వీర్ సావర్కర్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీర్ సావర్కర్
దర్శకత్వంవేద్ రహి
నిర్మాతసుధీర్ ఫడ్కే
సంగీతంసుధీర్ ఫడ్కే
విడుదల తేదీ
2001 నవంబరు 16 (2001-11-16)
దేశంభారతదేశం
భాషహిందీ

వీర్ సావర్కర్ – ఒక భారతీయ రాజకీయవేత్త, కార్యకర్త, రచయిత అయిన వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన హిందీ[1] చలన చిత్రం. ప్రజా విరాళాల ద్వారా నిధులు సమకూర్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి చిత్రం.

నిర్మాణం[మార్చు]

ఈ చిత్రాన్ని సుధీర్ ఫడ్కే[2] అధ్యక్షతన సావర్కర్ దర్శన్ ప్రతిస్థాన్[3] నిర్మించారు. దీని నిర్మాత సుధీర్ ఫడ్కే సంగీతం కూడా అందించారు. వేద్ రహి దర్శకత్వం వహించారు. ప్రభాకర్ మోనే చీఫ్ ప్రొడక్షన్ కంట్రోలర్. ఇది 16 నవంబర్ 2001న ముంబై, న్యూఢిల్లీ, నాగ్‌పూర్ లతో పాటు దేశంలోని మరో ఆరు నగరాల్లో ప్రదర్శించబడింది.[4] ఈ చిత్రం గుజరాతీ భాషలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ 28 మే 2012న విడుదల చేశారు.[5] ఈ చిత్రం డివిడి ఫార్మాట్ లో విడుదల చేయబడింది.

ఈ సినిమాకు ఆర్థిక వనరులు సమకూర్చడంలో మొదటి సహకారంగా లతా ముకదాం స్వచ్చందంగా బంగారు కంకణాలను అందించింది.[6] 18 సెప్టెంబర్ 2001 టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ఆధారంగా పదివేల కంటే ఎక్కువ మంది ఐదు నుంచి యాభై లక్షల రూపాయల వరకు విరాళంగా ఇచ్చారు. అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి స్వయంగా యుఎస్‌లో ఉపన్యాసం ఇవ్వడం ద్వారా రూ. 30 లక్షలు విరాలాలు సేకరించపడ్డాయి. ప్రముఖ గాయకులు ఆశా భోంస్లే, భీమ్సేన్ జోషి, అనుప్ జలోటా కూడా నిధుల సేకరణలో సహాయం చేసారు.[7] ప్రపంచంలోనే ప్రజా విరాళాల ద్వారా నిధులు సమకూర్చి నిర్మించిన మొట్టమొదటి సినిమా అని Rediff.com ప్రకటించింది.[8][9]

ఈ సినిమా సిల్వర్ జూబ్లీని ముంబైలోని ప్లాజా సినిమా, పూణేలోని ప్రభాత్ సినిమా రన్‌లో జరుపుకుంది.[10] గోవా ప్రభుత్వం ఈ చిత్రానికి "పన్ను రహిత హోదా" ఇచ్చింది.[11] 70వ భారతీయ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, డిఫెన్స్ మినిస్ట్రీ సంయుక్తంగా సమర్పించిన స్వాతంత్ర్య దినోత్సవ చలన చిత్రోత్సవంలో భాగంగా 13 ఆగస్ట్ 2016న ఈ చిత్రం ప్రదర్శించబడింది.[12]

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. imdb. "Veer Savarkar (2001)". Retrieved 2009-01-26.
  2. "Historic delay hits Savarkar film". The Indian Express (Online). New Delhi: The Indian Express Limited. 1998-09-30. Retrieved 29 May 2012.[permanent dead link]
  3. "Narendra Modi dedicates Gujarati version of Veer Savarkar film". DNA (Online). Mumbai: Diligent Media Corporation Ltd. 2012-05-28. Retrieved 29 May 2012.
  4. Chaware, Dilip (2001-10-23). "After delays, Veer Savarkar to premier on Nov 16". The Times of India. Mumbai. Archived from the original on 2012-10-23. Retrieved 29 May 2012.
  5. "Narendra Modi dedicates Gujarati version of Veer Savarkar film". DNA (Online). Mumbai: Diligent Media Corporation Ltd. 2012-05-28. Retrieved 29 May 2012.
  6. Ail, Rashmi (2001-11-27). "'Vajpayeeji helped me make this film'". rediff MOVIES. Mumbai: Rediff.com. Retrieved 9 June 2012.
  7. "First ever film on Veer Savarkar to be released". The Times of India. Mumbai. 2001-09-18. Archived from the original on 2013-01-04. Retrieved 9 June 2012.
  8. Fernandes, Vivek (2001-09-06). "Cut to cut". Mumbai: Rediff.com. Retrieved 29 May 2012.
  9. N, Anjum (2001-11-30). "A portrait of a patriot". rediff MOVIES. Mumbai: Rediff.com. Retrieved 9 June 2012.
  10. Chaware, Dilip (2002-05-27). "War cries echo at film bash". The Times of India. Mumbai. Archived from the original on 2013-12-14. Retrieved 9 June 2012.
  11. Kumar, Vidyut (2002-08-30). "Veer Savarkar film given tax free status". The Times of India (online). Mumbai: Bennett, Coleman & Co. Ltd. Retrieved 29 May 2012.
  12. "70th Independance Day" (PDF). dff.nic.in.{{cite web}}: CS1 maint: url-status (link)