వినీత్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వినీత్ కుమార్
జననం
వినీత్ కుమార్

(1957-02-22) 1957 ఫిబ్రవరి 22 (వయసు 67)
పాట్నా, బీహార్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1970 వ దశకం – ప్రస్తుతం
జీవిత భాగస్వామిమనోరంజన్ ధలీవాల్ (1998–ప్రస్తుతం)

వినీత్ కుమార్ (జననం: ఫిబ్రవరి 22 1969) ఒక భారతీయ సినీ నటుడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా విద్యార్థియైన వినీత్ కుమార్ హిందీ, ఇంగ్లీషు, తెలుగు సినిమాల్లోనూ, టీవీ కార్యక్రమాల్లోనూ నటించాడు. తెలుగులో ఆయనకు పేరు తెచ్చిన సినిమా రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు.[1][2]

వ్యక్తిగతం

[మార్చు]

వినీత్ కుమార్ ఫిబ్రవరి 22, 1969 న బీహార్ లోని పాట్నాలో జన్మించాడు. పాట్నా కాలేజియేట్ స్కూల్లో ప్రాథమిక విద్యనభ్యసించాడు. పాట్నాలోని బి. ఎన్. కాలేజీలో గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకున్నాడు. కళాశాల రోజుల్లో నాటకాల్లో బాగా పాల్గొనేవాడు. ఆ ఆసక్తితో 1973 లో ఇండియన్ పీపుల్ థియేటర్ అసోషియేషన్లో చేరాడు. 14 సంవత్సరాలు నాటకరంగంలోనే గడిపాడు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హయాంలో జాతీయ రాజకీయాల్లో కూడా పాల్గొన్నాడు. తరువాత ఢిల్లీ లోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి రంగస్థల కళల మీద మాస్టర్స్ డిగ్రీ చేశాడు.

వినీత్ ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య పేరు మనోరంజన్ ధనీవాల్. ఆమె సౌదీ అరేబియా, రియాద్ లోని ప్రిన్సెస్ నౌరా విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నది. వినీత్ కు ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఉంది. వినీత్ అన్న సునీత్ కుమార్ బీహార్ క్యాడర్ కు చెందిన ఐపీయస్ అధికారి. ప్రస్తుతం బీహారు రాష్ట్ర డీజీపీగా పనిచేస్తున్నాడు.

నటించిన తెలుగు సినిమాలు, ధారావాహికలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
2019 చాణక్య[3][4] కరాచీ ట్రాన్స్ పోర్టు కీమషనర్ మహ్మద్ ఆలీ ఖాన్
2020 బొంభాట్
2016 సుప్రీమ్
2015 శివం
2014 ఆగడు నాగరాజు
2013 నాయక్ దాసు
2011 కందిరీగ
2010 రామ రామ కృష్ణ కృష్ణ పవార్
2006 విక్రమార్కుడు బావూజీ


సంవత్సరం ధారావాహిక అసలు పాత్ర ఛానెల్ పురస్కారాలు బుద్ధి
2016 - 2017 ఏమాయ చేసావె జానా నా దిల్ సే దూర్ (హిందీ) కైలాశ్ కశ్యప్ స్టార్ మా చెడు పాత్రలో ఇష్టమయిన వాడు (ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు [5] చెడు

మూలాలు

[మార్చు]
  1. "National School of Drama alumni list of 1989". Archived from the original on 2010-12-07. Retrieved 2016-09-27.
  2. "Vineet's mantra of success". Archived from the original on 2015-08-12. Retrieved 2016-09-27.
  3. "Gopichand dons a spy's hat for his upcoming film Chanakya". Times of India. 9 June 2019. Retrieved 7 January 2020.
  4. "Chanakya: Gopichand, Mehreen Pirzada's upcoming Telugu spy thriller gets a title and logo- Entertainment News, Firstpost". firstpost.com. Archived from the original on 1 July 2019. Retrieved 7 January 2020.
  5. Mulla, Zainab (December 3, 2016). "ITA Awards 2016 full winners list: Divyanka Tripathi Dahiya, Mouni Roy, Karan Patel, Rubina Dilaik win top honours". India News, Breaking News | India.com.

బయటి లింకులు

[మార్చు]