Jump to content

ఖిలాషాపూర్

అక్షాంశ రేఖాంశాలు: 17°47′45″N 79°13′48″E / 17.795939°N 79.229956°E / 17.795939; 79.229956
వికీపీడియా నుండి
ఖిలాషాపూర్
—  రెవెన్యూ గ్రామం  —
ఖిలాషాపూర్ కోట
ఖిలాషాపూర్ కోట
ఖిలాషాపూర్ కోట
ముద్దు పేరు: షాపురం
ఖిలాషాపూర్ is located in తెలంగాణ
ఖిలాషాపూర్
ఖిలాషాపూర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°47′45″N 79°13′48″E / 17.795939°N 79.229956°E / 17.795939; 79.229956
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ
మండలం రఘునాథపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 9,725
 - పురుషుల సంఖ్య 4,930
 - స్త్రీల సంఖ్య 4,795
 - గృహాల సంఖ్య 2,390
పిన్ కోడ్ 506244
ఎస్.టి.డి కోడ్ 08716

ఖిలాషాపూర్, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలంలోని గ్రామం.[1]

ఇది మండల కేంద్రమైన రఘునాథపల్లి నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జనగామ నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2390 ఇళ్లతో, 9725 జనాభాతో 4791 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4930, ఆడవారి సంఖ్య 4795. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1864 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2779. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 578205[3].పిన్ కోడ్: 506244.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల రఘునాథపల్లిలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు జనగామలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల జనగామలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు వరంగల్లోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం హనుమకొండలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల వరంగల్ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ఖిలాషాపూర్ ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో12 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు 10 మంది, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

== సమాచార, రవాణా సౌకర్యాలు ఖిలాషాపూర్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

ఖిలాషాపూర్ భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 97 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 215 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 497 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 2022 హెక్టార్లు
  • బంజరు భూమి: 289 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1668 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 3617 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 363 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

కులేశాపూర్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 363 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

కులేశాపూర్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మొక్కజొన్న, ప్రత్తి

పేర్వారం రాములు

[మార్చు]

మాజీ డిజిపి పేర్వారం రాములు ప్రస్తుతం పర్యాటకం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేయుచున్నారు. తెలంగాణలో కెసిఆర్ ఇష్టపడే వ్యక్తుల్లో పేర్వారం రాములు ఒకరు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఉమ్మడి రాష్ర్టంలో ఎపిపిఎస్సి చైర్మన్ గా కూడా పనిచేశారు.ముక్కుసూటి మనిషిగా పేర్వారం రాములుకు పేరుంది. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే మనస్థత్వం ఆయనది.

పేర్వారం జగన్నాధం ప్రముఖ తెలుగు కవి, విమర్శకులు, విద్యావేత్త. ఖిలాషాపూర్ గ్రామంలో 1934 సెప్టెంబరు 23 న జన్మించారు.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పూర్తి చేసిన జగన్నాథం కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో ఆచార్యులుగాను, వరంగల్లులోని సికెఎం కళాశాలలో ప్రిన్సిపాలు గాను, 1992-95 లలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ గాను పనిచేశారు. 2008 సెప్టెంబరు 29 న వరంగల్ లో మరణించారు.మాజీ డి.జి.పి.పేర్వారం రాములు వీరి సోదరుడు.

వీరి రచనలు.
  • అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు
  • అరె భాషా నిఘంటువు
  • మోర్దోపు దున్న
  • సాహితీ సౌరభం
  • సాగర సంగీతం
  • వృషభ పురాణం
  • గరుడపురాణం
  • శాంతి యజ్ఞం
  • తెలుగులో దేశీయ కవితా ప్రస్థానం
  • ఆరె జానపద గేయాలు
  • నన్నయ భారతి (ప్రథమ సంపుటము) (సంపాదకత్వం - వ్యాస సంకలనం)
  • డా.బాబాసాహెబ్ రచనలు - ప్రసంగాలు (అనువాదం -11 సంపుటాలు) (ప్రధాన సంపాదకత్వం)
  • సాహిత్యావలోకనం

దుడుక నర్సయ్య

[మార్చు]

విశ్రాంత చరిత్రోపన్యాసకులు,ప్రముఖ తెలుగు కవి, విమర్శకులు, విద్యావేత్త. ఖిలాషాపూర్ గ్రామంలో 1948 ఆగస్టు 2 న జన్మించారు.ఎం.ఏ. (హిందీ, ఎం.ఏ. (హిస్టరీ, హిందీ విద్వాన్, సీనియర్ హిందీ పండిట్ ట్రైనింగ్, బి.ఎడ్.తదితర విద్యార్హతలతో హిందీ పండిట్ గ్రేడ్ 2, గ్రేడ్ 1 గా 31 సంవత్సరాల పాటు, హిస్టరీ లెక్చరర్ గా 7 సంవత్సరాల పాటు పనిచేసి 02-08-2006 న పదవీ విరమణ పొందారు.

