శంతను ఠాకూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శంతను ఠాకూర్
శంతను ఠాకూర్


కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల సహాయ మంత్రి[1]
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 జులై 2021
Serving with [[శ్రీపాద యశోనాయక్]]
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు మన్‌సుఖ్ మాండవీయ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 మే 2019
ముందు మమతా ఠాకూర్
నియోజకవర్గం బంగాన్

వ్యక్తిగత వివరాలు

జననం (1982-08-03) 1982 ఆగస్టు 3 (వయసు 41)
ఠాకూర్‌నగర్ , ఉత్తర 24 పరగణాలు జిల్లా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు మంజుల్ కృష్ణ ఠాకూర్, ఛబీ రాణి ఠాకూర్
జీవిత భాగస్వామి సోమ ఠాకూర్, (వివాహం. 2011 )
సంతానం 2 కుమారులు
నివాసం ఠాకూర్‌నగర్ , ఉత్తర 24 పరగణాలు జిల్లా, పశ్చిమ బెంగాల్, 743287
పూర్వ విద్యార్థి విక్టోరియా యూనివర్సిటీ, కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ
వృత్తి రాజకీయవేత్త, మతగురువు
మూలం [1]

శంతను ఠాకూర్‌ (జననం 1982) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బంగాన్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంపీగా ఎన్నికై జూలై 2021లో నరేంద్ర మోడీ రెండో మంత్రివర్గంలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పని చేసి, 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2][3][4]

జననం & విద్యాభాస్యం

[మార్చు]

శంతను ఠాకూర్ 1982 ఆగస్టు 3న మంజుల్ కృష్ణ ఠాకూర్, ఛబీ రాణి ఠాకూర్ దంపతులకు జన్మించాడు. ఆయన కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్శిటీ నుండి ఆంగ్లంలో బిఎ, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

శంతను ఠాకూర్‌ తన తండ్రి పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి మంజుల్ కృష్ణ ఠాకూర్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి ఫిబ్రవరి 2019లో మతువ సమాజం సామాజిక-మతపరమైన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించిన తరువాత బీజేపీ పార్టీ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లా షెడ్యూల్డ్ కుల రిజర్వ్‌డ్ బంగాన్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిఎంసి అభ్యర్థి మమతా బాలా ఠాకూర్‌ పై ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శంతను ఠాకూర్‌కు 687622 ఓట్లు రాగా, టీఎంసీ అభ్యర్థి మమతా ఠాకూర్‌కు 57628 ఓట్లు వచ్చాయి. శంతను 111594 ఓట్ల తేడాతో టీఎంసీ అభ్యర్థిని ఓడించాడు.  

శంతను ఠాకూర్‌ జూలై 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణలో భాగంగా 8 జూలై 2021న కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఆయన 2024లో రెండోసారి ఎంపీగా ఎన్నికై 2024 జూన్ 9న మోదీ మంత్రివర్గంలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Cabinet Reshuffle: The full list of Modi's new ministers and what they got". The Economic Times. 8 July 2021. Retrieved 8 July 2021.
  2. The Times of India (9 June 2024). "Shantanu Thakur, Sukanta Majumdar West Bengal's faces in PM Modi council of ministers". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  3. The Indian Express (9 June 2024). "Only 2 from Bengal – Thakur retained, Sukanta makes debut" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  4. The Times of India (9 June 2024). "PM Modi 3.0 council of ministers: Who is Sukanta Majumdar". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  5. Eenadu (11 June 2024). "Union Ministers porfolios: కీలక శాఖలు భాజపాకే". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  6. The Hindu (10 June 2024). "Full list of ministers with portfolios in Modi 3.0 government: Who gets what" (in Indian English). Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.