Jump to content

వేదిక:తెలుగు సినిమా/ఈ వారం బొమ్మ/2015-45వ వారం

వికీపీడియా నుండి
కోడళ్ళకు సింహస్వప్నం, సూర్యకాంతం

గయ్యాళి గంప, అసాధ్యపు అత్తయ్య అనగానే, సగటు తెలుగు సినీ ప్రేక్షకుడికి గుర్తుకు వచ్చేది, సూర్యకాంతం. తన పెడసరివాదంతో ఇంటిల్లిపాదినీ తన చెప్పుచేతలలో, ఆస్తిపాస్తులు తన అధీనంలో ఉంచుకోవాలనే గుండమ్మ పాత్ర చిరస్మరణీయం. కుటుంబ తగాదాల కారకురాలిగా, భార్యగా భర్త పై పెత్తనం చెలాయించే పాత్రలు, కోడలిని వేపుకుతినే అత్తయ్య పాత్రలను అన్నింటినీ సూర్యకాంతం రక్తి కట్టించారు. అందరిలా సూర్యకాంతం డాక్టరవ్వబోయి యాక్టరవ్వలేదు, హీరోయిన్ అవ్వబోయి యాంటీ-హీరోయిన్ అయ్యారు. కొరకొర చూపులు, ఎడమచేయి వాటం, తిండిబోతుతనం, సన్నాయి నొక్కులు, గొంతులో కాఠిన్యం, మొసలి కన్నీరు; అన్నీ వెరసి సూర్యకాంతం. కాస్త అటూ-ఇటూగా అన్ని పాత్రలలోనూ ఇవే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నా, ఆమె నటన ఎన్నటికీ మూసపోసినట్లు ఉండదు.

వ్యక్తిగతంగా సూర్యకాంతం ముక్కుసూటి మనిషి. సహృదయం, సహాయపడే తత్వం గలది. సున్నితమనస్కురాలు. తాను సుష్ఠుగా భోంచేయటమే కాక, ఇతరులకు కూడా పెట్టేది. కరిగితే ఇతరులకి ఆర్థిక సహాయం కూడా చేసేది. లేదంటే అసలు కరిగేదే కాదు.

ఆమె నటించిన కొన్ని చిత్రాలు, మచ్చుకు:

చిత్ర సౌజన్యం: కిరణ్మయి