శతాబ్ది రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శతాబ్ది రాయ్
శతాబ్ది రాయ్
జననం (1969-10-05) 1969 అక్టోబరు 5 (వయసు 54)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, దర్శకురాలు
రాజకీయ నాయుకురాలు
క్రియాశీల సంవత్సరాలు1986–ప్రస్తుతం
పురస్కారాలుఉత్తమ సహాయ నటి (బి.ఎఫ్.కె.ఏ. అవార్డు)[1]
లోక్‌సభ సభ్యురాలు
Assumed office
2009 మే 22
అంతకు ముందు వారురాం చంద్ర దోమే
నియోజకవర్గంబీర్బం
వ్యక్తిగత వివరాలు
రాజకీయ పార్టీతృణమూల్ కాంగ్రెస్
జీవిత భాగస్వామిమృగాంక్ బెనర్జీ (2001)
సంతానం2
నివాసంకలకత్తా
Reference[2]

శతాబ్ది రాయ్, (1969 అక్టోబరు 5) బెంగాలీ సినిమా నటి, దర్శకురాలు, రాజకీయ నాయకురాలు.[3] రెండుసార్లు బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ అవార్డులను అందుకుంది. 1980 చివరి, 1990లలో బెంగాలీ సినిమారంగంలో ఉన్నత స్థానానికి చేరుకుంది.[4][5] తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 2009 నుండి తరపున బీర్భూమ్ నియోజకవర్గ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తోంది.

జననం, విద్య[మార్చు]

శతాబ్ది రాయ్ 1969, అక్టోబరు 5న షైలెన్ - నీలిమా రాయ్ దంపతులకు పశ్చిమ బెంగాల్ లోని అగర్పారాలో జన్మించింది.[6] 1986లో సరోజినీ హైస్కూల్ నుండి మాధ్యమిక విద్యలో ఉత్తీర్ణత సాధించి, కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న జోగమయా దేవి కళాశాలలో ఉన్నత విద్యను పూర్తిచేసింది.

సినిమారంగం[మార్చు]

1986లో తపన్ సిన్హా తీసిన ఆటంక సినిమాలో ప్రొసెన్‌జిత్ ఛటర్జీ సరసన తొలిసారిగా నటించింది. ఈ సినిమాలో నటనకు 1987లో ఉత్తమ సహాయ నటిగా బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ అవార్డును గెలుచుకుంది. అమర్ బంధన్ (1986), గురు దక్షిణ (1987), అంతరంగ (1988), అపన్ అమర్ అపన్ (1990), అభిష్కర్ (1990) వంటి చిత్రాలలో నటించి స్టార్ డమ్‌ని పొందింది.[7] ప్రోసెన్‌జిత్ ఛటర్జీతో అలింగన్ (1990), శ్రద్ధాంజలి (1993), లాఠీ (1996), సఖి తుమీ కర్ (1996), చంద్రగ్రహన్ (1997), రానోఖెత్రో (1998), సజనీ అమర్ సోహాగ్ (2000), త్రిశూల్ (200) వంటి సినిమాలలో నటించింది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు జ్యోతి సరూప్ తీసిన నయా జహెర్ (1991) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. రాజా సేన్ తీసిన దేబిపక్ష సినిమాలో నటనకు 2005లో రెండవసారి ఉత్తమ సహాయ నటిగా బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ అవార్డును అందుకుంది.  సమకాలీనులైన దేబశ్రీ రాయ్, రితుపర్ణ సేన్‌గుప్తా వంటి నటీమణులతో పోల్చబడింది.[8] 2006లో వచ్చిన అభినేత్రి సినిమాతో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది.[9]

రాజకీయ జీవితం[మార్చు]

2009లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున పశ్చిమ బెంగాల్‌లోని బీర్బం నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎన్నికలలో ఎంపీగా గెలిచింది.[10][11] 2014, 2019లో మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

శతాబ్ది రాయ్ కి 2001లో మృగాంక్ బెనర్జీతో వివాహం జరిగింది. వారిక ఒక కుమారుడు (సమ్యోరాజ్ బెనర్జీ), ఒక కుమార్తె (సమియానా బెనర్జీ) ఉన్నారు.[12]

అవార్డులు[మార్చు]

