శారదా శ్రీనివాసన్
శారదా శ్రీనివాసన్ ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో డ్రామా కళాకారిణి.
జీవిత విశేషాలు
[మార్చు]ఆమె 1935 ఆగస్టు 18న జన్మించింది. ఆమెకు రేడియో హీరోయిన్ అనే పేరు ఉండేది. 1959లో హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో డ్రామా ఆర్టిస్టుగా చేరింది.[1] ఆకాశవాణిలో ప్రి రికార్డింగ్లే, ఎడిటింగులు లేని కాలంలో చిన్న అపశృతి పలికినా నాటకం సర్వ నాశనమై పోతుంది. ఆ రోజుల్లో ఒక్క నండూరి విఠల్ గారితోనే వెయ్యికి పైగా నాటకాలు పలికారు. పింగళి లక్ష్మీకాంతం, స్థానం నరసింహారావు , బందా కనకలింగేశ్వరరావు, బాలాంత్రపు రజనీకాంతరావు, కృష్ణశాస్త్రి , ముని మాణిక్యం, బాలమురళీ, ఓలేటి, బుచ్చిబాబు, దాశరధి సోదరులు, గోపిచంద్, మరెంతమందో మహామహులు పట్టుబట్టి ఆవిడ చేతే తమ రచనలని పలికించేవారు. శ్రీకాంతశర్మ ఆవిడని దృష్టిలో పెట్టుకొని రాసిన “ఆమ్రపాలి” నాటకాన్ని, ఆవిడ 83వ యేట పలికారు. ఆమె స్వర మధుర విన్యాసాన్ని, ఆమెకు అత్యంత ఇష్టమైన పాత్ర తిలక్ “సుప్త శిల”లోని అహల్య. ఆమెకు అజరామరమైన ఖ్యాతిని తెచ్చిన పాత్ర చలం “పురూరవ”లోని ఊర్వశి. 1959 నుంచి 1995 వరకు ఆకాశవాణిలో ఆమె ప్రమేయం లేని కార్యక్రమం లేదంటే అతిశయోక్తి కాదు. [2]
ఆమె హైదరాబాదు కేంద్రంలో డ్రామా వాయిస్ గా మూడు దశాబ్దాలు పైగా పనిచేసి 1996 లో పదవీ విరమణ చేసింది.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె భర్త ఎన్.ఎస్.శ్రీనివాసన్ వేణుగాన విద్వాంసుడు టి.ఎస్.మహాలింగం ప్రియ శిష్యుడు. ఎన్.ఎస్. శ్రీనివాసన్ ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో వేణుగానం కళాకారునిగా మూడు దశాబ్దాలు పని చేశాడు. సంగీత శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన శ్రీనివాసన్ అనేక రూపకాలను ఆకాశవాణిలో సమర్పించాడు. సంగీత విభాగం ప్రొడ్యూసర్ గా పనిచేసి పదవీ విరమణ చేసాడు[4].
రచనలు
[మార్చు]- నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు - ఈ పుస్తకాన్ని తన కుమార్తె నీరదకు అంకితమిచ్చింది. ఈ పుస్తకాన్ని 10 జూలై 2011 న హైదరాబాద్ చిక్కడపల్లి లోని నగరకేంద్ర గ్రంథాలయంలో డాక్టర్.చాట్ల శ్రీరాములు ముఖ్య అతిథిగా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి అధ్యక్షతన జరిగిన సభలో ఆవిష్కరించింది.
మూలాలు
[మార్చు]- ↑ "స్వర సుధాకరులు - ఆల్ ఇండియా రేడియో". www.maganti.org. Archived from the original on 2015-06-23. Retrieved 2020-06-02.
- ↑ "శారదా శ్రీనివాసన్ వీడియో ఇంటర్వ్యూ – మూడో (ఆఖరి) భాగం – సారంగ". magazine.saarangabooks.com. Archived from the original on 2018-07-28. Retrieved 2020-06-02.
- ↑ "పుట:Prasarapramukulu022372mbp.pdf/38 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-06-02.[permanent dead link]
- ↑ "ప్రసార ప్రముఖులు/ప్రసార దంపతులు - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-06-02.[permanent dead link]
బాహ్య లంకెలు
[మార్చు]- "శరత్ కాలమ్: సెక్సీ శారదా శ్రీనివాసన్!". శరత్ కాలమ్. Retrieved 2020-06-02.[permanent dead link]
- మురళి (2021-09-08). "నెమలికన్ను: 'నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు'". నెమలికన్ను. Archived from the original on 2012-05-21. Retrieved 2020-06-02.
- నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు పుస్తకావిష్కరణ[permanent dead link]
- "శారదా శ్రీనివాసన్ గారి రేడియో జ్ఞాపకాల పూలమాల | స్త్రీవాద పత్రిక భూమిక". Retrieved 2020-06-02.