వేద కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంగ్ల వికీపీడియా నుండి అనువాదం -

వేద కృష్ణమూర్తి (జననం: 1992 అక్టోబరు 16) ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2011 జూన్ 30న డెర్బీలో ఇంగ్లాండ్ మహిళలతో జరిగిన ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ తో 18 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. తొలి ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ లోనే కృష్ణమూర్తి 51 పరుగులు చేసి సత్తా చాటింది. ఆమె కుడిచేతి వాటం బ్యాటర్, కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలింగ్ చేస్తుంది.

వేద కృష్ణమూర్తి
వేద కృష్ణమూర్తి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వేద కృష్ణమూర్తి
పుట్టిన తేదీ (1992-10-16) 1992 అక్టోబరు 16 (వయసు 31)
Kaduru, కర్ణాటక, India
ఎత్తు1.68 m (5 ft 6 in)
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడి చేయి, లెగ్ స్పిన్, లెగ్ బ్రేక్
పాత్రబ్యాట్స్ వుమన్
బంధువులుఅర్జున్ హోయిసల (భర్త )
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 96)2011 జూన్ 30 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2018 ఏప్రిల్ 12 - ఇంగ్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.79
తొలి T20I (క్యాప్ 26)2011 జూన్ 11 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2020 మార్చి 8 - ఆస్ట్రేలియా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.79
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2009–2014కర్ణాటక మహిళా క్రికెట్ సంఘం (స్క్వాడ్ నం. 79)
2015–presentరైల్వేస్ మహిళా క్రికెట్ జట్టు (స్క్వాడ్ నం. 79)
2017–2018హోబర్ట్ హరికేన్స్ (WBBL (స్క్వాడ్ నం. 79)
2019–2020IPL వేగం (స్క్వాడ్ నం. 79)
మూలం: ESPNcricnfo, 8 March 2020

జీవిత విశేషాలు[మార్చు]

కుటుంబంలోని నలుగురు తోబుట్టువులలో వేద ఆఖరుది. ఆమె 3 సంవత్సరాల వయస్సులోనే వీధి క్రికెట్ ఆడటం ప్రారంభించింది. చిన్నతనంలో ఆమె కరాటే తరగతులను ఎక్కువ ఇష్టపడలేదు. అయితే తన బలాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడే యుద్ధ కళలను ఆమె అభ్యాసం చేసింది. వేద 12 సంవత్సరాల వయస్సులో కరాటేలో బ్లాక్ బెల్ట్ సంపాదించింది. ఆమె తల్లి చెలువమాబా దేవి, ఆమె అక్క వత్సలా శివకుమార్ 2021లో కోవిడ్-19తో మరణించారు.[1]

కృష్ణమూర్తికి అనేక మారుపేర్లు ఉన్నాయి. రైల్వేస్, భారతీయ జట్లలో ఆమెను ఎల్లప్పుడూ " వేద్" అని పిలుస్తారు. హరికేన్స్ వద్ద ఆమెను " డర్త్ "లేదా" డార్తీ" అని పిలిచేవారు, కొరిన్నే హాల్ ఈ పేరును డార్త్ వాడెర్ బదులుగా ఎంచుకున్నారు. కర్ణాటకలో ఆమెను " ధనా " అని పిలుస్తారు. ఆ పదం అనువాదం "... అక్షరాలా 'ఆవు', కానీ ఇక్కడ సందర్భంలో 'ధనా' అంటే తన ఎత్తు కారణంగా 'గేదె' అని పిలుస్తున్నారు అని అర్థం అని వేద పేర్కొంది. తాను ఆడటం ప్రారంభించినప్పుడు మాత్రం తన పొడవు కేవలం నాలుగు అడుగుల మాత్రమే అని ఆమె వివరించింది.

