Jump to content

విష్ణు దయాళ్ రామ్

వికీపీడియా నుండి
విష్ణు దయాళ్ రామ్
విష్ణు దయాళ్ రామ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1 సెప్టెంబర్ 2014
నియోజకవర్గం పాలము

పదవీ కాలం
4 ఆగస్టు 2007 – 13 జనవరి 2010

వ్యక్తిగత వివరాలు

జననం (1951-07-23) 1951 జూలై 23 (వయసు 73)
నైనిజోర్, బక్సర్, బీహార్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి శ్రీమతి పుష్ప దయాళ్
సంతానం 3
నివాసం రాంచీ, జార్ఖండ్, భారతదేశం
పూర్వ విద్యార్థి నెటార్‌హాట్ రెసిడెన్షియల్ స్కూల్, పాట్నా కాలేజ్
వృత్తి సివిల్ సర్వెంట్
మూలం [1]

విష్ణు దయాళ్ రామ్, జార్ఖండ్ మాజీ డైరెక్టర్ జనరల్ పోలీస్, భారతీయ రాజకీయ నాయకుడు[1].

వ్యక్తిగత జీవితం

[మార్చు]

విష్ణు దయాళ్ రామ్ 1951 జూలై 23న బీహార్‌లోని నైనిజోర్‌లో ముఖా రామ్, రమరతీ దేవి దంపతులకు జన్మించాడు. ఇతను బీహార్ కేడర్‌కు చెందిన 1973 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, 2005 జూలై 1 నుండి 2006 సెప్టెంబరు 27, 2007 ఆగస్టు 4 నుండి 2010 జనవరి 13 వరకు రెండుసార్లు జార్ఖండ్ పోలీస్ విభాగంలో డిజిపిగా పనిచేశాడు[2]. అతను అంతకు ముందు భాగల్పూర్ ఎస్పీగా, పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేశాడు. ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం 'గంగాజల్' విష్ణు దయాళ్ రామ్ జీవితం ఆధారంగా తీశారు[3].

రాజకీయాలు

[మార్చు]

పదవీ విరమణ తర్వాత, ఇతను భారతీయ జనతా పార్టీలో చేరాడు, 2014 లోక్‌సభ ఎన్నికల్లో పాలము (లోక్‌సభ నియోజకవర్గం) నుండి గెలిచాడు. మళ్లీ 17వ లోక్‌సభ ఎన్నికలలో అదే స్థానం నుండి గెలుపొందాడు[3].

ఇతను పార్లమెంటరీ కమిటీలలో కూడా పనిచేశాడు.

  • నీటి వనరులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • మెంబర్, కన్సల్టేటివ్ కమిటీ, బొగ్గు మంత్రిత్వ శాఖ సభ్యుడు
  • విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో భద్రతపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు
  • హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • రూల్స్ కమిటీ సభ్యుడు

మూలలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Members : Lok Sabha". 164.100.47.194. Retrieved 2022-09-03.
  2. "Ex-DGP Ram & 2 more IPS officers retire | Ranchi News - Times of India". The Times of India. Retrieved 2022-09-03.
  3. 3.0 3.1 "Former 'Gangajal' top cop Ram joins BJP | Ranchi News - Times of India". The Times of India. Retrieved 2022-09-03.