి 2009 నవంబర్ 6 వరకు సంప్రదాయేతర ఇంధనం & ఉద్యానవన, ఉపాధి హామీ శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో శివసేన అభ్యర్థి సత్యజిత్ పాటిల్‌ చేతిలో 388 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.[2][3]

వినయ్ కోర్ 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో షాహువాడి శాసనసభ నియోజకవర్గం నుండి జన్ సురాజ్య శక్తి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సత్యజిత్ పాటిల్‌పై 27,863 ఓట్ల తేడాతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఆయన ఆ తరువాత 2024లో జరిగిన ఎన్నికలలో శివసేన (యుబిటి) అభ్యర్థి సత్యజిత్ పాటిల్‌పై 36,053 ఓట్ల తేడాతో గెలిచి ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. India Today (30 October 2019). "Maharashtra: Shahuwadi MLA Vinay Kore extends support to BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
  2. The Times of India (15 October 2019). "Satyajit Patil and Vinay Kore set for big clash at Shahuwadi". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
  3. The Times of India (29 September 2019). "Kolhapur: Vinay Kore's Jansurajya party to field candidates on two seats". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
  4. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Shahuwadi". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.