2022 సెప్టెంబరులో, ఆమె కర్ణాటకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు అర్జున్ హొయసలతో నిశ్చితార్థం చేసుకున్నట్లు వేద ప్రకటించింది. 12.1.2023 తేదీన నాడు వివాహం జరిగింది.[1]

క్రికెట్ విశేషాలు[మార్చు]

2005లో ఆమె తన 13 సంవత్సరాల వయస్సులో కర్ణాటక క్రికెట్ సంస్థలో శిక్షణ తీసుకోవడము ప్రారంభించింది. ఆమె ప్రతిభను గ్రహించిన సంస్థ డైరెక్టర్ ఇర్ఫాన్ సేత్, ఆమె నైపుణ్యాలను మరింత మెరుగుపర్చడానికి ఆమెను బెంగళూరుకు మార్చమని వేద తండ్రిని కోరారు. వేద తండ్రి కేబుల్ ఆపరేటర్. కర్ణాటకలోని కడూరులోని ఒక చిన్న పట్టణం నుండి బెంగళూరుకు తన చిన్న కుమార్తె దేశం కోసం ఆడాలనే కలను సాకారం చేయడానికి వెళ్లారు. బెంగళూరులోని కర్ణాటక క్రికెట్ సంస్థలో ఆమె శిక్షణ పొందింది. వేద ఇర్ఫాన్ సేత్ ను క్రికెట్ ఆట ప్రాథమికాలను నేర్పించిన తన మొదటి శిక్షకుడిగా పరిగణించింది. అపూర్వా శర్మ, సుమన్ శర్మ వంటి శిక్షకు (కోచ్) లు కూడా ఆమెను క్రికెట్ క్రీడాకారిణిగా తీర్చిదిద్దడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆమె చిన్నతనంలో మిథాలీ రాజ్ను ఆదర్శంగా భావించింది. 12 సంవత్సరాల వయస్సులో వేద తన పాఠశాలలో మిథాలీని సత్కరించడం గమనించింది. తరువాత వేద దేశవాళీ, జాతీయ జట్లలో మిథాలీతో కలిసి ఆడింది.

ఆమె 2011 జూన్లో 18 సంవత్సరాల వయస్సప్పుడు ఇంగ్లాండ్ డెర్బీలో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీతో అంతర్జాతీయ క్రికెట్లో ఆరంభం చేసింది. ఆ మ్యాచ్ లో 51 పరుగులు చేసింది. అదే ఇంగ్లాండ్ పర్యటనలో ఆమె భారతదేశం కోసం టి20 ఆరంభం చేసి బిల్లెరికే, నాట్వెస్ట్ లో జరిగిన టి20 చతుర్భుజి క్రికెట్ శ్రేణి (క్వాడ్రాంగ్యులర్ సిరీస్) లో ఆస్ట్రేలియాతో ఆడింది.[2]

2015 నవంబరులో ఆమె బిసిసిఐ (BCCI) తో బి-గ్రేడ్ ఒప్పందం (కాంట్రాక్ట్) ద్వారా క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకుంది. బిసిసిఐ మహిళా క్రీడాకారులతో ఒప్పందాలను చేసికోవడం ఆదే మొదటిసారి. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) వారి అధ్యక్ష్యులు XI, కార్యదర్శుల XI మధ్య మొట్టమొదటి ట్వంటీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్ ను నిర్వహించింది. దానిలో వేదను అధ్యక్ష్యులు XI కి నాయకత్వం వహించడానికి ఎంపిక చేశారు.[3] 2017 అక్టోబరు లో, ఆమెను 2017-18 మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL) సీజన్ కోసం హోబర్ట్ హరికేన్స్ (హోబర్ట్ హరికేన్స్ టాస్మానియాలోని హోబర్ట్‌లో ఉన్న ఆస్ట్రేలియా ప్రొఫెషనల్ పురుషుల T20 ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు) ఎంపిక చేసింది. ఆమె బిగ్ బాష్ లో ఆడిన మూడవ భారత్ క్రికెట్ క్రీడాకారిణి. వేద కృష్ణమూర్తి డబ్ల్యూబీబీఎల్ మూడవ సీజన్ కోసం హోబర్ట్ హరికేన్స్ (డబ్ల్యూబీబీఎల్యూ) తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో ఆమె హేలే మాథ్యూస్, లారెన్ విన్ఫీల్డ్ ల ద్వయంతో చేరింది.[4]

వేద కృష్ణమూర్తి 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ చివరిరోజు ఆటలో భారత జట్టు తరపున 35 పరుగులు చేసి సత్తా చాటింది.[5] అయితే అక్కడ జట్టు ఇంగ్లాండ్ చేతిలో తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు భారత జట్టుకు 33 బంతుల్లో 29 పరుగులు కావాల్సి ఉండగా, చేతిలో ఐదు వికెట్లు ఉండగా వేద తన వికెట్ కోల్పోయింది.

