వెల్ది (రఘునాథపల్లి)
వెల్ది, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలంలోని గ్రామం.[1]
వెల్ది | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°47′17″N 79°15′25″E / 17.787923°N 79.256854°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జనగామ |
మండలం | రఘునాథపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 2,269 |
- పురుషుల సంఖ్య | 1,143 |
- స్త్రీల సంఖ్య | 1,126 |
- గృహాల సంఖ్య | 616 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఇది మండల కేంద్రమైన రఘునాథపల్లి నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జనగామ నుండి 17 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 616 ఇళ్లతో, 2269 జనాభాతో 671 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1143, ఆడవారి సంఖ్య 1126. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 739 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 12. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 578207[3].పిన్ కోడ్: 506244.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి నిడిగొండలో ఉంది.సమీప జూనియర్ కళాశాల రఘునాథపల్లిలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు జనగామలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల జనగామలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు వరంగల్లోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల జనగామలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు వరంగల్లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]వెల్దిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
[మార్చు]మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]వెల్దిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]వెల్దిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 15 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 22 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 2 హెక్టార్లు
- బంజరు భూమి: 31 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 599 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 167 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 465 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]వెల్దిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- బావులు/బోరు బావులు: 465 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]వెల్దిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]గ్రామ విశేషాలు
[మార్చు]కాకతీయుల కాలం నుంచి ఎంతో ప్రసిద్ధి పొందిన శివాలయం ఈ గ్రామంలోని నడిబొడ్డున ఉంది. గ్రామ ప్రారంభంలో ఉన్న పాండవుల గుట్ట ఎంతో చారిత్రక ప్రసిద్ధి చెందింది. భారత ఇతిహాస పురుషులు పాండవులు వనవాస కాలంలో ఈ గ్రామంలోని గుట్టుపైనున్న గుహాలో కొన్ని రోజులు నివాసమున్నారని ప్రతీతి.అందుకే వీటిని పాండవులు గుళ్లు అని స్థానికంగా అంటుంటారు.అక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో చిన్న పిల్లలకు వరద పాశం పోస్తారు. నాడు వనవాస కాలంలో పాండవులు కొర్రలు వండుకొని పాత్రలు లేక ఇక్కడ రాతి బండలపై పాశం పోసుకుని తిన్నారని చెబుతారు. అదే ఆనవాయితీగా నేడు కొనసాగుతోంది. చిన్న పిల్లలు దీన్ని ఒక ఆచారంగా ఆ బండలపై వరద పాశాన్ని పోసుకుని నాకుతారు. ఇదే గుట్టపై బహుజన వీరుడు సర్ధార్ సర్వాయిపాపన్న కొటకట్టుటకు ప్రయత్నించి పునాదులు నిర్మించి వదిలేసిన గుర్తులు నేటికి ఉన్నాయి. తరువాత ఇక్కడ నుంచి కొటను కొండలకు దగ్గరగా ఉంటుందని ఖిలాషాపురంలో నిర్మించారు. నేటికి ఖిలాషాపురం కొటను చూడవచ్చు. అయితే గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయం...నాగమయ్య దేవాలయం ఉన్నాయి. గ్రామంలో నేటి వందల సంవత్సరాల కాలంనాటి అతిపెద్ద మర్రివృక్షం...గద్దలు వాలే ప్రసిధ్ది గాంచిన గద్దగుండు ఉన్నాయి.
పోరాటాల పురిటిగడ్డ....
