Jump to content

వేదవతి ప్రభాకర్

వికీపీడియా నుండి
వేదవతి ప్రభాకర్
వ్యక్తిగత సమాచారం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిక్లాసికల్ సంగీతం, వోకలిస్టు

వేదవతి ప్రభాకర్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు. [1] ఆమెకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు లలిత సంగీతం లో కీర్తి పురస్కారాన్ని ప్రకటించారు.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె బెంగళూరులో పెరిగింది. కర్ణాటక సంగీతం, గాత్ర సంగీతాలను జి.చెన్నమ్మ దగ్గర శిక్షణ పొందింది. పాలగుమ్మి విశ్వనాథం అనేక మంది లలిత సంగీతకారులకు అవకాశం కల్పించారు. అయితే ఆయన స్వరకల్పన చేసిన, రాసిన ఎక్కువ గీతాలు పాడే అవకాశం, అదృష్టం ఈమెకు లభించింది. లలిత సంగీతం ఎలా పాడాలి, పాడటానికి కావలసిన మెలకువలు, ఈ సంగీతానికి గాత్రాన్ని ఎలా పలికించాలి,మైక్ ఎలా వాడాలి ఇలా ఎన్నో ఆయన ఆమెకు నేర్పించారు.[3] ఈమె ఇంకా మంచాళ జగన్నాథరావు, ఈమని శంకరశాస్త్రి, రజని, అనసూయ మొదలైన స్వరకర్తల సంగీత నిర్వహణలో పాటలు పాడింది. ఈమె 1969 నుండి ఆకాశవాణిలో, 1978 నుండి దూరదర్శన్‌లో అనేక లలిత గీతాలను ఆలపించింది. ఆకాశవాణి భక్తిరంజని కార్యక్రమంలో కూడా అనేక భక్తిగీతాలను పాడింది. సి.నారాయణరెడ్డి రచించిన "మీరా భజనలు" పెండ్యాల సంగీతంలో ఈమె పాడగా హెచ్.ఎం.వి. వారు రికార్డులుగా వెలువరించారు. ఇవే కాక షిర్డీ సాయిబాబా, రాఘవేంద్రస్వామి, జోగులాంబ, రామకృష్ణపరమహంస మొదలైన వారి స్తుతి గీతాలు ఈమె గానం చేయగా క్యాసెట్లుగా విడుదలయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమయ్య గీతాలను ఆయన జయంతికి, వర్ధంతికి తిరుపతిలోను, తాళ్ళపాకలోను పాడగా హిందూ, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ మొదలైన పత్రికలు ఎంతగానో ప్రశంసించాయి. జి.వి.అయ్యర్ దర్శకత్వంలో సంస్కృతంలో తీసిన ఆది శంకరాచార్య సినిమాలో ఈమె పాడింది. ఈమె ఇంగ్లాండు, అమెరికా, కెనడా వంటి దేశాలలో తన గానకౌశలాన్ని ప్రదర్శించి అనేక ప్రశంసలను, సత్కారాలను అందుకుంది. ఢిల్లీలో ఆకాశవాణి వారు ఏర్పాటు చేసిన జాతీయ సంగీత కార్యక్రమంలో ఈమె లలిత భక్తి గీతాలను ఆలపించింది. ఈమెకు "శ్వేతకోకిల" వంటి బిరుదులు లభించాయి[4]. ఈమె భర్త రొద్దం ప్రభాకరరావు ఐ.పి.ఎస్. అధికారి. వారు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో పనిచేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా రిటైర్ అయ్యారు.

లలితగీతాల జాబితా

[మార్చు]

ఈమె పాడిన లలితగీతాల పాక్షిక జాబితా:

గీతం రచన సంగీతం సహ గాయకుడు(లు) ఇతర వివరాలు
ఎవరికున్నది ఇంత శక్తి డా.వేటూరి ఆనందమూర్తి మహాభాష్యం చిత్తరంజన్ 1974 అక్టోబర్ ఈ మాసపు పాట
కొమ్మలో కోయిలనై పూయనా మహాభాష్యం చిత్తరంజన్
విరబూసి యిరుల తరులు మహాభాష్యం చిత్తరంజన్
నా అన్నవారెవరు మహాభాష్యం చిత్తరంజన్
అమ్మదొంగా పాలగుమ్మి విశ్వనాథం పాలగుమ్మి విశ్వనాథం
సుమవనిలో రసధునిలా కోపల్లె శివరాం ఈమని శంకరశాస్త్రి మహాభాష్యం చిత్తరంజన్
శివపాదమునుంచనేను డా.అరిపిరాల విశ్వం పాలగుమ్మి విశ్వనాథం విజయలక్ష్మీ శర్మ
నీలి నీలి గగనంలో ఒక తార మెరిసింది ఫాదర్ మాథ్యూస్ రెడ్డి మహాభాష్యం చిత్తరంజన్ కె.బి.కె.మోహన్ రాజు శివరంజని రాగం

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://www.thehindu.com/arts/music/article1525767.ece
  2. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]
  3. సిటీ ప్లస్, sakshi. "సాక్షి". www.sakshi.com. జగతి పబ్లికేషన్స్. Retrieved 16 June 2016.
  4. ఎం.చిత్తరంజన్ (1 October 2002). "ఎవరికున్నది ఇంత శక్తి". హాసం - హాస్య సంగీత పత్రిక. 2 (1): 18–20. Retrieved 26 March 2018.
  5. "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.

ఇతర లింకులు

[మార్చు]