భారతీయ వెయ్యి రూపాయల నోటు
స్వరూపం
(వెయ్యి రూపాయల నోటు నుండి దారిమార్పు చెందింది)
(భారతదేశం) | |
---|---|
విలువ | ₹1000 |
వెడల్పు | 177 mm |
ఎత్తు | 73 mm |
భద్రతా లక్షణాలు | రక్షణ దారం, గుప్త చిత్రం, మైక్రో అక్షరాలు, ఇంటాగ్లియో ప్రింట్, ఫ్లోర్‌సెంట్ ఇంకు, ఆప్టికలీ వారియబుల్ ఇంకు, వాటర్ మార్కు. |
కాగితం రకం | ప్రత్తిలో ప్రత్యేక రకం, లినెన్, అబక, ఫైబర్ |
ముద్రణా సంవత్సరాలు | నవంబరు 2000 – నవంబరు 2016 |
ముఖభాగం | |
రూపకల్పన | మోహన్ దాస్ కరంచంద్ గాంధీ |
డిజైన్ తేదీ | 2000 |
వెనుకభాగం | |
రూపకల్పన | భారతీయ ఆర్థికం |
డిజైన్ తేదీ | 2000 |
భారతీయ కరెన్సీ యొక్క బ్యాంకునోటు నామవర్గీకరణ (డినామినేషన్) లో వెయ్యి రూపాయల నోటు ఒకటి. మొట్టమొదటి సారి 1954వ సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయ్యి రూపాయల విలువ కలిగిన నోట్లను ప్రవేశపెట్టింది. లెక్కలోనికి రానట్టు వంటి నల్లధనంను నియంత్రించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు తయారు చేసిన నోట్లలో నామవర్గీకరణ ప్రకారం అత్యధిక విలువ కలిగిన వెయ్యి, ఐదువేలు, పదివేల రూపాయల విలువ కలిగిన నోట్లను 1978 జనవరిలో చలామణి కాకుండా రద్దు చేసింది. త్వరితగతిన ద్రవ్య సప్లయ్ కి అవసరమయిన పెద్దనోట్లను చలామణిలో ఉంచడం ద్వారా ద్రవ్యోల్బణం నుంచి గట్టెకవచ్చని భావించిన భారతీయ రిజర్వ్ బ్యాంకు 2000 సంవత్సరంలో తిరిగి వెయ్యి రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది.