వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి
వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి | |||
పదవీ కాలం 2024 - ప్రస్తుతం | |||
ముందు | ఆదాల ప్రభాకర రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | నెల్లూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | ప్రశాంతి రెడ్డి |
వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక రాజకీయ నాయకుడు. 2018లో ఇతడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ అయ్యాడు.
నేపధ్యము
[మార్చు]వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపుకు తీవ్రంగా కృషి చేశాడు.రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పార్టీ అభిమానుల నుంచి ఆర్థిక వనరులను పార్టీకి సమకూర్చాడు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిఉంటే అప్పట్లోనే వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి రాజ్యసభ స్థానం దక్కేది. పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో ఆ అవకాశం పార్టీ కీలకనేత విజయ సాయిరెడ్డికి దక్కింది. దీంతో జగన్‌పై కినుక వహించిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీకి దూరమయ్యాడు. ఈ సమయంలోనే మానసికంగా టీడీపీకి దగ్గరయ్యాడు. రాజ్యసభ సీటు ఇస్తామంటే పార్టీలో చేరుతానని షరతు పెట్టాడు. అవసరం అయితే మూడో స్థానానికి పోటీ అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని, మొత్తం ఎన్నికల నిర్వహణ భారం తానే మోస్తానని వివరించాడు. అయితే దీనికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అంగీకరించలేదు. ముందు పార్టీలో చేరండి, పనిచేయండి ఆ తరువాత ఆలోచిద్దాం అనడంతో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వెనక్కు తగ్గాడు. 2018లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యే మరలా వైసీపీ పంచనచేరి తన లక్ష్యాన్ని సాధించాడు.[1][2]
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి 2024 మార్చి 02న నెల్లూరులోని పీవీఆర్ కన్వెన్షన్‌లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు.[3] ఆయన జూన్ 24న లోక్‌సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[4] ఆయన 2024 జూన్ 22న లోక్‌సభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా నియమితుడయ్యాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "ఎట్టకేలకు.. పెద్దల సభకు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి". ఆంధ్రజ్యోతి. 2018-03-12. Archived from the original on 2018-03-14. Retrieved 2018-03-12.
- ↑ "Industrialist V P Reddy files nomination for Rajya Sabha from Andhra Pradesh". economictimes.indiatimes.com. 2018-03-07. Retrieved 2018-03-12.
- ↑ Prajasakti (2 March 2024). "టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కుటుంబ సభ్యులు - Prajasakti". Archived from the original on 2 March 2024. Retrieved 2 March 2024.
- ↑ Andhrajyothy (24 June 2024). "ఎంపీల ప్రమాణ స్వీకారం.. ఏపీ నుంచి ఆ ఎంపీ డుమ్మా." Archived from the original on 24 June 2024. Retrieved 24 June 2024.
- ↑ Eenadu (23 June 2024). "లోక్‌సభలో తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు". Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.