2017 మహిళల క్రికెట్ ప్రపంచకప్ న్యూజిలాండ్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో కృష్ణమూర్తి 37వ ఓవర్లో బ్యాటింగ్ చేసి కేవలం 45 బంతుల్లో 70 పరుగులు (150కి పైగా స్ట్రైక్ రేట్) చేసింది, ఇందులో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ లో ఆమె ప్రదర్శనను ఎంతో ప్రశంసించారు, ఫలితంగా భారత జట్టు సిరీస్ సెమీఫైనల్ కు చేరింది.

2018 అక్టోబరులో వెస్టిండీస్ తో జరిగిన 2018 ఐసీసీ మహిళల ప్రపంచ ట్వంటీ20 పోటీలకు, 2020 జనవరిలో ఆస్ట్రేలియాలో జరిగే 2020 ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఆమె ఎంపికైంది.

2021 వరిష్ఠ దేశీయ ఒకరోజు ట్రోఫీ ఆడడం కోసం వేద కర్ణాటక జట్టుకు నాయకురాలిగా ఎంపిక అయింది, కానీ జట్టు చివరిరోజు ఆటలో వారు రైల్వేస్ చేతిలో ఓడిపోయారు.

క్రికెట్ గణాంకాలు[మార్చు]

స్థూలంగా వేద క్రికెట్ గణాంకాలు [6]

ఫార్మాట్ Span Mat Runs HS Bat Avg 100s Wkts BBI Bowl Avg 5w Ct St Avg Diff
WODI 2011-2018 48 829 71 25.90 0 3 2/14 22 0 20 1 3.9
WT 20I 2011-2020 76 875 57* 18.61 0.00 0 - 0 38 0
WODI Mat Runs HS Bat Avg 100s Wkts BBI 5w Ct St
2015-2018 ICC Women's Champ 16 417 71 37.9 0 0 - 0 8 0
2017-2017 ICC Women's World Cup 6 153 70 30.6 0 0 - 0 4 0
2017-2017 Tournament Finals 3 66 35 33 0 - - - 1 0
2017-2017 Tournament Semi-Finals 1 16 16* - 0 0 - 0 0 0
2011-2018 Preliminary Matches 33 823 71 35.78 0 0 - 0 17 1
W20I Mat Runs HS Bat Avg 100s Wkts BBI 5w Ct St
2016-2020 Women's T20 World Cup 14 158 36* 19.75 0 0 - 0 10 0
2016-2020 Tournament Finals 3 32 19 10.66 0 - - - 2 0
2018-2018. Tournament Semi-Finals 1 2 2 2 0 - - - 0 0
2011-2020. Preliminary Matches 27 271 36* 15.05 0 0 - 0 15 0

సూచనలు[మార్చు]

  1. 1.0 1.1 "Veda Krishnamurthy ties the knot on mother's birthday, shares pictures". Sports Star. 12 January 2023. Retrieved 4 August 2023.
  2. "Krishnamurthy, Bisht in quadrangular sqaud". ESPN CricInfo. 4 June 2021. Retrieved 4 August 2023.
  3. "India is ready for Women's IPL, says Shantha Rangaswamy - CricTracker". CricTracker (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-09-21. Retrieved 2017-09-24.
  4. IBTimes. "Karnataka takes first step towards Women's IPL; here's how". International Business Times, India Edition. Retrieved 2017-09-24.
  5. Sadhu, Rahul (26 July 2017). "I couldn't sleep the entire night after the World Cup final loss, says Veda Krishnamurthy". The Indian Express.
  6. "Veda Krishnamurthy". ESPN Sports Media Ltd. Retrieved 4 August 2023.