భారతీయ ఒక రూపాయి నోటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వివిధ రకాల ఒక్క రూపాయి నాణేలు

భారతదేశంలో అధికారక మారక ద్రవ్యంగా ఉపయోగించే వివిధ ద్రవ్య నోట్లలో ఒక రూపాయి నోటుకి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశంలో ఉపయోగించే ఒక రూపాయి నోటు మీద తప్పక మిగతా అన్ని ద్రవ్య మారక నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించబడి ఉంటే ఒక రూపాయి నోటుపై మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ముద్రించబడి ఉంటుంది. అలాగే రూపాయి నోటు మీద తప్పక మిగతా నోట్లపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటే ఒక రూపాయి నోటు పై సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సంతకం ఉంటుంది. రెండు రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ విలువగల కరెన్సీ నోట్లు భారత రిజర్వ్ బ్యాంక్ ఆధీనంలోకి రాగా ఒక రూపాయి నోట్లు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటాయి.

20 ఏళ్ళ తరువాత 2015 లో మళ్ళీ ముద్రణ[మార్చు]

దాదాపు 20 ఏళ్ళ తరువాత 2015 లో భారత ప్రభుత్వం మళ్లీ రూపాయి నోటును ముద్రించి చెలామణిలోకి తీసుకొచ్చింది. 2015లో ముద్రించబడిన ఈ కొత్త నోటుపై కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి సంతకం ఉంటుంది. ఈ నోటును 2015 మార్చి 6 న రాజస్థాన్ లోని నాథ్ ద్వారా వద్ద గల శ్రీనాథ్‌జీ ఆలయంలో విడుదల చేశారు. ఈ నోటుకు వాటర్ మార్క్ సంకేతంగా "సత్యమేవ జయతే" అనే అక్షరాలు లేని అశోక స్తంభాన్ని ఉపయోగించారు. నోటు మధ్యలో అంతరంగా అంకెతో పాటు కుడి వైపున దేవనాగరి లిపిలో ముద్రించబడిన "భారత్" అనే అక్షరాలు పైకి కనిపించవు. ఈ నోటును ప్రధానంగా గులాబి, ఆకుపచ్చ రంగులతో రూపొందించారు. ఈ కొత్త రూపాయి నోటు 110 మైక్రాన్ల మందంతో ఉంటుంది.

నోటుపై భాషలు[మార్చు]

రూపాయి నోటుపై ఒక రూపాయి అని తెలియజేసేలా రూపాయి నోటుకు ఒక వైపున (వెనుకవైపున) ఒక లేబుల్ గా భారతీయ భాషలలోని ముఖ్యమైన భాషలలో "ఒక రూపాయ" అని ముద్రించబడి ఉంటుంది. రూపాయి నోటు ముద్రితమైన తొలినాళ్ళలో "ఒక రూపాయ" అని వివిధ భాషలలో తెలియజేసే ఈ లేబుల్ పై తక్కువ భాషలలో ముద్రితమవగా, 1994 లో ముద్రణ నిలిపి వేసే నాటికి 13 భాషలకు చేరుకుంది.

లోటు బడ్జెట్[మార్చు]

కేంద్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంటే వెంటనే రూపాయి నోట్లను ముద్రించి లోటు బడ్జెట్ నుంచి గట్టెకడానికి ఈ అధికారాన్ని కల్పించారు.

ముద్రణా వ్యయం[మార్చు]

ఈ నోట్ల యొక్క ముద్రణ వ్యయం రోజురోజుకి పెరిగిపోవడంతో 1994 నుంచి ఈ నోట్ల యొక్క ముద్రణ నిలిచిపోయింది, రూపాయి నోటు యొక్క ప్రాధాన్యత దృష్ట్యా ముద్రణా వ్యయం ఎక్కువగా ఉన్నను 20 ఏళ్ల తర్వాత 2015 లో మళ్లీ ముద్రణ మొదలెట్టారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

భారతీయ వెయ్యి రూపాయల నోటు

రూపీ - అనేక దేశాలలో ద్రవ్య కొలమానంగా ఉపయోగించే రూపాయి

మూలాలు[మార్చు]

ఈనాడు దినపత్రిక - 10-03-2015 - (చెలామణీలోకి కొత్త రూపాయి నోటు)

బయటి లింకులు[మార్చు]