విలియం పెల్ బార్టన్
సర్ విలియం పెల్ బార్టన్ కెసిఐఇ , సిఎస్ఐ | |
---|---|
దస్త్రం:Sir William Pell Barton.jpg | |
జననం | 1871 మే 29 |
మరణం | 1956 నవంబరు 28 | (వయసు 85)
జాతీయత | బ్రిటీషు |
విద్య | బెడ్ఫర్డ్ మోడ్రన్ స్కూల్ |
విశ్వవిద్యాలయాలు | వోర్చెస్టర్ కళాశాల (ఆక్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం) యూనివర్సిటీ కాలేజీ, లండన్ |
సర్ విలియం పెల్ బార్టన్, కెసిఐఇ, సిఎస్ఐ (29 మే 1871-28 నవంబర్ 1956) బ్రిటీషు పాలనలో, భారత రాజకీయ సేవలో విశిష్టమైన కృషిని చేశాడు.[1][2] ఈయన బరోడా (1919), మైసూరు (1919-1925), హైదరాబాదు (1925-1930) మొదలైన సంస్థానాల్లో బ్రిటీషు రెసిడెంటుగా పనిచేశాడు. భారతదేశంలో బ్రిటిష్ పాలన రోజుల్లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ (వాయువ్య సరిహద్దు ప్రాంతం) తో పాటు, స్థానిక సంస్థానాలపై నిపుణుడిగా ప్రసిద్ధి చెందాడు.[1][2] రాజకీయ సేవలో ఉద్యోగ విరమణ తరువాత అతను సంస్థానాల చరిత్రకారుడిగా పనిచేశాడు. భారతదేశం, పాకిస్తాన్లకు సంబంధించిన విషయాలపై పత్రికలలో తరచుగా రచనలు చేశాడు.[1][2]
ప్రారంభ జీవితం
[మార్చు]విలియం పెల్ బార్టన్ నార్తాంప్టన్‌కు చెందిన విలియం, సారా బార్టన్‌ల కుమారుడిగా 29 మే 1871న నార్తాంప్టన్‌లో జన్మించాడు.[1][3] అతను బెడ్‌ఫోర్డ్ మోడరన్ స్కూల్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వోర్చెస్టర్ కళాశాల, యూనివర్శిటీ కాలేజ్ లండన్లలో చదువుకున్నాడు.[1][4]
వృత్తి జీవితం
[మార్చు]1893లో ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఇంగ్లాండ్ నుండి పంజాబ్కు బయలుదేరాడు.[1] అతను వాయువ్య సరిహద్దు ప్రాంతంలో అనేక జిల్లాలకు పాలనాధికారిగా ఉన్నాడు. ఆ తరువాత భారత రాజకీయ సేవకు బదిలీ అయ్యి, ప్రారంభంలో దిర్, స్వాత్, చిత్రాల్ సంస్థానాలలో రాజకీయ ఏజెంట్గా పనిచేశాడు.[1]
1911లో, బార్టన్ అప్పటి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ చీఫ్ కమిషనర్ అయిన సర్ జార్జ్ రూస్-కెప్పెల్ కు కార్యదర్శిగా నియమించబడ్డాడు.[1] 1915 నాటికి ఆయన నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ యొక్క జ్యుడీషియల్ కమిషనర్గా ఉన్నాడు. 1919లో కొంతకాలం బరోడా సంస్థానంలో బ్రిటిష్ రెసిడెంట్‌గా ఉన్నాడు. ఆ తరువాత ఫ్రాంటియర్‌కు తిరిగి వచ్చి, అక్కడ ఆయన చిన్న ఆఫ్ఘన్ యుద్ధంలో రాజకీయ సేవలను చేపట్టాడు. వజీరిస్తాన్ ఫీల్డ్ ఫోర్స్‌లో ప్రధాన రాజకీయ ఏజెంటు అయ్యాడు.[1]
