Jump to content

సత్యజిత్ పాటిల్

వికీపీడియా నుండి
వినయ్ విలాస్‌రావ్ కోర్

పదవీ కాలం
2014 – 2019
ముందు వినయ్ కోర్
నియోజకవర్గం షాహువాడి

పదవీ కాలం
2004 – 2009
తరువాత గైక్వాడ్ సంజయ్‌సింహ జయసింగరావు
నియోజకవర్గం షాహువాడి

వ్యక్తిగత వివరాలు

జననం 1970 జులై 4
కొల్హాపూర్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన (యుబిటి)
వృత్తి రాజకీయ నాయకుడు

సత్యజీత్ పాటిల్ సరుద్కర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన షాహువాడి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సత్యజిత్ పాటిల్ శివ సేన పార్టీ] ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో షాహువాడి శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కర్న్‌సిన్హ్ సంజయ్‌సిన్హ్ గైక్వాడ్ పై 6475 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జన్ సురాజ్య శక్తి పార్టీ అభ్యర్థి వినయ్ కోర్ చేతిలో 8,311 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]

సత్యజిత్ పాటిల్ 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో షాహువాడి శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జన్ సురాజ్య శక్తి పార్టీ అభ్యర్థి వినయ్ కోర్ పై 388 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2019, 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జన్ సురాజ్య శక్తి పార్టీ అభ్యర్థి వినయ్ కోర్ చేతిలో ఓడిపోయాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (15 October 2019). "Satyajit Patil and Vinay Kore set for big clash at Shahuwadi". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
  2. The Times of India (29 September 2019). "Kolhapur: Vinay Kore's Jansurajya party to field candidates on two seats". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
  3. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  4. Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Shahuwadi". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.