వి.ఆర్. విద్యార్థి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి.ఆర్. విద్యార్థి (వేలూరి రాములు)
V. R. Vidyarthi 1.jpg
జననంవేలూరి రాములు విద్యార్థి
అక్టోబర్‌ 8 1945
భారతదేశం గవిచర్ల, సంగెం మండలం, వరంగల్ జిల్లా తెలంగాణ
నివాస ప్రాంతంవరంగల్ జిల్లాలోని గవిచర్ల గ్రామం, తెలంగాణ
వృత్తికవి, సాహితీవేత్త, సైనికుడు

వి.ఆర్. విద్యార్థి అసలు పేరు వేలూరి రాములు ఇతను కవి, సైనికుడు.[1]

బాల్యం[మార్చు]

వి.ఆర్. విద్యార్థి 1945 అక్టోబర్‌ 8న వరంగల్ జిల్లాలోని సంగెం మండలం గవిచర్ల గ్రామంలో జన్మించాడు. అసలు పేరు వేలూరి రాములు విద్యార్థి కాని సాహితి లోకానికి విఆర్‌ విద్యార్థిగా సుపరిచితులు.

జీవిత విశేషాలు[మార్చు]

వి.ఆర్. విద్యార్థి 1960లో సైన్యంలో చేరారు. 1965లో ఇండో-పాక్‌, 1971లో బంగ్లాదేశ్‌ యుద్ధాల్లో పాల్గొన్నారు. విద్యార్థి వాయుసేనలో పని చేస్తు 1978లో జిడ్డు కృష్ణమూర్తి ప్రభావంతో పూర్తిస్థాయి కవిత్వ సైనికుడిగా మారడానికి నిశ్చయించుకుని సైన్యంలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సుమారు ఐదు దశాబ్దాలుగా సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆయన కవిత్వం ఉర్దూలో, ఇంగ్లీషులో, హిందీలో ఆయన సాహిత్యం అనువాదమయ్యేవి.

కవితా సంపుటాలు[మార్చు]

కాళోజీ రామేశ్వరరావు, కాళోజీ నారాయణరావు గార్లతో వి.ఆర్.విద్యార్థి
 • 1960లో సైనికుడా... ఓ సైనికుడా... హిమాలయ కొండల్లో, కొంకర్లు పోయే చలిలో సైనికుడా... ఓ సైనికుడా అంటూ తన మొదటి కవిత రాశారు.
 • అలలు ,
 • పలకరింత
 • ఘర్మ సముద్రం
 • మంచుమైదానం
 • ఖ్డంఆంతర,
 • యుద్దం,
 • తుపాకి శాంతి,
 • సైనికుడి ఉత్తరం,
 • బహురూపి,
 • పునాది,
 • మాకోసం,
 • మనవాళ్ళు,
 • ఏ యుద్దం? ఎవరి కోసం,
 • సైనికుడి చరణ ముద్రలు,
 • ఒకడు ఇంకొకడూ

మరెన్నో కవితలు ఆయన కలం నుండి జాలువారాయి. ఈ విధంగా 300 కవితలకుపైగా విద్యార్థి కలం నుండి వెలువడి ఆయనలోని రచనా పిపాసను చాటాయి.

పురస్కారాలు[మార్చు]

పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహీత..

మూలాలు[మార్చు]

 1. వీ.ఆర్. విద్యార్థి. "కవి, సైనికుడు, విద్యార్థి... వేలూరి రాములు". navatelangana.com. నవతెలంగాణ. Retrieved 21 September 2017.