శత్రుచర్ల చంద్రశేఖరరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శత్రుచర్ల చంద్రశేఖరరాజు (ఆంగ్లం: Satrucharla Chandrasekhar Raju) 1989 నుంచి 1994 వరకు నాగూరు (గరుగుబిల్లి) నియోజకవర్గం శాసనసభ్యులు. ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి. ఏపీఈసీజీసీ చైర్మన్‌గా పనిచేశారు. కొమరాడ జెడ్పీటీసీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

1978లో అన్న శత్రుచర్ల విజయరామరాజుతో కలిసి ఆయన రాజకీయల్లోకి అడుగుపెట్టారు. 1989లో నాగూరు నియోజకవర్గం నుంచి తొలిసారి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ ఆవిర్భావం తరువాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. 2014, 2019 ఎన్నికల్లో కోడలు పాముల పుష్పశ్రీవాణిని కురుపాం నియోజకవర్గం నుంచి బరిలో దించి ఆమె విజయానికి కృషిచేశారు. ప్రస్తుతం కుమార్తె పల్లవిరాజుతో కలిసి టీడీపీలో ఉన్నారు.

మరణం

[మార్చు]

72 ఏళ్ల శత్రుచర్ల చంద్రశేఖరరాజు అనారోగ్యంతో విశాఖపట్నంలో వైద్యసేవలు పొందుతూ 2022 ఏప్రిల్ 29న కన్నుమూశారు. ఆయనకు భార్య రాజశ్రీదేవి, కుమారుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, కుమార్తె పల్లవిరాజు ఉన్నారు. వైసీపీ అరకు లోక్‌సభ సీటు ఇన్‌చార్జి శత్రుచర్ల పరీక్షిత్ రాజు. శత్రుచర్ల పరీక్షిత్ రాజు జీవిత భాగస్వామి మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి.[1] మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఈయనకు సోదరుడు.

మూలాలు

[మార్చు]
  1. "Former MLA Shatrucharla Chandrasekhararaju Passed Away - Sakshi". web.archive.org. 2022-05-02. Archived from the original on 2022-05-02. Retrieved 2022-05-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)