[మార్చు]వెల్ది గ్రామం పోరాటాల పురిటిగడ్డ..గ్రామంలో సామజిక చైతన్యం ఎక్కువ దొరలు భూస్వాములను ఎదిరించిన చరిత్ర ఈ గ్రామ సొంతం..తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేక మంది యోధులు ఇక్కడ నుంచి పోరాటం చేసినా ఏ ఒక్కరు పెన్సన్ల కోసం... గుర్తింపు నోచుకోని దీనగాధ..సాయుధ పోరాట కాలంలోనే చుక్కా రామయ్య లాంటి వారికి వసతి కల్పించి కాపాడిన ఘన చరిత్ర గ్రామానికి ఉంది....గ్రామంలో 1950-1960 దశాబ్దంలో గ్రామంలో బాపురావు అనే దొర చేసిన ఆరాచకాలను ఇప్పటికి ప్రజలు గుర్తుచేస్తారు.తన అక్క భూముల సంరక్షణ కోసం వచ్చి గ్రామంలో స్థానికి మరో వర్గం దొరలతో గ్రామంలో నిత్యం యుధ్దవాతావరణం సృష్టంచేవాడని అంటారు. చదువుకున్న యువకులను..అందమై ఆడవారిని హింసించే వాడని... కీచకుని లాంటివాడని గుర్తు చేస్తారు. గ్రామంలో పట్టుకోసం.. ఓరోజు గ్రామస్థులు వంటలకు (వనభోజనాలకు) వెళ్లిన సందర్భంలో గ్రామపెద్దలను చంపడానికి హాన్మకొండనుంచి కొందరు గుండాలను తీసుకు వచ్చాడని...దాన్ని గమనించిన గ్రామస్థులు ఏకమై గూండాలని తరిమి ఆయన్ని చంపారని...దానికోసం చాలా మంది జైలుశిక్ష కూడా అనుభవించిన చరిత్ర గ్రామ యువకులది.
సామాజికి...రాజకీయ....ఆర్ధిక.... పరిస్థితి..
[మార్చు]వెల్ది గ్రామంలో అన్ని కులాల వారు ఉన్నారు.రాజకీయంగా అందరూ అన్ని పార్టీల్లో పనిచేస్తున్న ఏనాడు రాజకీయ కక్షలకు తావులేని సామరస్య వాతావరణం ఉంది. గ్రామంలో లక్కామారి కాపులు....గౌడ..యాదవ..మాదిగ..మాల...కులస్తుల జనాభా ఎక్కువ. వీరిదే రాజకీయ అధిపత్యం కూడా....మిగత బీసీ కులాల్లో రజక...ముదిరాజ్...వడ్డైర...పూసల కులస్తులు ఎక్కువగానే ఉన్నారు. అన్ని కులాలు వ్యవసాయంపై ఆధాపపడి జీవిస్తారు.యువత ఎక్కువ సంఖ్యలో వృత్తి నైపుణ్యం ఉన్న రంగాలవైపే మళ్లినారు. వ్యవసాయం పనులు లేనిరోజుల్లో హైదరాబాద్ నగరానికి ప్రతీ రోజు వందల్లో యువత పనులకోసం వచ్చి వెళ్తారు.వడ్డైరలు మాత్రం తమ కుల వృత్తిని నమ్ముకొని నగరాల్లో పనిచేస్తారు. గ్రామంలోని విశ్వకర్మలు..కోమట్లు..వ్యాపారంపై జీవిస్తున్నారు. గ్రామంలోని మంగళ్లు.. (నాయి బ్రాహ్మలు.) పక్కన ఉన్న రఘునాథపల్లికి పూర్తిగా వలసవెల్లారు. గ్రామంలోని మరో సంచార జాతి బుడగజంగాలు పూర్తిగా గ్రామాన్ని వదిలి రఘునాథపల్లిలోనే స్థిరపడ్డారు. అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెల్లి సంపాదించిన డబ్బులో హైదరాబాద్ ...హన్మకోండ మెయిన్ రో్డ్డుపై భవనాలు కట్టి కిరాయికిచ్చి వారి ముందు చూపును చాటుకున్నారు. కోమట్లు కూడా రఘునాథపల్లిలోనే స్థిరపడి వ్యాపారం చేస్తున్నారు. యాదవులు..కుర్మగొల్లలు గొర్రెల పోషణ..వ్యవసాయం చేస్తారు. 1990 దశాబ్దంలో వచ్చిన కరువు అన్ని కులాల్న వారికి కుంగతీస్తే యాదవులు గోర్రెల పెంపకంతో భాగ లాభబడి భూములు కొని లాభపడ్డారు. నాడు కాపులు....ఇతర సాటి బీసీలు అమ్మిన భూములు కొని ఆర్థికంగా భాగా పుంజుకున్నారు. గౌడ కులస్తులు కేవలం కల్లుపైనే ఆధారపడి జీవిస్తారు.