శత్రువు (సినిమా)
శత్రువు | |
---|---|
![]() | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
నిర్మాత | ఎం. ఎస్. రాజు |
తారాగణం | వెంకటేష్, సప్తపర్ణ |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1991 జనవరి 2 |
భాష | తెలుగు |
శత్రువు 1992 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1][2] ఇందులో వెంకటేష్, సప్తపర్ణ ముఖ్య పాత్రలు పోషించారు. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఎం. ఎస్. రాజు నిర్మించిన ఈ చిత్రానికి రాజ్-కోటి సంగీత దర్శకత్వం వహించారు.[3] నిర్మాత ఎం. ఎస్. రాజుకు ఇదే తొలి చిత్రం. నిజాయితీ పరుడైన లాయరు ఒక భూ కబ్జా దారుడి చేతిలో ప్రాణాలు కోల్పోతే అతను చేరదీసిన జూనియర్ లాయర్ వారి చావుకు కారణమైన వారిని చట్టానికి దొరక్కుండా చంపడం ఈ చిత్ర కథాంశం.
కథ[మార్చు]
అశోక్, రాఘవ, భాస్కర్ అనే ముగ్గురు స్నేహితులు లాయరు దుర్గా ప్రసాద్ దగ్గర జూనియర్ లాయర్లుగా పనిచేస్తుంటారు. దుర్గాప్రసాద్, ఆయన భార్య లక్ష్మి వాళ్ళని కేవలం జూనియర్లగానే కాక కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఉంటారు. నగరంలో పేరుమోసిన వ్యక్తియైన వెంకటరత్నం ఒక స్థలాన్ని కబ్జా చేస్తాడు. ఆ కేసు దుర్గాప్రసాద్ చేపట్టి అందుకు తగ్గ సాక్ష్యాధారాలన్నీ సంపాదిస్తాడు. కానీ అతను కోర్టుకు వెళ్ళేలోపు ఆ ఆవరణలోనే వెంకటరత్నంం తన మనుషుల చేత కాల్చి చంపిస్తాడు. వాళ్ళిద్దరూ అశోక్ చేతుల్లోనే చనిపోతారు. తమను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుల్ని చేసిన వారి రుణం తీర్చుకోవడం కోసం వాళ్ళ మరణానికి కారణమైన వారి మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు అశోక్. శత్రువుల్ని ఒక్కొక్కరినీ టార్గెట్ చేస్తూ వెళుతుంటే చట్టం మీద నమ్మకమున్న ఎ.సి.పి విజయ అతని ప్రయత్నాలను అడ్డుకోవాలని చూస్తుంటుంది.
తారాగణం[మార్చు]
- అశోక్ గా వెంకటేష్
- విజయ గా విజయశాంతి
- వెంకటరత్నం గా కోట శ్రీనివాసరావు
- లాయర్ దుర్గా ప్రసాద్ గా విజయకుమార్
- దుర్గాప్రసాద్ భార్య లక్ష్మి గా సంగీత
- డి.ఐ.జి ప్రకాష్ రావు గా కెప్టెన్ రాజ్
- రామయ్య గా నగేష్
- సాంబయ్య గా బ్రహ్మానందం
- అంకుశం బాబ్జీ
- రాఘవ గా మహర్షి రాఘవ
- మేజర్ మైకేల్ గా పి. ఎల్. నారాయణ
- చింటు గా మాస్టర్ సతీష్
- భాస్కర్
- బాబూమోహన్
- కల్పనా రాయ్
- జార్జ్ గా బాబు ఆంటోనీ
- సత్యమూర్తి గా ఆనందరాజ్
నిర్మాణం[మార్చు]
నిర్మాత ఎం. ఎస్. రాజుకు ఇదే తొలిచిత్రం. ఎం. ఎస్. రాజు తండ్రి రాయపరాజు కూడా నిర్మాతగా పలు సినిమాలు తీశాడు. ఎం. ఎస్. రాజు కూడా తానూ ఆ బాటలోనే నడవాలనుకున్నాడు. సినిమాలు బాగా చూసి కొంచెం పరిజ్ఞానం వచ్చాక దర్శకుడు కోడి రామకృష్ణను కలిశాడు. అలా పుట్టిందే ఈ చిత్ర కథ. ఈ చిత్రంలో అప్పటిదాకా హాలీవుడ్ కే పరిమితమైన వినూత్నమైన స్క్రీన్ ప్లే విధానాల్ని పరిచయం చేశారు.[4]
పాటలు[మార్చు]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అమ్మ సంపంగి రేకు" | సిరివెన్నెల సీతారామ శాస్త్రి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:44 |
2. | "చెయ్ చెయ్" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:59 |
3. | "మాట వింటారా" | వేటూరి సుందరరామ్మూర్తి | మనో, కె. ఎస్. చిత్ర | 4:13 |
4. | "పొద్దున్నే పుట్టింది" | సిరివెన్నెల సీతారామ శాస్త్రి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 3:56 |
5. | "యమతాకిడి" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:02 |
Total length: | 21:54 |
మూలాలు[మార్చు]
- ↑ "'శత్రువు'కి 30 ఏళ్లు". సితార. Archived from the original on 2020-07-14. Retrieved 2020-07-14.
- ↑ "శత్రువు (1991) సినిమా". iqlikmovies.com. Archived from the original on 3 జూన్ 2015. Retrieved 10 January 2018.
- ↑ "శత్రువు సినిమా పాటలు". naasongs.com. Archived from the original on 19 ఏప్రిల్ 2017. Retrieved 10 January 2018.
- ↑ "వెంకటేశ్ 'శత్రువు'కు 30ఏళ్లు". www.eenadu.net. Retrieved 2021-01-02.