అవార్డు సంవత్సరం వర్గం సినిమా ఫలితం
బి.ఎఫ్.జె.ఏ. అవార్డు 1987 సహాయ పాత్రలో ఉత్తమ నటి ఆటంక గెలుపు
2005 దేబిపక్ష గెలుపు
కళాకర్ అవార్డులు 1996 ఉత్తమ నటి సంసార్ సంగ్రామ్ గెలుపు
1999 రాజా రాణి బాద్షా గెలుపు
2005 దేబిపక్ష గెలుపు
2013 ఉత్తమ దర్శకురాలు ఓం శాంతి గెలుపు [13]
భారత్ నిర్మాణ్ అవార్డులు 2001 సినిమారంగ కృషి గెలుపు

సినిమాలు[మార్చు]

హిందీ సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు దర్శకుడు ఇతర వివరాలు మూలాలు
1991 నయా జహెర్ జ్యోతి సరూప్
1993 ములాఖత్ రామానంద్ యాదవ్ [14]
1999 లవ్ స్టోరీ 98 ఇనాయత్ షేక్ [15]

ఒడియా సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు దర్శకుడు ఇతర వివరాలు మూలాలు
1994 ఏమితి భాయి జగతే నహీం ప్రశాంత నంద

సాహిత్య రచనలు[మార్చు]

సంవత్సరం పుస్తకం పేరు ప్రచురణ ఇతర వివరాలు మూలాలు
1995 ఈ శతాబ్దిర్ ప్రేమ్ డేస్ పబ్లిషింగ్
ఝాల్ మిష్టి ప్రేమర్ గోల్పో లోతైన ప్రకాశం
బృష్టి తుమీ ఆమయ్ ఎకా లోతైన ప్రకాశం
జోడి భలోబాసో డేస్ పబ్లిషింగ్
తుమీ శుద్ధు తుమీ [16]
నిర్భోయ్ [17]
2006 స్వీట్ హార్ట్ లోతైన ప్రకాశం

మూలాలు[మార్చు]

 1. "Satabdi Roy Awards and Nominations". FilmiClub. Retrieved 2022-03-31.{{cite web}}: CS1 maint: url-status (link)
 2. "Detailed Profile: Smt. Satabdi Roy". Indian Government. Retrieved 2022-03-31.
 3. "Satabdi Roy movies, filmography, biography and songs". Cinestaan. Archived from the original on 2019-03-31. Retrieved 2022-03-31.
 4. "টালিউডের জনপ্রিয় অভিনেত্রী শতাব্দী রায়". Channel 24. Retrieved 2022-03-31.
 5. "রিপোর্ট কার্ডে দুই মেরুতে শতাব্দী, অনুপম". anandabazar.com. Retrieved 2022-03-31.
 6. "করোনার কবলে শতাব্দী রায়ের পরিবার, আক্রান্ত তারকা সাংসদের বাবা". Hindustantimes Bangla. 29 July 2020. Retrieved 2022-03-31.
 7. "তাপসকে খুব মিস করব: শতাব্দী". Eisamay. 24 April 2019. Retrieved 2022-03-31.
 8. "Lesser Known Facts about Debasree Roy". filmsack.jimdo.com. Archived from the original on 5 August 2017. Retrieved 2022-03-31.
 9. "After Gangster, it's Metro". The Telegraph (India). Retrieved 2022-03-31.
 10. S.Saha. "Satabdi Roy -Political Profile,Contact, Blogs, News, Address". westbengalelectionresult.com.
 11. "The Telegraph - Calcutta (Kolkata) | Nation | Shatabdi takes to playing teacher". The Telegraph (India). Retrieved 2022-03-31.
 12. "My Weekend - Satabdi Roy". telegraph.com. Retrieved 2022-03-31.
 13. "ভীষন ছেলেমানুষীতে ভরা এক বন্ধু". magzter.com (in ఇంగ్లీష్). Retrieved 2022-03-31.
 14. "Mulaquat (1993) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2019-03-31. Retrieved 2022-03-31.
 15. "Love Story 98". Bollywood Hungama (in ఇంగ్లీష్). Retrieved 2022-03-31.
 16. "তুমি শুধু তুমি - শতাব্দী রায়". rokomari.com (in ఇంగ్లీష్). Retrieved 2022-03-31.
 17. "নির্ভয় - শতাব্দী রায়". rokomari.com (in ఇంగ్లీష్). Retrieved 2022-03-31.

బయటి లింకులు[మార్చు]

శతాబ్ది రాయ్ - ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో