వేజండ్ల సాంబశివరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేజండ్ల సాంబశివరావు
Vejandla Sambashivarao.png
జననంమే 15, 1926
మోపర్రు, అమృతలూరు మండలం, గుంటూరు జిల్లా
వృత్తిఉపాధ్యాయులు, రంగస్థల కళాకారులు
ప్రసిద్ధితెలుగు రంగస్థల నటుడు.

వేజండ్ల సాంబశివరావు ప్రముఖ రంగస్థల నటులు.

జననం[మార్చు]

సాంబశివరావు 1926, మే 15గుంటూరు జిల్లా, అమృతలూరు మండలంలోని మోపర్రు గ్రామంలో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

సాంబశివరావుని వంకమామిడి రాజయ్య (ఉపాధ్యాయులు) నాటకరంగంలోకి తీసుకువచ్చారు. మల్లాది సూర్యనారాయణ శాస్త్రి, అబ్బూరి వరప్రసాదరావు, సి. రామమోహనరావు, చుండూరు మధుసూదనరావు, కొండ శేషగిరిరావు, దీవి శ్రీమన్నారాయణాచార్యులు, బొమ్మరాజు లక్ష్మీనారాయణ, వి.వి. అప్పలాచార్యులు, తాడిగడప సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలైన నటులతో నటించారు.

వై. సుబ్బారావు, ముద్దా భాస్కరరావు, టి. పాపారావు, ఆంజనేయశర్మ, ఈవూరి సుబ్బారావు వంటి నటులు సాంబశివరావు దగ్గర నటనలో శిక్షణ పొందారు.

నటించిన నాటకాలు - పాత్రలు[మార్చు]

 1. శిశుపాలవధ - శిశుపాలుడు
 2. మైరావణ - మైరావణుడు
 3. దక్షయజ్ఞం - దక్షుడు
 4. వాలిసుగ్రీవ - మాయావి
 5. శ్రీకృష్ణమాయ - వసంతకుడు
 6. స్వామి అయ్యప్ప - మంత్రి
 7. కాంతిమతి - కాంతిమతి
 8. కాలకేతనం
 9. ప్రేమజ్యోతి
 10. హరిశ్చంద్ర
 11. సత్యకీర్తి

సన్మానాలు[మార్చు]

శ్రీ శ్రీనివాస నాట్యమండలి (రేపల్లె), శ్రీ విశ్వవిరాట్ కళాసమితి (చెరుకుపల్లి) వారిచే సన్మానాలు అందుకున్నారు.

మూలాలు[మార్చు]

 • వేజండ్ల సాంబశివరావు, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 328.