శ్రీకళా రెడ్డి
శ్రీకళా రెడ్డి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1970 రత్నవరం, నడిగూడెం మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | బహుజన్ సమాజ్ పార్టీ | ||
తల్లిదండ్రులు | కీసర జితేందర్‌రెడ్డి, లలితా రెడ్డి | ||
జీవిత భాగస్వామి | ధనంజయ్ సింగ్ | ||
నివాసం | జాన్‌పూర్ జిల్లా | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
శ్రీకళా రెడ్డి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2021లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, జౌన్‌పుర్‌లోని 45వ వార్డు నుంచి జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికై జాన్‌పూర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైంది.[1][2]
శ్రీకళారెడ్డి తండ్రి కీసర జితేందర్ రెడ్డి నల్గొండ జిల్లా కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా, హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన నిప్పో బ్యాటరీ గ్రూప్ కంపెనీని ఏర్పాటు చేశాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]శ్రీకళా రెడ్డి తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, రత్నవరం గ్రామంలో కీసర జితేందర్ రెడ్డి, లలితా దంపతులకు జన్మించింది.[3] ఆమె ఇంటర్మీడియట్ చెన్నైలో, బీకామ్ కోర్సు హైదరాబాద్‌లో పూర్తి చేసి అమెరికాకు వెళ్లి ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసిన అనంతరం భారతదేశానికి తిరిగొచ్చి కుటుంబం నడిపే వ్యాపారాలను చూసుకుంది.
వివాహం
[మార్చు]శ్రీకళా రెడ్డి 2017లో పారిస్‌లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్‌ను పెళ్లి చేసుకుంది.
రాజకీయ జీవితం
[మార్చు]శ్రీకళా రెడ్డి తన భర్త అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2021లో జౌన్‌పుర్‌లోని 45వ వార్డు నుంచి జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికై జాన్‌పూర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైంది.[4] ఆమె 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలలో జౌన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థిగా పోటీ చేయనుంది.[5][6][7][8]
మూలాలు
[మార్చు]- ↑ BBC News తెలుగు (5 July 2021). "ఉత్తర్‌ప్రదేశ్‌లో జడ్పీ ఛైర్మన్‌గా తెలుగు మహిళ శ్రీకళా రెడ్డి". BBC News తెలుగు. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
- ↑ Sakshi (6 July 2021). "మెట్టినింట మెరిసిన కోదాడ బిడ్డ.. ఈమె ఎవరో తెలుసా?". Sakshi. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
- ↑ Andhrajyothy (30 August 2021). "ఏ హోదాలో ఉన్నా సొంత ఊరిని మరువను : శ్రీకళారెడ్డి". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
- ↑ Andhrajyothy (6 July 2021). "యూపీ రాజకీయాల్లో ప్రత్యేకత చాటుతా". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
- ↑ ETV Bharat News (17 April 2024). "యూపీ ఎన్నికల బరిలో 'తెలుగు' మహిళ శ్రీకళా రెడ్డి- పారిస్‌లో సింపుల్‌గా పెళ్లి చేసుకుని వచ్చి!". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
{{cite news}}
: zero width space character in|title=
at position 56 (help) - ↑ Nt News (19 April 2024). "యూపీ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
- ↑ EENADU (18 April 2024). "ఉత్తర్‌ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
- ↑ Andhrajyothy (18 April 2024). "యూపీ ఎన్నికల్లో తెలంగాణ ఆడబిడ్డ పోటీ." Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.