వీరి రచనలు.
  • భావ చిత్రాలు. (కవితా సంపుటి)
  • మృత సంజీవని. (పౌరాణిక లఘునాటిక)
  • శ్రీ కురవి వీరభద్ర స్వామి చరిత్ర (బుర్రకథ)
  • శ్రీ భక్త మార్కండేయ చరిత్ర (బుర్రకథ)
  • సుజాత (గేయ రచన)
  • వ్యాస భారతి (36 వ్యాసముల సంపుటి)
  • దుర్యోధనుని వర్తమానము (పౌరాణిక లఘునాటిక)
  • బకాసుర వధ (పౌరాణిక లఘునాటిక)
  • శ్రీ భక్త రామదాసు-బంధ విముక్తి (లఘునాటిక)
  • స్పందన (వరంగల్ ఆకాశ వాణి రేడియో ప్రసారిత కవితలు)

గ్రామ చరిత్ర

[మార్చు]

ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వీరుడు సర్వాయి పాపన్న చరిత్రనే ఈ గ్రామ చరిత్ర.

సర్వాయి పాపన్న 1650 ఆగస్టు 18 నేటి జనగాం జిల్లా ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి చిన్న తనం లోనే చనిపోయారు, సర్వమ్మ అతడి తల్లి, పాపడు అని అతన్ని పిలిచేవాడు. పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు, అతను శివున్ని ఆరాధించేవాడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు.

తెలంగాణాలో అంతకంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యాన్ని అంతం చెయ్యాలని, అప్పటి పాలకులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని, అధికారం కాని లేవు. గెరిల్ల సైన్యాన్ని తయారు చేసి, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసి, తన సొంత ఊరు ఖిలాషాపూర్ ని రాజధానిగా చేసుకొని, 1675 లో సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు.

పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికుడు. శివాజీ ముస్లింల పాలనా అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో, పాపన్న కూడా తెలంగాణాలో ముస్లింల పాలనా అంతానికి పోరాడారు. 1687 - 1724 వరకు అప్పటి మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు. పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు నిర్మించాడు. 1678 వరకు తాటికొండ, వేములకొండ లను తన ఆధీనం లోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించాడు.

ఒక సామాన్యవ్యక్తి శతృదుర్భేద్యమైన కోటలను వశపర్చుకోవడం అతని వ్యూహానికి నిదర్శనం. సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు 20 కోటలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని ఆలోచనలకు బెంబేలెత్తిన భూస్వాములు, మొగలాయి తొత్తులైన నిజాములు కుట్రలు పన్ని సైన్యాన్ని బలహీనపర్చారు. 1700 - 1705 మధ్యకాలంలో షా పురలో మరొక దుర్గం నిర్మించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ దాదాపు 12 వేల సైనికులను సమకూర్చుకొని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండకోటను స్వాధీనపర్చుకొని 7 నెలలపాటు అధికారం చెలాయించాడు. తెలంగాణలో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే. అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీంనగర్ జిల్లా లోని హుస్నాబాద్, హుజూరాబాద్ వరకు విస్తరించింది. భువనగిరి కోటను రాజధానిగా చేసుకొని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు.

పాపన్నఒక సాధారణ గౌడ కుటుంబం నుండి వచ్చిన వాడు కనుక అతనికి ప్రజల కష్ట నష్టలన్నీ తెలుసు. అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు. ఖజానా కొరకు అతను జమిందార్, సుబేదార్ లపై తన గెరిల్ల సైన్యంతో దాడి చేయించేవాడు. పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేసాడు. అతని రాజ్యంలో సామజిక న్యాయం పాటించేవాడు. తాటి కొండలో చెక్ డాం నిర్మించాడు. అతను ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజురా బాద్ లో ఎల్లమ్మ గుడి కట్టించాడు. అది నేటికి రూపం మారిన అలానే ఉంది.

పాపన్న గెరిల్ల సైన్యంతో మొగల్ సైన్యం పై దాడి చేస్తున్నాడని ఔరంగజేబుకు తెలిసింది. అతడు రుస్తుం దిల్ ఖాన్ కు బాధ్యతలు అప్పగించాడు. రుస్తుం దిల్ ఖాన్ యుద్ధానికి ఖాసింఖాన్ ను పంపించాడు. షాపుర వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి. నెలలపాటు యుద్ధం జరిగింది. చివరికి రుస్తుం దిల్ ఖాన్ రంగం లోకి దిగాడు. సుమారు 3 నెలలపాటు యుద్ధం జరిగింది. పాపన్న తన ప్రాణ స్నేహితున్ని కోల్పోయాడు. దాంతో ఆయన యుద్ధాన్ని విరమించుకొని, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మొగల్ సైన్యాలు అతని కోసం వెతకడం ప్రారంభించాయి. అయితే పాపన్న తన సొంత ఊరు జనగామకు వెళ్లి అక్కడ గౌడ కులం వారు ఎక్కువగా ఉండే చోట జీవితం గడిపాడు. ఔరంగజేబు మరణించిన తర్వాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీన పాలనను చుసిన పాపన్న 1708 ఏప్రిల్ 1 లో వరంగల్ కోటపై దాడి చేసాడు. అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు. 1708 లో గోల్కొండకు తీసుకెళ్ళి పాపన్న తల తీసి కోట ముఖ ద్వారానికి వేళ్ళాడ దీసారు.[4]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. Namasthe Telangana (3 July 2021). "ఖిలాష‌పూర్ కోట పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌కు మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ శంకుస్థాప‌న‌". Namasthe Telangana. Archived from the original on 3 జూలై 2021. Retrieved 3 July 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]