వ్యవహార ధర్మబోధిని
వ్యవహార ధర్మబోధిని తొలి తెలుగు రూపక ప్రదర్శన జరిగిన నాటకం.[1] దీనిని ప్లీడరు నాటకం అనికూడా అంటారు.[2] 1880లో కందుకూరి వీరేశలింగం పంతులు ఈ నాటకాన్ని 1880లో రాయగా, అదే సంవత్సరం రాజమహేంద్రవరం లోని విజయనగరం మహారాజు యొక్క బాలికోన్నత పాఠశాలలో మొదటిసారి ప్రదర్శింపబడింది.[3]
కోర్టు ల్లో న్యాయం, గట్టు తగాదాలు, పుట్ట తగాదాలు, స్థలం తగాదాలతో అన్నదమ్ములు బద్ధశత్రువులుగా, సంపన్నులని కూడా రోడ్డు మీద నిలబెట్టి తమాషా చూడటం, కోర్టు దర్శనాన్ని మన కళ్ల ముందు చూపించిన సామాజిక ఉద్యమ తొలి నాటకం ఇది.[4] ఇది ఐదు అంకముల నాటకం. ఇందులోని పాత్రలు నిజ జీవితంలో ఎదురయ్యే పాత్రలే. దీనిని గద్య రూపంలో, వ్యవహారిక భాషలో రాశారు. వ్యవహారిక భాషలో రాయడమనేది ఆకాలంలో సహసమనే చెప్పవచ్చు. మొదటి ప్రదర్శనకు వందలమంది ప్రజలు వచ్చి చూశారని వీరేశలింగం తన స్వీయ చరిత్ర (స్వీ.చ. 1వ భాగంలోని 175వ పుట) లో రాసుకున్నాడు. దీనిని బట్టి మొదటి ప్రదర్శన విజయవంతమైనదని తెలుస్తుంది.
నాటక ప్రదర్శనకు స్ఫూర్తి
[మార్చు]1880లో ధార్వాడ నాటక సమాజం వారు రాజమహేంద్రవరం లోని విజయనగరం మహారాజు యొక్క బాలికోన్నత పాఠశాలలో పాకలు వేసి, వారి నాటకాలను ప్రదర్శించారు (స్వీ.చ. 2వ భాగంలోని 178వ పుట). అది చూసి అక్కడి ప్రజలు వీరేశలింగాన్ని ప్రోత్సహించడంతో ఒక నాటక సమాజాన్ని స్థాపించారు (స్వీ.చ. 1వ భాగంలోని 175వ పుట, (స్వీ.చ. 2వ భాగంలోని 178-79వ పుటలు). అలా తెలుగు నాటకరంగంలో మొట్టమొదటి నాటక సమాజం స్థాపించిన ఘనత వీరేశలింగంకే దక్కింది. ఈ నాటక సమాజంలోని సభ్యులు కూడా ఆ కళాశాల విద్యార్థులే.
అయితే, ఆ కాలంలో నాటకాలలో నటించడం అగౌవరమని భావించేవారు. అందువల్ల, విద్యార్థులు నాటకాలను వేయుటకు వారి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దాంతో, ఈ ప్రథమ నాటక సమాజంలోని సభ్యుల పేర్లుగానీ, వారి ప్రదర్శన విధానం గురించిగానీ తెలియలేదు.
మాలాలు
[మార్చు]- ↑ ఇంటర్మీడియట్ రంగస్థల శాస్త్రము, ప్రథమ భాగం (నాటకము, దర్శకత్వము) (1970). తెలుగు నాటక సంక్షిప్త చరిత్ర (ప్రథమ ముద్రణ ed.). తెలుగు అకాడమీ, హైదరాబాద్. p. 121.
{{cite book}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ పి, ఎస్.ఆర్. అప్పారావు (23 డిసెంబరు 1967). వ్యవహార ధర్మబోధిని (ప్రథమ ముద్రణ ed.). నాట్యమాల. p. 206.
- ↑ విశాలాంధ్ర. "తెలుగు నాటకరంగం - ఆధునిక ధోరణులు". Retrieved 18 July 2017.[permanent dead link]
- ↑ ప్రజాశక్తి. "నాటకమే ఒక ఉద్యమం". Archived from the original on 4 నవంబరు 2015. Retrieved 18 July 2017.