వి. ప్రభాకర్ చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి.ప్రభాకర్ చౌదరి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
ముందు బి. నారాయణ రెడ్డి
తరువాత అనంత వెంకట రామిరెడ్డి
నియోజకవర్గం అనంతపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత భారతీయుడు
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు వి. వెంకట సుబ్బయ్య
జీవిత భాగస్వామి .వి. విజయ లక్ష్మి
నివాసం రామ్ నగర్‌, అనంతపురం

వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అనంతపురం నియోజకవర్గం నుండి 2014లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

వి. ప్రభాకర్ చౌదరి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2004లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. వి. ప్రభాకర్ చౌదరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు.

ఎన్నికల్లో పోటీ

[మార్చు]
సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
2019 అనంత వెంకట రామిరెడ్డి వైసీపీ 88704 వి. ప్రభాకర్ చౌదరి టీడీపీ 60006
2014 వి. ప్రభాకర్ చౌదరి టీడీపీ 74704 బి. గురునాథరెడ్డి వైసీపీ 65370
2004 బి. నారాయణ రెడ్డి కాంగ్రెస్ 76059 వి. ప్రభాకర్ చౌదరి స్వతంత్ర అభ్యర్థి (మూడో స్థానం) 24084
1999 బి. నారాయణ రెడ్డి కాంగ్రెస్ 60116 వి. ప్రభాకర్ చౌదరి టీడీపీ 56651

మూలాలు

[మార్చు]
  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.