మాదాసు నాగయ్య
నాగయ్య | |
---|---|
జననం | 1947 దేచవరం గ్రామం, నకరికల్లు మండలం, గుంటూరు జిల్లా |
మరణం | 2021 మార్చి 27 దేచవరం |
వృత్తి | నటుడు |
వేదం నాగయ్యగా ప్రేక్షకులకు సుపరిచితుడైన మాదాసు నాగయ్య తెలుగు సినిమా నటుడు. అనేక ఆర్ధిక ఇబ్బందులతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగయ్య ఆనతి కాలంలోనే పలు చిత్రాల్లో వివిధ పాత్రలలో నటించాడు.[1] 2021 మార్చి 27న అనారోగ్యంతో మరణించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]మాదాసు నాగయ్య గుంటూరు జిల్లా నకరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందినవాడు. మొదట్లో అతను గొడుగులు అమ్ముకుని జీవించేవాడు. అతను ‘వేదం’ చిత్రంతో ఈయన సినీ పరిశ్రమకు పరిచమయ్యారు.[2] తరువాత 30 చిత్రాలలోనటించాడు. వేదం సినిమాలో అతని నటన మంచు గుర్తింపు పొందింది. ఆ సినిమాలో అతను చెప్పిన సంభాషణ "పద్మ మన పైసలు దొరికాయే.. నీ బిడ్డ సదువుకుంటాడే" ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సినిమాలో చిన్నపాటి రోల్ లో కనిపించినా తన వయసుకు తగ్గ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలోగుర్తింపు పొందిన తరువాత అతను "వేదం" నాగయ్యగా సుపరిచితుడయ్యాడు. అతను కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం దేచవరంలో 2021 మార్చి 27న తన 75 సంవత్సరాల వయస్సులో మరణించాడు. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.[3]
మరణం
[మార్చు]వేదం నాగయ్య భార్య అనారోగ్యంతో కన్నుమూయడంతో మానసికంగా కృంగిపోయిన ఆయన మానసిక బాధతో అనారోగ్యం పాలై గుంటూరు జిల్లా దేచవరంలోని తన నివాసంలో మరణించాడు.[4][5][6]
నటించిన సినిమాలు
[మార్చు]- వేదం (సినిమా)
- రామయ్యా వస్తావయ్యా
- స్పైడర్ (సినిమా)
- నాగవల్లి (2010 సినిమా)
- సీమ టపాకాయ్
- ఒక్కడినే
- అయ్యారే
- గమనం (సినిమా)
- బలుపు
- కల్కి (2019 సినిమా)
- నివాసి
- నువ్వు తోపురా
- జీఎస్టీ
పురస్కారాలు
[మార్చు]వేదం సినిమాలో పల్లెటూరిలో వృద్ధుడిగా ఆయన చేసిన ఆ పాత్రకు నంది అవార్డును అందుకున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Veteran actor Vedam Nagaiah passes away at 77 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-03-28.
- ↑ Sakshi (27 December 2017). "పిలిచి సినిమాల్లోకి రమ్మన్నారు." Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.
- ↑ "'వేదం' నాగయ్య కన్నుమూత". www.eenadu.net. Retrieved 2021-03-28.
- ↑ Eenadu. "'వేదం' నాగయ్య కన్నుమూత". Archived from the original on 2021-03-29. Retrieved 30 November 2021.
- ↑ TV9 Telugu (27 March 2021). "టాలీవుడ్ లో మరో విషాదం.. అనారోగ్యంతో వేదం నాగయ్య కన్నుమూత". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (27 March 2021). "గత పదేళ్లలో దూరమైన సినీ ప్రముఖులు". Archived from the original on 2021-03-27. Retrieved 30 November 2021.
బాహ్య లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మాదాసు నాగయ్య పేజీ