చుట్టూ నాలుగైదు గ్రామాలకు ఇక్కడ తయారైన కల్లు ప్రసిద్ధి. అ మంచి పేరే గౌడకులస్తులకు మంచి గిరాకితో కూడిన జీవనాధరంగా కొనసాగుతోంది...కొందరు కల్లుతో పాటు కొద్దిపాటి వ్యవసాయం చేసుకుని మంచిగా జీవిస్తారు. మాదిగ...మాల కులాల్లో పది శాతం మందికి రైల్వే ఉద్యోగాలు ఉండటంతో వారు ఆర్థికంగా నిలదొక్కుకుని వారి పిల్లలను బాగా చదివించగలిగారు. అధిక శాతం మాదిగలు..మాలలు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ..వ్యవసాయ కార్మికులుగా జీవిస్తున్నారు. ఇతర గ్రామాల్లోలాగ వీరికి ప్రభుత్వం సాయం మరింతగా అందాల్సి ఉంది. రజకులు..ముదిరాజ్ కులస్తులు కరువు కాలంలో హైదరాబాద్ నగరానికి వలసవెల్లారు. గ్రామంలోని వారు మాత్రం వ్యవసాయ వృత్తులుచేస్తూ జీవిస్తున్నారు. అయితే పద్మశాలీలు..మాత్రం ముంబాయి..బీమాండి..పోలాపూర్..సూరత్ నగరాలకు వలసవెళ్లారు. అయితే ఊరిలో ఉన్న కొద్ది మందిమాత్రం కులవృత్తి అయిన వస్త్రాల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. నేటి తరం యువత పెద్ద ఎత్తున విద్యాబ్యాసం చేసిన వారు మాత్రం మంచి వృత్తి ఉద్యోగాల్లో స్థిర పడ్డారు.
హైదరాబాద్ లో ప్రధానంగా తార్నాక...బాలానగర్ లోని.. చింతల్...ఐడిపిఎల్ రంగారెడ్డి నగర్...ఎక్కవ మంది స్థిరపడ్డారు. రంగారెడ్డి నగర్..చింతల్ లో ఎక్కవగా నైపుణ్యంతో కూడిన చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి ఎక్కవ మంది ఉపాది పొందుతూ ఇతరులకు ఉపాది ఇస్తున్నారు.తార్నాకలో విద్యార్థులు.. ప్రభుత్వ ...ప్రైవేటు..ఉద్యోగస్తులు..నైపుణ్యం లేని సెక్యూరిటి...ఇల్లలో పనిచేసే వారు స్థిరపడ్డారు..మెహదీపట్నం దగ్గరలోని కర్వాన్ లో పెద్దఎత్తున వడ్డెరలు స్థిరపడ్డారు. వారు మాత్రం..కులవృత్తినే ట్రాక్టర్లతో చేస్తూ నగరంలో ఆర్థిక స్థిరత్వంకోసం పాటుపడుతున్నారు. ఇప్పటికే నగరంలో స్థిరపడ్డవారిలో యాబై శాతం మంది సొంత నివాసాలు ఏర్పరుచుకోగా, మిగతావారు సంపాదించే ప్రయత్నంలో ఉన్నారు...పదోతరగతి చదివి మానేసిన యువత మాత్రం డ్రైవింగ్ వృత్తిగా ఎంచుకుని జీవిస్తున్నారు. ఇప్పుడిప్పుడై వారు కూడా సొంత కార్లు కొని స్థిరపడుతున్నారు.
వ్యవసాయం....
[మార్చు]రెండు వేల ఏకరాలకకు పైగా వ్యవసాయ సాగుభూమి ఉన్న గ్రామంలో ప్రధానంగా వరి..ప్రత్తి..మిరప...నూనేపంటలు పెద్దఎత్తున సాగవుతాయి..వ్యవసాయమంతా బోర్లపైనే ఆధారపడి రైతులు చేస్తారు.ఇప్పుడిప్పుడే గ్రామంలోనికి దేవాదుల మూడో ధశలో భాగంగా వ్యవసాగయ సాగుభూమికి కాలువలు అందుబాటులోనికి వస్తున్నాయి. అవి వస్తై రైతులకు మరింతగా అందుబాటనికి వస్తే వరి పండించే తరి వ్యవసాయం అందుబాటులిని వస్తుంది. గ్రామంలో నాగమయ్య కుంట..ధర్మారెడ్డి చెరువు..బుడుమ కుంట..సన్యాసి కుంటలు ....నిండితే ఎక్కవ వరి పండించే వ్యవసాయం చేస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".