1920 నుండి 1925 మధ్య, బార్టన్ మైసూరు రాజ్యంలో బ్రిటిష్ రెసిడెంట్‌గా, కూర్గ్ ప్రాంతానికి చీఫ్ కమిషనర్‌గా పనిచేశాడు.[1][5] 1925లో ఆయన హైదరాబాదు రాజ్యంలో బ్రిటిష్ రెసిడెంట్‌గా నియమించబడ్డాడు. ఆ సమయంలో ఆయన రాచరిక సంస్థానాలతో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాడు. హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి సర్ అక్బర్ హైదరీతో కూడా మంచి సంబంధాలు ఏర్పరచుకున్నాడు.[1] "ఈ సామర్థ్యాలన్నింటిలో ఆయన నెమ్మదైన విధానం, సహజమైన దయ,, విచక్షణతో కూడిన తీర్పు, ధృడమైన ఉద్దేశ్యపూర్వకత ముడిపడి ఉన్నాయి" అని ది టైమ్స్ పత్రిక ఆయన సంస్మరణలో పేర్కొంది.[1]
బార్టన్, 1927లో ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ నైట్ కమాండర్ పురస్కారంతో సత్కరించబడ్డాడు.[2][6]
రచనలు
[మార్చు]రాజకీయ సేవను విరమణ పొందిన తర్వాత ఆయన రాచరిక సంస్థానాల చరిత్రకారుడిగా పనిచేశాడు. భారత, పాకిస్తాన్ విషయాలపై పత్రికలలో తరచూ రచనలు చేశాడు.[1]
కుటుంబ జీవితం
[మార్చు]బార్టన్, ఎవెలిన్ ఆగ్నెస్ హెరిజ్-స్మిత్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[1] ఈయన 28 నవంబర్ 1956న సస్సెక్స్ లోని ఆర్డింగ్లీలోని తన ఇంటిలో మరణించాడు.[1]
ఈయన కుమార్తెలలో ఒకరైన ఎలిజబెత్ విడాల్ బార్టన్, ప్రముఖ చారిత్రక జీవితచరిత్రల రచయిత్రి.[7] ఈమె, సర్ రిచర్డ్ హామిల్టన్, 9 వ బారోనెట్‌ను వివాహం చేసుకున్నది.[7]
ఎంపిక చేసిన రచనలు
[మార్చు]- ది ప్రిన్ స్ ఆఫ్ ఇండియా. (ఆంగ్లం) ప్రచురణ నిస్స్బెట్ & కో, లండన్, 1934 [8]
- ఇండియాస్ నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ (ఆంగ్లం). ప్రచురణ జాన్ ముర్రే , లండన్, 1939 [9]
- ఇండియాస్ ఫేట్‌ఫుల్ అవర్ (ఆంగ్లం). ప్రచురణ జాన్ ముర్రే, లండన్, 1942 [10]
మూలాలు
[మార్చు]- ↑ 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 1.12 1.13 1.14 Obituary, Sir W. Barton, The Times, 29 November 1956, p.15
- ↑ 2.0 2.1 2.2 2.3 "Barton, Sir William (Pell), (1871–28 Nov. 1956), late Indian Political Department". WHO'S WHO & WHO WAS WHO. 2007. doi:10.1093/ww/9780199540884.013.U234501. ISBN 978-0-19-954089-1.
- ↑ England Census, 1881
- ↑ Bedford Modern School of the Black and Red, by A.G. Underwood (1981)
- ↑ Truhart, Peter (January 2003). Asia & Pacific Oceania. De Gruyter. ISBN 9783110967463. Retrieved 29 June 2015.
- ↑ THE EDINBURGH GAZETTE, JANUARY 4, 1927, p. 5
- ↑ 7.0 7.1 "Sir Richard Hamilton, Bt". The Daily Telegraph. 3 October 2001. Retrieved 29 June 2015.
- ↑ The princes of India, with a chapter on Nepal. OCLC 2604747.
- ↑ India's north-west frontier. OCLC 2775044.
- ↑ India's fateful hour. OCLC 2290899.